Monthly Horoscope March 2024: ఓ రాశి వారికి ఈ మాసం సవాల్ లాంటిది, ఒత్తిడి తగ్గించుకుని ఆలోచనలు చేయాలి

First Published Mar 2, 2024, 2:21 PM IST

Monthly Horoscope February 2024: మార్చి నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి..  ఓ రాశివారికి ఈ నెల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి .చేయు వ్యవహారంలో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి.

మాస ఫలాలు :01 మార్చి  2024 నుంచి 31 మార్చి  2024  వరకు
 
 జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

(కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన రాశి ల వారికి అష్టమ అర్ధాష్టమ మరియు ఏలినాటి శని జరుగుతున్నాయి. కావున ప్రతినిత్యం ఈ  శ్లోకాన్ని  11 సార్లు  లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రం గాని పారాయణ చేయడం మంచిది.)

శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥

telugu astrology


మేషం (అశ్విని  భరణి  కృత్తిక 1)
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర


14-3-24 వరకు రవి లాభ స్థానంలో సంచారం తదుపరి వ్యయ స్థానంలో సంచారం మాస ప్రారంభంలో అత్యంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వివాహాలు శుభకార్యాలు జరుగును. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలమైన అధికారాన్ని పొందగలరు. మాస మధ్యమ నుంచి చిన్నపాటి స్థానాచలం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు.

15-3-24 వరకు కుజుడు రాజ్య స్థానంలో సంచారం తదుపరి లాభ స్థానంలో సంచారం.మాస ప్రారంభం నుంచి అధిక శ్రమ. శత్రువుల నుంచి అపకారం జరిగే అవకాశం. మాస మధ్యమ నుంచి ప్రయత్నించే పనులు సకాలంలో పూర్తి కాగలవు. గృహ భూ సంబంధిత సమస్యలు పరిష్కార మగును.

ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహారాలు చెక్క పెట్టుకోవాలి.పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో  అనుకూలమైన మద్దతు లభిస్తుంది.సమస్యలు సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు అందుకోలేరు. ప్రతి పనిలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి బుధ వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.

భరణి నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తిగా గలవు. ఉద్యోగాలు ఉన్నతమైన అధికారం లభించను.

కృత్తిక  నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు బంధు వర్గం తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు  వసూలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ- గురు -శుక్ర

14-3-24 వరకు రవి రాజ్య స్థానంలో సంచారం తదుపరి లాభ స్థానంలో సంచారం భూ గృహ క్రయవిక్రయాలు కలసి వస్తాయి. ఏ కార్యాన్నైనా చాకచక్యంగా తెలివితో పూర్తి చేస్తారు. ఈ మాసం అంతా అనుకూలమైన ఫలితాలు పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఈ మాసం రవి సంచారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

15-3-24 వరకు భాగ్య స్థానంలో సంచారం కుజుడు తదుపరి రాజ్య స్థానంలో సంచారం. ఈ మాసం కుజ సంచారం బాగాలేదు.వైవాహిక జీవితంలో చికాకులు. అనవసరమైన ఖర్చులు.వృధా ప్రయాణాలు.ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

వ్యాపారంలో పెట్టుబడి తగ్గ ధన లాభం కలుగుతుంది.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కాగలవు.బంధుమిత్రుల కలయిక ఆనందం కలగజేస్తుంది.విద్యార్థులు చదవ యందు ప్రతిభ కనబరుస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు నూతన స్త్రీలు పరిచయాలు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర బంధువర్గంతో శుభవార్త వింటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులు నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. తలచిన కార్యాలు లో ఆటంకాలు ఎదురవగలవు. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర  పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారాలు॥ ఋధ -శుక్ర

14-3-24 వరకు రవి భాగ్య స్థానంలో సంచారం తదుపరి రాజ్య స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుంచి మధ్య వరకు చిన్నపాటి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. ఆప్త మిత్రులు తో లేదా బంధు వర్గము తో మనస్పర్థలు రాగలవు. మాస మధ్యమ నుండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందగలరు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.

15-3-24 వరకు కుజుడు అష్టమ స్థానంలో సంచారం తదుపరి భాగ్య స్థానంలో సంచారం. అష్టమ కుజ సంచారం మంచిది కాదు.వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రుణ బాధలు పెరుగుతాయి. నిల్వ చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయాల్సి వస్తుంది. అన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తగును.ఆర్థికంగా బాగుంటుంది.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. క్లిష్టమైన సమస్యలు ను చాకచక్యంగా ఎదుర్కొంటారు.గృహంలో శుభకార్యములు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అన్ని విధాల అభివృద్ధి కనిపించను

ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును.

పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు ఉద్యోగాలు లో అధికారులు తో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. దుష్ట కార్యాలకు దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి  ఆశ్లేష )
నామ నక్షత్రాలు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ

14-3-24 వరకు రవి అష్టమ స్థానంలో సంచారం తదుపరి భాగ్య స్థానంలో సంచారం ఈ మాసమంతా రవి సంచారం అనుకూలం కాదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. చెడు వార్త వినవలసి వస్తుంది.వివాదాలకు వాదోపవాదాలకు  దూరంగా ఉండాలి. వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

15-3-24 వరకు కుజుడు కళత్ర స్థానంలో సంచారం తదుపరి అష్టమ స్థానంలో సంచారం. ఈ సంచారం అనుకూలమైనది కాదు. సంతానం తో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ తలెత్తుతాయి. గృహంలో అశాంతి వాతావరణం.
జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి .చేయు వ్యవహారంలో కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి.మానసిక అశాంతి ఏర్పడుతుంది.బంధువర్గము ద్వారా అనేక అవరోధాలు ఏర్పడవచ్చు. ఉదర సంబంధిత వ్యాధులు తో ఇబ్బంది కలుగును. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాగలవు.

పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి శని వ్యవహారాల్లో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చిరాకు పుట్టించును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆశ్రేష నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములు లో సఖ్యతగా మెలగాలి. భూ సంబంధిత వ్యవహారాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
 

telugu astrology


సింహం (మఖ  పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారాలు॥ ఆది- సోమ

14-3-24 వరకు రవి కళత్ర స్థానంలో సంచారం తదుపరి అష్టమ స్థానంలో సంచారం. ఈ మాసం రవి సంచారం అనుకూలం కాదు.శారీరక బాధలు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృధా కాలక్షేపం చేస్తారు. భార్య తోటి అకారణంగా విరోధాలు రాగలవు.

15-3-24 వరకు కుజుడు శతృ స్థానంలో సంచారం తదుపరి కళత్ర స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుండి అనుకూలమైన ఫలితాలు పొందగలరు. పితృ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. గతంలో ఏర్పడిన వివాదాల కు పరిష్కారం దొరుకుతుంది. మాస మధ్య నుంచి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు.పుత్రులతో ప్రతికూలత వాతావరణ.బంధువర్గంతో అకారణంగా కలహాలు రాగలవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మానసికంగా నిరుత్సాహంగా ఉంటుంది.శారీరక శ్రమ పెరిగి అలసట పొందుతారు.ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.మిత్రులతో సఖ్యంగా వ్యవహరించాలి.

మఘ నక్షత్రం వారికి మాసాధిపతి బుధ వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.

పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తిగా గలవు. ఉద్యోగాలు ఉన్నతమైన అధికారం లభించను.

ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు బంధు వర్గం తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు  వసూలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4 హస్త  చిత్త 1 2)
నామ నక్షత్రాలు
(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారాలు॥ బుధ- శుక్రవారం

14-3-24 వరకు రవి శత్రు స్థానంలో సంచారం తదుపరి కళత్ర స్థానంలో సంచారం మాస ప్రారంభం నుండి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. శత్రు బాధల నుండి బయటపడతారు. అనవసరమైన ఖర్చులు తగ్గి ధనాన్ని పొదుపు చేస్తారు. మాస మధ్యమ నుంచి బంధుమిత్రులతో కలహాలు రాగలవు. సమాజంలో అవమానాలు కలుగ గలవు.

15-3-24 వరకు కుజుడు పంచమ స్థానంలో సంచారం  తదుపరి శతృ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుంచి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అన్నదమ్ములు తో మనస్పర్థలు రాగలవు. అక్కరలేని విషయాలకు దూరంగా ఉండాలి. మాస మధ్య నుంచి తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి.జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు రాగలవు. వ్యాపారం సజావుగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అధికారుల యొక్క మన్ననలు పొందగలరు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

హస్త నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు నూతన స్త్రీలు పరిచయాలు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర బంధువర్గంతో శుభవార్త వింటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

చిత్త నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులు నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. తలచిన కార్యాలు లో ఆటంకాలు ఎదురవగలవు. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ -గురు- శుక్ర

14-3-24 వరకు రవి పంచమ స్థానంలో సంచారం తదుపరి శతృ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుండి సంచారం అనుకూలమైనది కాదు.మీకు వచ్చిన అవకాశాన్ని మీరు నమ్మిన వారే అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. మాస మధ్య నుంచి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.

15-3-24 వరకు కుజుడు చతుర్ధ స్థానంలో సంచారం తదుపరి పంచమ స్థానంలో సంచారం.ఈ మాసం కుజ సంచారం అనుకూలం కాదు.మిత్రుల వలన ధన నష్టం. వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు ఏర్పడును.బంధు సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగాలలో అధికార అభివృద్ధి.కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్ర చేస్తారు.వ్యవసాయదారులకు అన్ని విధాలా యోగించును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి.విద్యార్థులు పరీక్ష యందు ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యవహారాల్లో ఆటంకాలు లేకుండా పూర్తి చేసు కుంటారు.

స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును.

విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు ఉద్యోగాలు లో అధికారులు తో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. దుష్ట కార్యాలకు దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ  జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ మంగళ-గురు -శుక్ర

15-3-24 వరకు రవి చతుర్ధ స్థానంలో సంచారం తదుపరి పంచమ స్థానంలో సంచారం. ఈ మాసం అంతా రవి సంచారం అనుకూలం కాదు. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో అధికారులు తో విరోధాలు రాగలవు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

15-3-24 వరకు కుజుడు తృతీయ స్థానంలో సంచారం తదుపరి చతుర్ధ స్థానంలో సంచారం.మాస ప్రారంభం నుండి అనుకూలమైన ఫలితాలు పొందగలరు. నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారులు మన్ననలు పొందగలరు. మాస మధ్యమ నుంచి చిన్నపాటి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు.వివాహాది శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.వైవాహిక  జీవితం ఆనందంగా గడుపుతారు.దూర ప్రయాణాలు లాభిస్తాయి.ఉద్యోగులకు అధికారంతో కూడిన అనుకూలమైన బదిలీలు జరుగుతాయి.ప్రతి చిన్న సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు.అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది.ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

అనూరాధ నక్షత్రం వారికి మాసాధిపతి శని వ్యవహారాల్లో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చిరాకు పుట్టించును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

జ్యేష్ట నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములు లో సఖ్యతగా మెలగాలి. భూ సంబంధిత వ్యవహారాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.
 

telugu astrology

ధనుస్సు (మూల పూ.షాఢ ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు -శుక్ర- మంగళవారం

రవి 9. కుజుడు 12 -5.  బుధుడు7-10. శుక్రుడు 6-11

14-3-24 వరకు రవి తృతీయ స్థానంలో సంచారం తదుపరి చతుర్ధ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుండి స్థిరాస్తి విషయాలు అనుకూలం. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఉద్యోగాలలో అభివృద్ధి కలుగుతుంది. మాస మధ్యమ నుంచి దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

15-3-24 వరకు కుజుడు ధన స్థానంలో సంచారం తదుపరి  తృతీయ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుంచి అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది. శత్రువుల నుంచి అపకారం జరిగే అవకాశం. మాస మధ్య నుంచి ఉద్యోగాలలో అభివృద్ధి.అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.ఆరోగ్య అన్ని విధాలా బాగుంటుంది. మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. ఉద్యోగ పరంగా అభివృద్ధి కనపడను.సంసార సౌఖ్యం లభిస్తుంది.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.ప్రయాణాలు కలిసి వస్తాయి.

మూల నక్షత్రం వారికి మాసాధిపతి బుధ వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.

పూ.షాఢ నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తిగా గలవు. ఉద్యోగాలు ఉన్నతమైన అధికారం లభించను.

ఉ.షాఢ నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు బంధు వర్గం తో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు  వసూలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.
 

telugu astrology

మకరం (ఉ.షాఢ 2 3 4 శ్రవణం ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారాలు॥ ఆది -సోమ- శని

14-3-24 వరకు రవి ధన స్థానంలో సంచారం తదుపరి తృతీయ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుంచి రవి సంచారం అనుకూలమైనది కాదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నమ్మిన వారి నుంచి మోసపోయే అవకాశం. శత్రు బాధల నుండి విముక్తి కలుగుతుంది.సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.

