డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం తక్కువ అగును. అనారోగ్య సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో వివాదాలు అశాంతిని కలుగ చేయును. కళత్ర సంబంధ విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలందు సామాన్య అనుకూలత ఏర్పడును. ఇనుము సంబంధ వ్యాపారాదులలో నష్టం ఏర్పడును. ఇతరులకు ధనాదాయం సామాన్యం. వృధా ధనవ్యయం అధికంగా ఎదుర్కొందురు. ఈ మాసంలో 9, 12, 13, 14, 18, 22, 26, 30 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ఉద్యోగ జీవనం సాఫీగా కొనసాగును. సంతన లేమీ దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందును. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక వ్యక్తిగత వ్యవహార సమస్య తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోదర వర్గం మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయం మీద ఆధారపడిన వారికి ఈ మాసంలో తీవ్ర ప్రతికూలత ఎదురగును. ధన ఆదాయం అవసరములకు సరిపోతుంది. కుటుంబ పరమైన ఖర్చులు అధికం అగును. గృహంలో శుభ కార్యములు నిర్వహించెదరు. సంతానానికి సంతోషాన్ని కలుగచేయుదురు. నూతన కార్యములకు రూపకల్పన చేయుదురు. పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త అవసరం. ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో తీవ్ర ప్రతికూల ఫలితాలు కలుగచేయు సూచనలు అధికం. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సమస్యలు కలిగించును. ఆలోచనలు కార్యరూపం దాల్చవు. అన్ని విధాల ప్రతిబంధకాలు ఏర్పడును. వృధా ప్రయాణాల వలన ధనము, సమయము కోల్పోవుదురు. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వ్యక్తీ గత జీవన సుఖ సంతోషాలు తగ్గును. జీవన విధానంలో అనిచ్చితి ఏర్పడుతుంది. తలచిన పనులకు దైవ బలం, ఆశీస్సులు అవసరం. విలాస వస్తువులకు సంబంధించిన వ్యయం చేయకండి. స్థిరాస్తి లావాదేవీలలో మధ్యవర్తులను నమ్మకండి. స్త్రీలకు గౌరవ హాని కలిగించు సంఘటనలు కలవు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో అనుకూల కాలం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధమైన జీవనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. గృహంలో నిర్మాణ సంబంధ మార్పులు చేస్తారు. నూతన వస్తువులను ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితో సౌఖ్యం ఏర్పడుతుంది. ధన సమస్యల నుండి బయటపడతారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కీర్తి పెరుగుతుంది. రాజకీయ పరంగా కూడా ఆశించిన సహకారం లభిస్తుంది. సాంకేతికంగా నూతన పరిజ్ఞానం సంపాదించుకొంటారు. కుటుంబ ప్రయాణాలకు సిద్ధం అవుతారు. ఈ మాసంలో 2, 7, 21, 28, 29 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ నెలలో ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో స్వల్ప ఆటంకాలున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు గౌరవ హాని సంఘటనలు కలవు. మాట విలువ తగ్గుతుంది. ఇతరులను విమర్శించుట వలన సమస్యలను కోరి తెచ్చుకుంటారు. మాటలయందు జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు సామాన్యంగా కొనసాగును. ధనాదాయంలో నిలకడ లోపిస్తుంది. ఆర్ధిక విషయాలలో ప్రణాళిక అవసరం. కోర్టు లావాదేవిల వలన ధన వ్యయం అధికమగును. వివాహ ప్రయత్నాలు బెడిసికోట్టును. చివరి వారంలో ఒక ప్రమాదం లేదా పెద్ద నష్టం. నిదానంగా నిర్ణయాలు తీసుకొనవలసి వచ్చును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో ఆర్ధిక ఇబ్బందులు కొనసాగును. ఆర్ధికంగా ఒత్తిడి అధికం అగును. కుటుంబ ఖర్చులు కూడా చికాకులు కలుగచేస్తాయి. వ్యాపార లావాదేవీలు సమస్యలతో కొనసాగును. అఖస్మిక వ్యవహార నష్టం. వైవాహిక జీవనంలో పట్టుదల వలన వ్యవహారాలు సమస్యలపాలగును. మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ విషయాల వలన అశాంతి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో నమ్మక ద్రోహం. ప్రతీ విషయంలో నిగ్రహం ప్రదర్శించాలి. గొడవలకు అవకాశం ఇవ్వకండి. భవిష్యత్ పై నమ్మకం, ఆశావాదం ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో నూతన భాద్యతలు లభించి వాటికి అనుగుణంగా వ్యవహరిస్తారు. ప్రత్యర్ధుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవన మార్గంలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అధికం అవుతాయి. యాత్రసంబంధ ప్రణాళికలు సిద్ధం చేసుకొంటారు. వ్యాపార రంగాల్లో చక్కటి అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. దేవతా ప్రతిష్ట వంటి దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల విశ్వాసం సంపాదించుకొంటారు. నూతన విషయాలలో నిర్ణయాలను వాయిదా వేయకుండా ఉండుట మంచిది. ఈ మాసంలో 13, 14 , 19, 25 తేదీలలో నూతన ప్రయత్నాలు విజయవంతం అగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో నూతన ప్రారంభాలకు ఆశించిన ఋణాలు లభించును. శరీర ఆరోగ్యం కొంత ఇబ్బందులు కలుగచేయును. 14 వ తేదీ వరకూ ప్రయత్నములు సులువుగా విజయవంతం అగును. 14 వ తేదీ తదుపరి అతి కష్టం మీద కార్య విజయం ఏర్పడును. వ్యాపార విస్తరణకు 14 వ తేదీ తదుపరి అనుకూలమైన సమయం కాదు. ఈ మాసంలో పనులు పూర్తిఅవడానికి మధ్యవర్తుల పై ఆదరాపడకండి. అలసత్వం పనికిరాదు. కోర్టు వ్యవహారములు వాయిదా తీసుకోండి. గృహ వాతావరణంలో జీవన సంతోషములు మధ్యమం. ఈ నెలలో 18,25,30 తేదీలు మంచివి కావు. 5,6 తేదీలలో వివాహ ప్రయత్నములకు అనుకూలం. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో గృహంలో ఒక అశుభ సంఘటన ఏర్పడుటకు సూచనలు అధికం. మానసికంగా తీవ్ర సంఘర్షణ ఎదుర్కొందురు. ప్రశాంతత లోపించును. ఈ మాసంలో ఏర్పడు నూతన పరిచయాలు ఇబ్బంది పాలుచేయును. ముఖ్యంగా మూలా నక్షత్ర యువతులు జాగ్రత్తగా ఉండవలెను. ధన ఆదాయం సామాన్యం. ద్వితియ వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు. మిత్రుల సహాయ సహకారములతో అడ్డంకులను అధిగమించెదరు. మిత్రుల సలహాలు ఉపయోగపడును. మూడవ వారంలో వ్యయం అధికమగు సూచన. ఈ మాసంలో 19, 20, 24 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో చాలా అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. సజ్జన సాంగత్యం లభించును. పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర లేదా గృహ లేదా జీవిత భాగస్వామి మూలక ధన లాభములు ఏర్పడును. బ్యాంకు ఋణ బాధలు తొలగుతాయి. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన అనుకూల బాటలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో స్థిరత్వం లభిస్తుంది. 17 వ తేదీ తదుపరి మాసాంతం వరకూ చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడును. దూర దేశ ప్రయాణాలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో అంత అనుకూలమైనది కాదు. ఉహించని విధంగా వ్యాపార వ్యవహారములందు ఆదాయం తగ్గును. భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసుకున్న నిల్వ ధనం కూడా అవసరాలకు ఉపయోగించవలసి వచ్చను. వైవాహిక జీవితంలో ఆశించిన సంతోషాలు లభించవు. పెట్టుబడులు, శారీరక శ్రమ వృధా అగును. మానసికంగా ఒంటరితనం బాధించును. 13 వ తేదీ తదుపరి తలపెట్టిన ఏ ప్రయత్నం అనుకూలించక నిరాశ ఆవహించును. ఈ మాసంలో 13, 16, 17, 25, 26 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ నెలలో గత కాలంలో నిలిచిపోయిన పనులు, కార్యములను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంతాన సంబందిత విషయాలలో మాత్రం చికాకులు ఏర్పడును. సంతానం కొరకు అధికంగా ధనం ఖర్చుపెట్టవలసి వచ్చును. స్నేహితుల పనులు కోసం వృధాగా శ్రమించవలెను. గృహ సంతోషములు మధ్యమం. ఈ నెలలో 22 నుండి 29 తేదీల మధ్య ఆర్ధిక సంబంధ కార్యక్రమాలలో జాగ్రత్త వహించవలెను. చివరి వారంలో వ్యాపార రంగంలోని వారికి ఆకస్మికంగా ధనాదాయం స్థంభించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.