ఆగష్టు 2021 రాశిఫలాలు... ఈ నెలలో మీ జాతకం ఎలా వుందో చూసుకోండి...

First Published Aug 1, 2021, 7:32 AM IST

ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతున్నది. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

charya

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పనిచేయు స్థలంలో అధికారుల వలన లేదా కుటుంబంలో పెద్దల వలన మానసికంగా ఆందోళన కలుగు సూచన. వ్రుత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు ఎదురైనా కూడా అధిగమించ కలుగుతారు. న్యాయవాద రంగంలోని వారికి కొన్ని ఉన్నత అవకాశములు అప్రయత్నపుర్వకంగా లభిస్తాయి. బంధు వర్గం వలన అవమానాలు లేదా చికాకులు. ఆర్ధికంగా మోసానికి గురి అగుటకు అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలోని వారికి ధనాదాయం సామాన్యం.18 నుండి 24 తేదీల మధ్య కాలంలో దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మాసాంతంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో తలపెట్టిన నూతన కార్యములు విజయం పొందును. వ్యక్త్రిగత జీవితానికి సబందించిన సముచిత నిర్ణయాలు తీసుకో గలుగుతారు. సంకల్ప సిద్ధి లభిస్తుంది. ఈ మాసం సంతాన ప్రయత్నములకు మంచి అనుకూలమైన కాలం. ధనాదాయం బాగుండును. పొదుపు పధకాలలో పెట్టుబడులు పెట్టుటకు ఈ మాసం అనుకూలమైన కాలం. ముఖ్యమైన పత్రాలకు సంబందించిన విషయాలలో జాగ్రత్త ఉండాలి. 19, 20 తేదీలలో వ్రుత్తి జీవనంలో ఉన్నతి లభించును. చివరి వారంలో ఉద్యోగ ప్రయత్నములకు, ఉద్యోగ ఉన్నతి కొరకు ప్రయత్నములు చేయుటకు అనుకూల కాలం. ప్రశంసలు లభించును, ధనాదాయంలో వృద్ది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ధనసంబంధమైన చికాకులు తొలగును. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడును. ఉద్యోగ ప్రయత్నాలలో కార్య విజయం లభిస్తుంది. ధనాదాయం పెరుగును. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. మాతృ వర్గీయులు వైరాగ్య భావన వలన బాధించబడతారు. ద్వితియ వారంలో సామాన్య ఫలితాలు లభిస్తాయి. తృతీయ వారంలో మానసిక ఒత్తిడి తగ్గును. సుఖ సంతోషములు నెలకొనును. సువర్ణ సంబంధ పెట్టుబడులు లాభములు ఏర్పడును. స్త్రీలకు వారసత్వ సంబంధ లాభములు లభించును. భాగస్వామ్య వ్యాపారాలు లాభించును. ఈ మాసంలో 10 వ తేదీ నుండి 15 వ తేదీ మధ్య కాలం వివాహ ప్రయత్నములుకు శుభం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ఆదాయములో పెరుగుదలకు సూచనలు కలవు. శరీర అరోగ్యం సహకరించును. మనసు ఉల్లాసంగా ఉండును. గత కాలపు పెట్టుబడుల నుండి ఆశించిన రాబడి ప్రారంభమగును. కొన్ని వివాదాల నుండి ఉహించని విధంగా బయట పడతారు.ఈ మాసంలో 14, 15, 16 మరియు 17 తేదీలలో కార్యానుకులత లభించును. ప్రభుత్వ రంగంలోని వారికి అదనపు భాద్యతలు లభిస్తాయి , కార్య భారం పెరుగుతుంది. ఔషధ సంబంధ వ్యాపార రంగం లోని వారికి చక్కటి అభివృద్ధి లభించును. యువకుల ఆలోచనలు సక్రమ మార్గంలో ఉండును. చిన్న పిల్లల ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. నూతన వస్తువులు ఈ మాసంలో కొనుగోలు చేయుట అంతగా కలసిరాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో ధనాదాయం సామాన్యం. గృహంలో స్త్రీల ఆర్ధిక పరిస్థితి గతం కన్నా ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణంలో సంతోషములు, బంధువులు మిత్రుల నుండి ఆశించిన సహకారములు పొందుదురు. సంతాన ప్రయత్నాలలో విజయం లభించును.ఈ మాసంలో 3,8,9,16 తేదీలు నూతన ప్రయత్నాలకు అనుకూలమైనవి. 2,11,19, 21, 29 తేదీలు మంచివి కావు. కష్టంతో కార్యములు పూర్తి లేదా మానసిక అశాంతిని ఏర్పరచును అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు. అయితే మాస ప్రారంభంలో జ్వరతత్వం వలన బాధపడు సూచనలు ఉన్నవి. నిల్వ ఉంచుకున్న ధనము కొంత వృధా వ్యయం అగును. నమ్మిన వ్యక్తులే ఇబ్బంది పెడతారు. సొంత నిర్ణయాలే మంచివి. మాస మధ్యమం నుండి లాభకరమైన పరిస్థితి ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ సంబంధ ఆటంకములు తొలగును. ప్రతీ వ్యవహారం స్వయంగా పర్యవేక్షించవలసిన పరిస్థితులు ఏర్పడును.