Akhanda 2 Collections: `అఖండ 2` మూవీ రెండు రోజుల కలెక్షన్లు.. రెండో రోజు పడిపోయిన బాలయ్య సినిమా వసూళ్లు..

Published : Dec 14, 2025, 01:49 PM IST

బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2` మూవీ రెండు రోజు కలెక్షన్లకి సంబంధించిన సమాచారం నెట్టింట వైరల్‌ అవుతుంది. మొదటి రోజుతో పోల్చితే భారీగానే వసూళ్లు తగ్గాయి. 

PREV
15
అఖండ 2 తాండవం మూవీ బాక్సాఫీసు వసూళ్లు

బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2 తాండవం` మూవీ శుక్రవారం విడుదలై థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించినా మొదటి రోజు భారీ వసూళ్లని రాబట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? పెరిగాయా? తగ్గాయా అనేది చూస్తే. `అఖండ 2` మూవీ రెండో రోజు తగ్గాయి. మొదటి రోజుతో పోల్చితే  దాదాపు 35-40శాతం కలెక్షన్లు డ్రాప్‌ అయినట్టు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

25
అఖండ 2 రెండు రోజుల వసూళ్లు

`అఖండ 2` మొదటి రోజు ఇండియాలో రూ.30 కోట్ల ఇండియా కలెక్షన్లని సాధించింది. వరల్డ్ వైడ్‌గా రూ.59కోట్లు వసూలు చేసినట్టు టీమ్‌ ప్రకటించింది. ఇందులో ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా తొమ్మిదిన్నర కోట్లని సాధించింది. ఇక రెండో రోజు వసూళ్లు ఇండియాలో ఈ మూవీకి రూ.15కోట్ల  కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ మూవీ ఇప్పటి వరకు ఇండియాలో రూ.46కోట్ల వరకు వసూళ్లని రాబట్టింది. ఇందులో మేజర్‌గా తెలుగు రాష్ట్రాల నుంచే వస్తుండటం విశేషం. మిగిలిన అన్ని భాషలు కలిపి కనీసం కోటి రూపాయలు కూడా రాకపోవడం గమనార్హం. ఈ సినిమాని పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేశారు. బాలయ్య నుంచి వచ్చిన తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. ఆథ్యాత్మిక అంశాలుండటం, శివుడు గురించి అంశాలు ఉండటంతో నార్త్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావించారు. కానీ ఫలితం తలక్రిందులయ్యింది. నార్త్ లో కోటి కూడా వసూలు చేయలేకపోయింది. ఇదే ఇప్పుడు షాకిస్తుంది.

35
అఖండ 2 బడ్జెట్‌, బిజినెస్‌ వివరాలు

ఇదిలా ఉంటే `అఖండ 2` బడ్జెట్‌ వివరాలు చూస్తే, ఈ సినిమాకి రెండు వందల కోట్ల బడ్జెట్‌ అయ్యిందట. కాకపోతే బిజినెస్‌ గట్టిగానే జరిగిందంటున్నారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకుందట. అందుకు గానూ రూ.85కోట్లు చెల్లించినట్టు సమాచారం. అన్ని భాషలు కలిపి శాటిలైట్‌ రైట్స్ రూ.60కోట్లు అని టాక్. థియేట్రికల్‌ రైట్స్ చూస్తే రూ.115కోట్లు అని సమాచారం. తెలుగు స్టేట్స్ లో రూ.88కోట్లు, ఓవర్సీస్‌ రూ.15కోట్లు, రెస్ట్ ఆఫ్‌ ఇండియా రూ.11కోట్లకు అమ్ముడు పోయిందట. ఇందులోనూ నైజాంలో రూ.23.50 కోట్లు, సీడెడ్లో రూ.22 కోట్లు, ఉత్తర ఆంధ్రలో రూ.11.50కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.7.50కోట్లు, వెస్ట్ గోదావరి రూ.5.50కోట్లు, గుంటూరు రూ.8.50కోట్లు, కృష్ణ రూ.5.75, నెల్లూర్‌ రూ.4 కోట్లు అని ట్రేడ్‌ వర్గాల సమాచారం.

45
అఖండ 2 ముందు భారీ టార్గెట్‌

ఈ లెక్కన `అఖండ 2` రిలీజ్‌కి ముందే సేఫ్‌లోకి వచ్చింది. ఎందుకంటే ఈ చిత్రానికి థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ కలిపి దాదాపు రూ.260కోట్ల వరకు వచ్చింది. సినిమాకి పెట్టిన ఖర్చు సుమారు రూ.200కోట్లు. నిర్మాతలు రిలీజ్‌కి ముందే సేఫ్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడు బయ్యర్లకి అసలు పరీక్ష అని చెప్పొచ్చు. ఈ మూవీ ఇప్పటి వరకు నలభై కోట్ల వరక షేర్‌ వసూలు చేసింది. ఇంకా డెబ్బ కోట్లకుపైగా షేర్‌ రావాలి. అంటే రూ.140కోట్లకుపైగా గ్రాస్‌ కలెక్ట్ చేయాలి. అది సాధ్యమేనా అనేది ప్రశ్న. ఈ చిత్రానికి ఆదివారం ఒక్కరోజు భారీ వసూళ్లకి ఛాన్స్ ఉంది. వీక్‌ డేస్‌లో భారీగా పడిపోతాయి. దీంతో ఇంతటి భారీ టార్గెట్‌ రీచ్‌ కావడం కష్టం. అదే జరిగితే బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవబోతుందని చెప్పొచ్చు.

55
బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన నాల్గో సినిమా

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ 2 తాండవం` మూవీ రూపొందిన విషయం తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన నాల్గో సినిమా ఇది. గతంలో `సింహ`, `లెజెండ్‌`, `అఖండ` చిత్రాలు వచ్చాయి. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగా వాయిదా పడింది. అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ నెల 12న ఈ మూవీ విడుదలైంది. ముందు రోజు రాత్రి నుంచి ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కానీ ఫస్ట్ రోజు మాత్రం భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇక ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా, సంయుక్త, పూర్ణ, హర్షాలి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. 14 రీల్స్ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories