Personality Test: మీరు నిద్రపోయే పొజీషనే.. మీరు ఎలాంటి వారో తెలియజేస్తాయి తెలుసా?

Published : Jun 07, 2022, 11:04 AM IST

Sleeping Position Personality Test: కొందరు బోర్లా పడుకుంటే మరికొందరు సైడ్ కు తిరిగి ఇంకొందరు వెల్లకిలా పడుకుంటారు. అయితే మీరు నిద్రపోయే పొజీషన్ ను బట్టి మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవచ్చంటున్నారు  స్లీప్ సైకాలజిస్టులు (Sleep psychologists). అదెలాగో చూద్దాం పదండి..   

PREV
110
Personality Test: మీరు నిద్రపోయే పొజీషనే.. మీరు ఎలాంటి వారో తెలియజేస్తాయి తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా స్లీప్ సైకాలజిస్టులు (Sleep psychologists) మరియు నిపుణులు మనం నిద్రపోయే స్థానాలకు, మన వ్యక్తిత్వానికి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఎన్నో అధ్యయనాలు చేశారు. రోజంతా మనం ఎలా పనిచేస్తాం, ఎలా నడుస్తాం, ఏ కాఫీ ఆర్డర్ చేస్తాం, ఎలా నిద్రపోతాం మొదలైన వాటిపై ప్రభావం చూపించే పవర్ హౌస్ మన subconscious.కానీ దాదాపుగా అందరూ మనం ఎలా నిద్రపోతామనే దానిపై దృష్టి పెట్టము. నిద్రొస్తే చాలు మనకు ఇష్టమైన పొజీషన్ లో మంచం మీద ముడుచుకుని పడుకుంటాము. మనం నిద్రపోయే స్థానం (Sleeping position) మీ వ్యక్తిత్వం (Personality) గురించి ఏమి చెబుతుంతో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

210

మీరు మీ వీపుపై పడుకుంటే (sleep on your back): మీరు మీ వీపై పై పడుకున్నట్టైతే మీ వ్యక్తిత్వం మీరు center of attention గా ఉండటానికి ఇష్టపడతారని చెబుతుంది. మీరు ఆశావాద వ్యక్తి (optimistic person), భావసారూప్యత (Symmetry)కలిగిన వ్యక్తుల Relationships ను కలిగి ఉంటారు. మీకు నచ్చితేనే ఏపనైనా చేస్తారు. ముఖ్యంగా మీ ప్రమాణలకు (standards)అనుగుణ౦గా ఉ౦డని లేదా మీకు సంబంధించని, నచ్చని విషయాల్లో అస్సలు పాల్గొనరు. మీరు మీ నుంచి అలాగే ఇతరుల నుంచి ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. 

310

తియ్యని, మాయ మాటలు, అబద్దాల కంటే.. మీ నుంచి ఇతరులు సత్యాన్నే ఎక్కువగా వింటారు. మీ లక్ష్యాలను సాధించడం కోసం మీరు ఎంతో జాగ్రత్తగా, ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు.  మీరు జీవితంలో విజయం సాధించాననే మనస్తత్వంతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. మంచం మీద పడుకుని మీ ప్రణాళికలను లక్ష్యాలను ఎలా సాధించుకుంటారోనన్న ఆలోచనల 'సమయాన్ని' చాలా ఆస్వాదిస్తారు.

410

మీ వైపులా (On your sides): మీరు మీ వైపులా పడుకున్నట్టైతే.. వ్యక్తిత్వం ఎలా ఉంటదంటే..  మీరు ప్రశాంతమైన, నమ్మకమైన, సులభంగా వెళ్ళే, చురుకైన, గో-గెట్టర్  లాంటి వ్యక్తులను చెప్పొచ్చు. మీరు మీ గతం గురించి పశ్చ్యాతాపపడరు. ఆలోచించరు. అలాగే మీ భవిష్యత్తు గురించి భయపడరు. ఎలాంటి మార్పులు లేదా పరిస్థితితో సంబంధం లేకుండా మీరు అత్యంత అనుకూలంగా ఉంటారు. మీ గురించి, మీ మంచి , చెడుల గురించి మీకు బాగా తెలుసు. మిమ్మల్ని ఇతరులు బాధపెట్టడం అంత సులువు కాదు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీ ముఖంపై చిరునవ్వు ఉంటంది. కష్టాలకు బాధపడే రకం మీరు కాదు. 