కొద్దిగా శ్రమ అధికమగును. ఈ మాసంలో 7,9,11,25 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడుతాయి. ఆదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. కుటుంబంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగును. ద్వితియ వారంలో ముఖ్యమైన పనులలో అవాంతరములు ఎదురగును. అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. అకారణ కలహాలు ఉండవచ్చు. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. జీవన ఆదాయమునకు మాత్రం లోటు ఏర్పడదు. విద్యా సంబంధ అవకాశాముల కొరకు ఎదురుచూస్తున్న వారు శ్రమించవలెను. మహిళలకు కొత్త బాధ్యతలు ఆందోళన కలిగించవచ్చును. ఈ నెలలో 6,14,19,20,24 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో ముఖ్యంగా అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొనుట మంచిది కాదు. అలా వ్యవహరించుట వలన గౌరవ ప్రదమైన జీవనం పోగొట్టుకుంటారు ధనాదాయం సామాన్యం. ద్వితియ వారంలో చేయు ప్రయాణములు ఫలించును.విదేశీ జీవన పరమైన పరీక్షలు లేదా ఇంటర్వ్యూ లు ఎదుర్కోను వారికి విజయం లభిస్తుంది. ఆశించిన విదేశీ ఉద్యోగం లభించును. తృతీయ వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. మాసాంతంలో వ్యాపార వర్గం వారికి చక్కటి వ్యాపార లాభములు ఏర్పడుతాయి ఈ మాసంలో 4,6,10,15,18,22, తేదీలు అనుకూలమైనవి కావు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో ద్రవ్య నష్టములు ఎదుర్కొందురు. సొంత మనుష్యుల గురించిన మీ అభిప్రాయాలు తలక్రిందులు అవుతాయి. వృత్తి జీవనంలోని వారికి అనుకోని రీతిలో ఖర్చులు ఎదురగును. కుటుంబంలో పితృ వర్గీయులకు ఆరోగ్య గండాలు ఉన్నవి. విదేశీ ఉద్యోగ జీవనం చేయువార్కి స్థిరాస్తి నష్టములు లేదా విసా సంబందిత ఇబ్బందులు ఏర్పడు అవకాశం ఉన్నది. స్త్రీలకు అపవాదులు మరియు మనశ్శాంతి లోపించుట వంటి సంఘటనలు ఉన్నవి. ఈ మాసంలో విలాసాల విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. గర్భిణి స్త్రీలు జాగ్రత్త వహించవలెను. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. వ్యయం అధికం అవుతుంది. పొదుపు ప్రణాళికలు విఫలం అవుతాయి. చిన్న విషయాలు కూడా ఇబ్బందికరంగా మారతాయి. స్త్రీలు ప్రేమ వ్యవహారముల వలన నష్టపోవుదురు. తలచిన విధంగా వ్యక్తులు వ్యవహరించరు. అపవాదులు మరియు నమ్మక ద్రోహం ఎదురగును. ఈ మాసంలో 14,15,17 తేదీలలో ఆరోగ్య సమస్యలు మాసాంతంలో కూడా అధిక ధనవ్యయం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈ మాసం అంత అనుకూలం కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో 5,6,7 తేదీలలో కళత్ర సంబంధమైన చికాకులు ఎదురగును. నూతన వ్యవహరాలు ప్రారంభించడానికి ఈ మాసం అనువైన కాలం. వృత్తి వ్యాపారములలో ధనయోగాలు ఉన్నాయి. శుభ సంకల్పములు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో సామాన్య ఫలితాలు ఉన్నవి. ఈ మాసంలో 25,26, 27 తేదీలలో కార్య జయం పొందుతారు. మాసాంతంలో క్రమంగా అభివృద్ధి ని సాధిస్తారు. ఆర్దికంశాలు శుభప్రదం అవుతాయి. వివాహ మూలక ప్రయత్నాలకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలను కలిగించును. చెడు ఆలోచనలు కొనసాగి మనసు నిలకడగా ఉండదు. మానసిక ఆందోళన కొరకు వైద్య సహాయం అవసరమగును. ధనాదాయం సామాన్యం. కుటుంబ వ్యవహారాలలో ఉద్రిక్తత ఎదుర్కొంటారు. తలపెట్టిన ప్రయత్నాలలో విఘ్నములు. మీలో ఉన్న నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించదు. చివరి వారం నుండి పరిస్థితులలో అనుకూల మార్పు వస్తుంది. ఈ మాసంలో 7 నుండి 13 వ తేదీల మధ్య వాహనాల విషయంలో,ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!