
హిట్ కామెడీ మత్తు వదలరా సీక్వెల్ కావడంతో అందరి చూపు ఈ సినిమాపై ఉంది.అలాగే ఈ మూవీ టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌కు సినిమాకు మంచి బజ్ తెచ్చి ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ చేసాయి. ఆ అంచనాలను సినిమా అందుకుందా,
మత్తు వదలరా స్దాయిలో మంచి వినోదాన్ని దట్టించి ఈ సీక్వెల్ అందించారా. ఆ సినిమాలోలాగ ఈ సారి కూడా సత్య కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ మీద ఆధారపడి గట్టెక్కే ప్రయత్నం చేసారా చూద్దాం.
స్టోరీ లైన్
బాబు మోహన్ (శ్రీ సింహా), యేసుదాసు (సత్య) లకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో HE (High Emergency) Team లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్‌గా జాబ్ లు వస్తాయి..సారీ తెచ్చుకుంటారు. కిడ్నాప్ సాల్వ్ చేయటం వీళ్ల స్పెషలైజేషన్. పకడ్బందీగా ప్లాన్ చేసి వర్కవుట్ చేస్తూంటారు.
అయితే ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎగస్ట్రా డబ్బులు కోసం తస్కరణ విద్యను ప్రదర్శిస్తూంటారు. కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బుల్లో కొంత మొత్తాన్ని లేపేయటం మొదలు పెడతారు. అయితే బయిటపడకుండా మేనేజ్ చేస్తూ కాలక్షేపం చేస్తూంటారు.
ఓ సారి రియా అనే అమ్మాయి కిడ్నాప్ కేసును దర్యాప్తు చేస్తూంటే, ఊహించని విధంగా వీళ్ల కార్లోనే ఆ అమ్మాయి శవం లభిస్తుంది. దాంతో వీళ్లు ఇరుకున పడతార. అక్కడ నుంచి ఆ ఇద్దరిపై ఆకాశ్ (అజయ్), మైఖేల్ (సునీల్) లాంటి ఆఫీసర్స్ అనుమానపడటం మొదలెట్టి, ఛేజ్ చేస్తుంటారు.
అసలు రియా ఎవరు, ఆమె మరణానికి కారణం ఏమిటి? రియా మర్డర్ కేసుకు సినీ హీరో యువ (వెన్నెల కిషోర్)కు సంబంధమేమిటి? రియా హత్య వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి? ఈ కేసును బాబు, యేసు ఎలా పరిష్కరించారు? ఈ కేసులో నిధి (ఫరియా అబ్దుల్లా) ఏం చేసింది? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సాధారణంగా సీక్వెల్ సినిమాలు అదీ హిట్ కామెడీ కు సీక్వెల్ అంటే కష్టం అనిపిస్తాయి. అయితే దర్శకుడు ఛాలెంజ్ గాతీసుకుని ఓ కొత్త లైన్ తీసుకుని ముందుకు వెళ్లాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో ఉన్న స్దాయిలో కామెడీ ఉన్నా, ట్విస్ట్ లు అయితే లేవు.కానీ కథలోకి స్పీడుగా వెళ్లి ఓ టోన్ సెట్ చేసి వరస సీన్స్ , వన్ లైనర్స్ తో దూసుకుపోతాడు.
సత్య,శ్రీ సింహా స్పెషల్ ఏజెన్సీ ఆఫీసర్స్ గా చేసే పనులు నవ్విస్తాయి. కొత్తగానూ అనిపిస్తాయి. ఇలాంటి కామెడీ సీన్స్ హాలీవుడ్ చిత్రాల్లో కనిపిస్తాయి. వాటిని ప్రేరణగా తీసుకుని తెలుగులో చేసినట్లున్నారు. ముఖ్యంగా సినిమాని కమిడియన్ సత్య ని బేస్ చేసుకుని నడిపించారు. అతని బాడీ లాంగ్వేజ్ తో సీన్ లో విషయం లేనిచోట్ల కూడా కామెడీ పండింది.
ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది సెకండ్ హాఫ్ జస్ట్ ఓకే అన్నట్లు నడిచిపోయింది. సినిమాలో ఎక్కువ భాగం వన్ లైనర్స్, అర్గానిక్ గా స్పాంటినియస్ గా అప్పటికప్పుడు పుట్టినట్లు ఉండే ఫన్ తో చాలా వరకూ నవ్వుకొద్దగ్గ సీన్లుతో నింపాలనే దర్శకుడు ఆలోచన బాగానే వర్కవుట్ అయ్యింది. కథగా చెప్పుకోవటానికి ఏమీ లేని ఈ సినిమాలో కథనమే ప్రధానం.
ఇంటర్వెల్ వరకూ జరిగిందంతా చక్కగా నవ్వుకున్న తీరులో ఉండటం కలిసొచ్చింది. చాలా సినిమాల్లోలాగే ఇంటర్వెల్ తర్వాత కామెడీ డోస్ తగ్గి, కథలోకి వెళ్లటం, క్రైమ్ ఇన్విస్టిగేషన్ ఎలిమెంట్స్ పై దృష్టి పెట్టడంతో స్లో అయ్యింది. ఏదైమైనా కథలో ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్ ఉండే సినిమా మరింత రక్తికట్టేది. అలాగే చిరంజీవిని అనుసరిస్తూ సత్య చేసిన డాన్స్ లు మెప్పిస్తాయి.
టెక్నికల్ గా...
ఈ సినిమా సాంకేతికంగా సౌండ్ గానే ఉంది. స్క్రిప్టులో ఫన్ కు అవకాసం ఇచ్చినట్లుగా క్రైమ్ ఎలిమెంట్ కు అవకాశం ఇవ్వలేదు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ఫన్ కు, స్పీడుకు తగినట్లు ఉంది. కాలభైరవ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ అని చెప్పాలి.
సురేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. మంచి విజువల్స్ ఇచ్చాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండాఫ్ లో కాస్తంత స్లో అయినట్లు అనిపించింది. వెన్నెల కిషోర్ క్యారక్టర్ ట్రిమ్ చేయాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్
కాసేపు నవ్వుకోవటానికి ఈ సినిమా మొహమాటం లేకుండా అవకాసం ఇస్తుంది. మిస్ కావద్దు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.75