ఆదిత్య ఓం `బందీ` మూవీ రివ్యూ

Published : Feb 28, 2025, 09:34 PM IST

ఆదిత్య ఓం ఒకప్పుడు హీరోగా రాణించి మెప్పించారు. కానీ చాలా కాలంగా సినిమాలు చేయలేదు. ఇటీవల `బిగ్‌ బాస్‌ తెలుగు 8`తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన తాజాగా `బందీ` అనే చిత్రంలో నటించారు. శుక్రవారం విడుదలైన ఈమూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
15
ఆదిత్య ఓం `బందీ` మూవీ రివ్యూ
Bandhi movie review

ఒకప్పుడు హీరోగా సూపర్‌ హిట్లు అందుకున్నాడు ఆదిత్య ఓం. ఆ తర్వాత కెరీర్‌ డౌన్‌ అవుతూ వచ్చింది. ఇటీవల ఆయన సినిమాలు చేయడమే మానేశాడు. దీంతో ఆయన ఆడియెన్స్ కి దూరమయ్యాడు. సామాజిక కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. గతేడాది `బిగ్‌ బాస్‌ తెలుగు 8`వ సీజన్‌లో కూడా పాల్గొని మరోసారి వార్తల్లో నిలిచారు.

ఇక చాలా గ్యాప్‌ తర్వాత ఇప్పుడు `బందీ` అనే మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు ఆయనే అందించడం విశేషం. రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ మూవీని గల్లీ సినిమా బ్యానర్‌పై వెంకటేశ్వరరావు దగ్గు, రఘు తిరుమల నిర్మించారు. ఈ శుక్రవారం(ఫిబ్రవరి 28)న విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది? ఆదిత్య ఓం చాలా గ్యాప్‌తో అయినా హిట్‌ కొట్టాడా? ఈ మూవీ ద్వారా ఇచ్చిన సందేశం ఏంటి? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

25
Bandhi movie review

కథః
ఆదిత్య వర్మ(ఆదిత్య ఓం) పేరుమోసిన లాయర్‌. భారీ కేసులను వాధించడంలో ఆయన దిట్ట. అయితే ఓ అడవికి సంబంధించిన కేసుని ఆయన వాధిస్తుంటాడు. ఆయన్ని పర్యావరణ వేత్తలు వ్యతిరేకిస్తుంటారు. అయితే ఆదిత్య వర్మకి సంబంధించిన రెండు ఫేజులను ఇందులో పారలల్‌గా చూపించారు. ఒకటి ఓ రిసార్ట్ లో ఆయన లగ్జరీలను అనుభవిస్తుంటాడు.

తన భార్య పిల్లలను వదిలేసి, ఆఫీస్‌కి సెలవు పెట్టి, ప్రియురాలితో రీసార్ట్ లో ఎంజాయ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తాడు. ఆయన లవర్‌ రావడానికి ఆలస్యం అవుతుంది. ఈ లోపు ఆమె ఆదిత్య వర్మకి కొన్ని టాస్క్ లు ఇస్తుంటుంది. రెండోది అడవిలో ఆదిత్య వర్మని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోతారు. అందులో తనని తాను రక్షించుకునేందుకు అడవి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటాడు.

తినడానికి తిండి లేదు, సరైన నీళ్లు లేవు. ఆకలితో అలమటిస్తుంటాడు, నీళ్ల కోసం అరుస్తుంటారు. కానీ ఆయన్ని పట్టించుకునే మానవుడు లేడు. ఇంకోవైపు రీసార్ట్ లో ఆదిత్య వర్మ లగ్జరీస్‌ అనుభవిస్తూ తన ప్రియురాలి కోసం వెయిట్‌ చేస్తుంటాడు. కానీ ఆమె అదిగో ఇదిగో అంటూ ఆలస్యం చేస్తూనే ఉంటుంది. టాస్క్ ల మీద టాస్క్ లు ఇస్తూనే ఉంటుంది.

