కాంగ్రెస్‌ కూటమిలోకి కేసీఆర్, జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి

First Published May 21, 2019, 1:49 PM IST

కేంద్రంలో  బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడ చంద్రబాబునాయుడు కలుపుకొనిపోయే అవకాశం ఉందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. 
 

రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన పార్టీలను చంద్రబాబునాయుడును కాదని తమ కూటమిలో కలుపుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సాహసం చేసే అవకాశం ఉంటుందా.... అదే జరిగితే బాబు ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
undefined
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండేందుకు గాను చంద్రబాబునాయుడు బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో పలు పార్టీల నేతలతో చంద్రబాబునాయుడు సమావేశాలు నిర్వహించారు.
undefined
ఈ నెల 19వ తేదీ రాత్రి బాబు అమరావతికి తీరిగి వచ్చారు.ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎం మమత బెనర్జీతో భేటీ అయ్యారు. మమతతో భేటీ అయిన తర్వాత బాబు ఢిల్లీకి చేరుకొన్నారు. ఢిల్లీలో కూడ పలు పార్టీల నేతలతో ఆయన సమావేశమయ్యారు.
undefined
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తన వంతు ప్రయత్నాలు చేశారు. ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. మరో వైపు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్, వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీకి కూడ కాంగ్రెస్ కూటమిలోకి ఆహ్వానిస్తారా అనే చర్చ సాగుతోంది.
undefined
బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చూసేందుకు అవసరమైతే కేసీఆర్‌ను తమ కూటమిలో చేర్చుకొనేందుకు అభ్యంతంరం లేదనే రీతిలో చంద్రబాబునాయుడు సంకేతాలు ఇచ్చినట్టుగా టీడీపీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఇదే విషయమై చంద్రబాబునాయుడు కూడ నాన్ బీజేపీయేతర పార్టీల సమావేశంలో కూడ చెప్పారని అంటున్నారు.
undefined
మరో వైపు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలోకి వైసీపీని బాబు ఆహ్వానిస్తారా అనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది. జాతీయ రాజకీయ అవసరాల రీత్యా బాబు వైసీపీని ఆహ్వానిస్తే ఆ పార్టీ ఎలా స్పందిస్తోందో అనేది కూడ ఆసక్తికరంగా మారింది.
undefined
ఏపీ రాష్ట్రంలో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా వైసీపీ ఉంది. అయితే వైసీపీని తమ కూటమిలోకి చంద్రబాబునాయుడును కాదని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే బాబు ఎలా స్పందిస్తారా..... ఒకవేళ అదే జరిగితే బాబు ఎలా రియాక్ట్ అవుతారనేది కూడ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
undefined
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు మాత్రం కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ఎంపీ సీట్లు దక్కుతాయని ప్రకటించాయి. అయినా కూడ చంద్రబాబునాయుడు తన ప్రయత్నాలను మాత్రం వీడలేదు.
undefined
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత డిఎంకె చీఫ్ స్టాలిన్, కర్ణాటక సీఎం కుమారస్వామి, బీఎస్పీ చీఫ్ మాయావతి వైఖరిలో మార్పులు వచ్చినట్టుగా కన్పిస్తున్నాయి.ఈ నెల 23వ తేదీన తర్వాత తమ వైఖరి ఏమిటో చెప్పాలని కూడ ప్రాంతీయ పార్టీలు వేచి చూసే ధోరణితో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు
undefined