15-3-24 వరకు కుజుడు జన్మరాశి లో సంచారం తదుపరి ధన స్థానంలో సంచారం. ఈ మాసం కుజ సంచారం అనుకూలం కాదు. వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది. మానసిక బాధలు పెరుగుతాయి.
ఆరోగ్యం బాగుంటుంది.అభివృద్ధి కార్యక్రమాల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి కాగలవు.విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం బాగుంటుంది.చిన్న సమస్యల వలన కోపో ఉద్రేకాలకు గురవుతారు.వివాహాది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.

శ్రవణా నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు నూతన స్త్రీలు పరిచయాలు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర బంధువర్గంతో శుభవార్త వింటారు. విందు వినోదాలలో పాల్గొంటారు.

ధనిష్ఠ  నక్షత్రం వారికి మాసాధిపతి రవి అధికారులు నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. తలచిన కార్యాలు లో ఆటంకాలు ఎదురవగలవు. అనుకోని ప్రయాణం చేయవలసి వస్తుంది.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4 శతభిషం పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారాలు॥ శని- ఆది -సోమ

14-3-24 వరకు రవి జన్మరాశి లో సంచారం తదుపరి ధన స్థానంలో సంచారం.ఈ మాసం అంతా రవి అనుకూలం కాదు.శారీరక శ్రమ పెరిగి అలసి పోగలరు.ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. వైవాహిక జీవితంలో చికాకులు కలుగును.ఇష్టం లేని వారి తో సలహాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

15-3-24 వరకు కుజుడు వ్యయ స్థానంలో సంచారం తదుపరి జన్మ రాశిలో సంచారం. ఈ మాసం అంతా కుజ సంచారం అనుకూలంగా లేదు. అన్నదమ్ముల తో విరోధాలు రాగలవు. ఉద్యోగాలలో అధికారులు చికాకులు రాగలవు.గ్రహ సంచారం అనుకూలంగా లేదు.తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సి వస్తుంది.జీవిత భాగస్వామి తో అకారణ కలహాలు రావచ్చు.సమాజంలో ప్రతికూలత వాతావరణం.ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి రుణము చేయవలసి వస్తుంది.బంధుమిత్రులతో విరోధం ఏర్పడవచ్చు.ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.

శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును. శారీరకంగా మానసికంగా బలహీనంగా నుండును.

పూ.భాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు ఉద్యోగాలు లో అధికారులు తో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. దుష్ట కార్యాలకు దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4 ఉ.భాద్ర రేవతి )
నామ నక్షత్రాలు
(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారాలు॥ గురు- శుక్ర -మంగళ

14-3-24 వరకు రవి వ్యయ స్థానంలో సంచారం తదుపరి జన్మ రాశిలో సంచారం. ఈ మాసం ఈ సంచారము అనుకూలమైనది కాదు. చిన్న బాధ అనారోగ్య  జ్వరాది సమస్యలు రాగలవు.మిత్రులతో అకారణముగా విరోధాలు రాగలవు. అధికారులు తో సమస్యలు రాగలవు.

15-3-24 వరకు కుజుడు లాభ స్థానంలో సంచారం తదుపరి వ్యయ స్థానంలో సంచారం. మాస ప్రారంభం నుంచి అనుకూలం.భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలం. ప్రయత్నించే కార్యాలు లో విజయం సాధిస్తారు. మాస మధ్య నుంచి స్త్రీల తో వివాదాలు రాగలవు. ఖర్చులు విపరీతం గా పెరుగుతాయి.ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కలుగును.మిత్రులతో విరోధం. ఉద్యోగాలలో  అధికారులు తో సమస్యలు.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు.మానసికంగా ఆందోళన గా ఉంటుంది.శత్రు బాధలు పెరగవచ్చు.కుటుంబంలో ప్రతికూలత వాతావరణం. తలపెట్టిన పనుల్లో అపజయాలు రాగలవు.విద్యార్థులు పట్టుదలతో చదవవలెను.

ఉ.భాద్ర నక్షత్రం వారికి మాసాధిపతి శని వ్యవహారాల్లో కోపాన్ని తగ్గించుకుని వ్యవహరించాలి. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి చిరాకు పుట్టించును. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి  కుజుడు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములు లో సఖ్యతగా మెలగాలి. భూ సంబంధిత వ్యవహారాలను ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.

click me!