మరి ఆమె ఎలాంటి టాస్క్ లు ఇచ్చింది? ఆ టాస్క్ లు ఇవ్వడానికి కారణమేంటి? రీసార్ట్ లో ఎంజాయ్‌ చేసే ఆదిత్య వర్మని అడవిలోకి ఎందుకు వదిలేశారు? అడవిలో ఆదిత్య వర్మ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? అడవిలో సర్వైవల్‌ కోసం స్ట్రగుల్‌ అయ్యే క్రమంలో ఆదిత్య వర్మ ఏం తెలుసుకున్నాడు?. ప్రకృతి గురించి ఆయన తెలుసుకున్న నిజం ఏంటి? చివరికి ఈ కథ ఎలా ముగిసిందనేది మిగిలిన సినిమా. 
 

35
Bandhi movie review

విశ్లేషణః 
`బందీ` ఒక సర్వైవల్‌ థ్రిల్లర్‌.. అడవిలో ఒక వ్యక్తి సర్వైవల్‌ కోసం ఎలాంటి స్ట్రగుల్‌ పడ్డాడు, అడవితో ఎలా పోరాడాడు? అడవిలో ఆయన బతకడం కోసం ఏం చేశాడు? అంతిమంగా అడవికి, జీవితానికి సంబంధించిన ఆయన ఏం తెలుసుకున్నాడనేది సందేశాత్మక కథతో ఈ మూవీని రూపొందించారు.

నీళ్లు, ఫుడ్‌ వంటి ప్రాథమిక అవసరాలు, మనుషుల, కుటుంబం విలువ తెలియని ఓ వ్యక్తికి ఆ విలువని తెలియజేసే కథతో ఈ సినిమా సాగుతుంది. అయితే ప్రారంభం నుంచి ఇది ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుంది. ఆదిత్య వర్మని అడవిలో ఎవరు పడేశారు? ఎందుకు వదిలేశారు? రీసార్ట్ లో ఉన్న ఆదిత్య వర్మ అడవుల్లో ఎందుకు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాడనేది క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుంది.

ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగుతుంది. దీనికి కాస్త థ్రిల్లర్‌ని యాడ్‌ చేయడంతో మధ్య మధ్యలో ఆ థ్రిల్లర్‌ ఎక్స్ పీరియెన్స్ ని కలిగిస్తూ సినిమా సాగుతుంది. అయితే బ్యాక్‌ గ్రౌండ్‌లో ఓ వాయిస్‌ ఆదిత్య వర్మ ఎలాంటి వాడు? ఆయన ఎందుకు ఇలా మారిపోయాడు? అనేది చెప్పే తీరు, కథలోకి తీసుకెళ్లే తీరు బాగుంది. ఇది సాధారణ ఆడియెన్స్ కి కూడా అర్థమయ్యేలా ఉంది. 
 

45
Bandhi movie review

సినిమాలో ప్రకృతికి సంబంధించిన సందేశం క్లీయర్‌. కార్పోరేట్‌ లాయర్‌ ఆదిత్య వర్మకి ప్రకృతి అంటే ఏంటి? ఫారెస్ట్ విలువని, దాని గొప్పతనాన్ని ప్రత్యక్షంగా తెలియజేసే ఉద్దేశ్యంలో ఆ పాత్రని తీసుకెళ్లిన తీరు, ఆయన ఫేస్‌ చేసే స్ట్రగుల్స్  కూడా మనకు కనెక్ట్ అయ్యేలా, మనకు అర్థమయ్యేలా చెప్పడం ఇందులో ప్రత్యేకత.

ఇప్పుడున్న జనరేషన్‌కి మట్టి, నీరు, నేల, గాలి, చెట్టు, తిండి వాటి విలువ తెలియకుండా పెరుగుతున్నారు. డబ్బు అనే మోజులో పడి వీటన్నింటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మన మూలాలను మర్చిపోతున్నారు. ఈ సినిమా ద్వారా ఇందులోని మెయిన్‌ పాత్ర ద్వారా అవన్నీ ఇప్పటి తరానికి అర్థమయ్యేలా చెప్పిన తీరు బాగుంది. దాన్ని ప్రాక్టికల్‌గా చూపించిన తీరు బాగుంది.