510

చేతులు చాచి తమ వైపులా నిద్రపోయే వ్యక్తులు ఇతరులను అనుమానిస్తారు. వీరు ఇతర వ్యక్తుల అభిప్రాయాలకు పెద్దగా విలువ ఇవ్వరు. వీరు తమ స్వంత నిర్ణయాలకు మరియు ఆలోచనలకు కట్టుబడి ఉంటారు. కాళ్ల మధ్య దిండును కౌగిలించుకొని లేదా టక్ చేసి పడుకునే వ్యక్తులు జీవితంలోని ఇతర అంశాల కంటే సంబంధాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అంతేకాదు వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు.

610

పిండం (Fetal): మీరు పిండం (Fetal) స్థితిలో నిద్రపోతే.. మీరు రక్షణను కోరుకుంటారని అర్థం.  అంతేకాదు.. వీళ్లు రక్షణ విషయంలో ఇతరులు శ్రద్ధ వహించాలని కోరుకుంటారని మీ నిద్రించే పొజీషన్ తెలియజేస్తుంది. పిండం నిద్రపోయే స్థానం (Sleeping position) శిశువు లాగా ముడుచుకుపోవడం వంటిది. పిండం పొజీషన్ లో నిద్రపోవడం ప్రాపంచిక సమస్యల (Worldly problems)నుంచి  Disconnect చేయడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఇతర వ్యక్తులను నమ్మడం చాలా కష్టం. 

710

మీ కుటుంబ సభ్యులు లేదా మీ పెంపకంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల చుట్టూ మీరు చాలా సౌకర్యవంతంగా ఉంటారు. మీరు పిరికివారు. అలాగే  సున్నితమైన వారు కూడా. అమాయకులు, మీరు ఇతరులను తొందరగా క్షమించేస్తారు. ఎక్కువ మంది వ్యక్తుల ఉండాల్సిన అవసరం లేని పనులను చేయడానికే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు ఎక్కువగా పెయింటింగ్, డ్రాయింగ్, రైటింగ్, డ్యాన్స్ మొదలైనవి యాక్టివిటీస్ లో ఉత్సాహంగా ఉంటారు. 
 

810

మీ పొట్ట మీద (On your stomach): మీరు మీ కడుపుపై పడుకున్నట్టైతే.. మీరు స్ట్రాంగ్ పర్సన్ అని, రిస్క్ తీసుకునే వ్యక్తి, సాహసికుడు, అత్యంత ఉత్సాహవంతుడు, సమస్య పరిష్కర్త వంటి వ్యక్తి అని చెబుతుంది. ఇతరులకు నాయకత్వం వహించడం లేదా మార్గదర్శకత్వం వహించడంలో మీరు సమర్థవంతంగా ఉంటారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా మారడానికి ఖచ్చితంగా 8 గంటలు నిద్రపోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు.

910

మీరు కొన్నిసార్లు కూల్ గా లేదా మొరటుగా  ఉంటారు. కానీ బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. అందులో మీరు ఘర్షణకు దూరంగా ఉంటారు. మీరు మంచి స్నేహితులను కలిగి ఉంటారు. అయితే మీరు విమర్శలను మాత్రం హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే మీ గురించి చెడుగా మాట్లాడుకోవడం మీకు ఇష్టం ఉండదు కాబట్టి. అందులోనూ ఇతరుల నుంచి మీ గురించి చెడుగా వినడం మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

1010

నిద్రపోయే పొజీషన్స్ వ్యక్తిత్వాలను ఇలా తెలియజేస్తుంది. అయితే ఎవరూ  కూడా తమ జీవితమంతా ఒకే భంగిమలో నిద్రపోరని గమనించాలి. మనం ఎదుగుతున్న కొద్దీ.. మన subconscious కొత్త లక్షణాలను ఎంచుకుంటుంది లేదా పాత అలవాట్లను విడిచిపెడుతుంది. మనం ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతాం. మన గురించి మనం కొత్త విషయాలను తెలుసుకుంటాం. అలాగే మన మనస్తత్వాలను మారుస్తాం. అందుకే  రెండు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోయే స్థానాల కలయికలో నిద్రపోవడాన్ని కూడా చూడవచ్చు. 

click me!

Recommended Stories