అయితే ఇవన్నీ చూపించే క్రమంలో, ఆదిత్య వర్మ ఇవన్నీ ఫేస్‌ చేసే క్రమంలో కథనం కొంత స్లోగా సాగుతుంది. కథ ఎంత సేపు అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అదే సమయంలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్ల డోస్‌ తగ్గింది. చాలా ఫ్లాట్‌గా వెళ్లినట్టుగా ఉంటుంది. ఎంగేజింగ్‌ ఎలిమెంట్లని మరింత బలంగా రాసుకుంటే బాగుండేది.

అలాగే ఆదిత్య వర్మ ఏం చేశాడు? ఎందుకు ఫారెస్ట్ లో పడేశారు అనేది తెలిపే విషయంలో క్లారిటీ మిస్‌ అయ్యింది. సినిమా మొత్తం ఒకే పాత్ర మీద సాగుతుంది. కేవలం వాకీటాకీలో ఓ లేడీ వాయిస్‌ మాత్రమే వినబడుతుంది. ఆ వాయిస్‌ ఆదిత్య వర్మని గైడ్‌ చేస్తుంది. ఈ రెండు తప్ప ఇందులో మరో పాత్ర కనిపించదు. ఈ సినిమా కోసం మేకర్స్ చాలా కష్టపడ్డారు. షూటింగ్‌ విషయంలో చాలా రిస్క్ తీసుకున్నారు. రియల్‌ లోకేషన్‌ షూట్‌ చేశారు. ఆ విషయంలో మేకర్స్ ని అభినందించాలి. ఆదిత్య ఓం కష్టానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.  
 

55
Bandhi movie review

ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ప్రతిభః
ఇందులో ఒకటే పాత్ర. ఆదిత్య ఓం లీడ్‌ రోల్‌లో ఆకట్టుకున్నాడు. చాలా సహజంగా చేశాడు. చాలా కష్టపడ్డాడు. ఇలాంటి సినిమా చేయడానికి ఆయన గట్స్ కి మొక్కాలి. బాగా చేశాడు. ఇక టెక్నీకల్‌గా మూవీ బాగుంది. ముఖ్యంగా సినిమాకి కెమెరానే హీరో. విజువల్స్ ని చిత్రీకరించిన తీరు, మెయిన్‌ రోల్‌ని నడిపించిన తీరు, ఆ పాత్ర రియాలిటీని కాప్చర్‌ చేసిన తీరు అదిరిపోయింది.

విజువల్స్ కూడా అదిరిపోయాయి. ఇక వీరల్‌, లవన్‌, సురేష్‌ సావంత్‌ ఇచ్చిన మ్యూజిక్‌ బాగుంది. ఇంకా బాగా చేయాల్సింది. ప్రకాష్‌ ఝా ఎడిటింగ్‌ బాగుంది. సినిమాకి మరో అసెట్‌ ఎడిటింగ్‌ అని చెప్పాలి. అయితే కథ సందేశాత్మకంగా ఉండటంతో స్క్రీన్‌ ప్లే చాలా ముఖ్యం. ఆ విషయంలో ఆదిత్య ఓం మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మరింత ఎంగేజింగ్‌గా రాసుకోవాల్సింది.

దర్శకుడు రఘు తిరుమల మూవీని బాగానే డీల్‌ చేశాడు. ఆయన కూడా కథని మరింత ఎంగేజింగ్‌గా తెరకెక్కించాల్సింది. కానీ తీసిన తీరు మాత్రం బాగుంది. ప్రయత్నం అభినందనీయమని చెప్పాలి. ఎంతో కష్టపడి, ఎంతో సాహసించి మంచి సందేశం అందించడం కోసం ఇంత రిస్క్ చేసిన టీమ్‌ని అభినందించాలి.

ఫైనల్‌గాః సందేశాత్మక సర్వైవల్‌ థ్రిల్లర్‌ 
రేటింగ్‌ః 2.75

Read  more: `గార్డ్` తెలుగు మూవీ రివ్యూ, రేటింగ్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories