Lung Cancer : సిగరెట్ తాగే అందరికీ లంగ్స్ క్యాన్సర్ ఎందుకు రాదు? కొందరికే ఎందుకు వస్తుంది?

Arun Kumar P   | CMS
Published : Jul 31, 2026, 02:48 PM IST

పొగతాగే అందరికీ క్యాన్సర్ ఎందుకు రాదు? ఈ ప్రశ్న చాలామందిలో ఉంటుంది. దీనికి సమాధానంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

PREV
15
సిగరెట్ తాగే అందరికి క్యాన్సర్ రాదు... ఎందుకు?

పొగ తాగడం ఆరోగ్యానికి అత్యంత హానికరం... దానివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) వస్తుందని మనందరికీ తెలుసు. సిగరెట్ ప్యాకెట్లపైనే పెద్దపెద్ద అక్షరాలతో ''పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం'' అని రాసివుంటుంది... ఊపిరితిత్తులు పాడైపోయినట్లు ఫోటోలు కూడా ఉంటాయి. ఇలా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని తెలిసినా ఒకటి తర్వాత ఒకటి సిగరెట్ ముట్టిస్తూ గుప్పుగుప్పుమంటూ పొగ ఊదేవారు తగ్గడం లేదు. ఇక పల్లెల్లో బిడిలు తాగేవారికి కొదవే ఉండదు.

అయితే రోజూ ప్యాకెట్ల కొద్దీ సిగరెట్లు తాగే కొందరిలో క్యాన్సర్ లక్షణాలు అస్సలు కనిపించవు. మరికొందరిలో మాత్రం సిగరెట్లు తాగడం తక్కువే అయినా తీవ్ర ప్రభావం చూపడం మనం చూస్తుంటాం. అసలు సిగరెట్ తాగే అందరికీ క్యాన్సర్ ఎందుకు రాదు? కొందరిలోనే ఈ సమస్య ఎందుకు తీవ్రమవుతుంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, జన్యు రహస్యాల గురించి ఇటీవల జరిగిన పరిశోధనలు అనేక కీలక విషయాలను వెల్లడించాయి.

25
కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధన ఏం చెబుతోంది?

ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు వేర్వేరు జన్యు నేపథ్యాలు ఉన్న ఎలుకల నుంచి సుమారు 600 కణితులను (ట్యూమర్స్) పరీక్షించారు. అన్ని ఎలుకల్లో కణితుల పెరుగుదల ఒకేలా ఉన్నప్పటికీ, వాటిలో కనిపించిన డీఎన్‌ఏ మ్యుటేషన్లు జన్యు నేపథ్యాన్ని బట్టి వేర్వేరుగా ఉన్నాయి. దీన్ని బట్టి ఒకే స్థాయిలో పొగతాగే ఇద్దరు వ్యక్తులకు క్యాన్సర్ ముప్పు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

35
లంగ్స్ క్యాన్సర్ కు అసలు కారణమిదే...

ఈ అధ్యయనం ప్రకారం... ఒకే స్థాయిలో పొగతాగే ఇద్దరు వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి శరీరతత్వం, జన్యు నిర్మాణం ఆధారంగా పొగాకు వల్ల జరిగే నష్టం లేదా డీఎన్‌ఏ వైపరీత్యాల తీవ్రత మారుతూ ఉంటుంది. అందుకే సిగరెట్, బిడిలు ఎంతలా తాగుతున్నారు అనేదాన్ని బట్టి కాకుండా శరీరతత్వాన్ని బట్టి క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువగా పొగతాగేవారికి క్యాన్సర్ రాకపోడానికి, తక్కువగా తాగినా రావడానికి ఇదే కారణం .

45
మంచి సిగరెట్ ఉండదు..

ఏ ఒక్కరి జన్యువులూ వారిని పొగతాగడం నుంచి పూర్తిగా కాపాడతాయని చెప్పలేం. పొగతాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌నే కాకుండా సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), గుండె జబ్బులు, స్ట్రోక్, అనేక ఇతర క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఈ అధ్యయనం భవిష్యత్తులో అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించడానికి, వారికోసం ప్రత్యేకమైన క్యాన్సర్ స్క్రీనింగ్, చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేయడానికి సహాయపడవచ్చు. అయితే దీనికోసం మనుషులపై మరిన్ని అధ్యయనాలు అవసరం. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం పొగతాగడం మానేయడమే ఉత్తమ మార్గం. జన్యువులు ప్రమాద స్థాయిని ప్రభావితం చేయవచ్చు, కానీ పొగాకు వల్ల కలిగే హానిని పూర్తిగా నిరోధించలేవు. కాబట్టి "సురక్షితమైన సిగరెట్" అంటూ ఏదీ లేదనే విషయాన్ని మర్చిపోకూడదు.

55
ఊపిరితిత్తుల పునరుత్పత్తి స్వభావమే మనిషిని కాపాాడుతోంది

ఊపిరితిత్తుల కణాలు వాటంతట అవే పునరుత్పత్తి చేసుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రకృతి మనకు ఇచ్చిన వరంగా చూడవచ్చు. కేంబ్రిడ్జ్, ఇతర అంతర్జాతీయ అధ్యనాల ప్రకారం ఒక వ్యక్తి పొగతాగడం మానేసినప్పుడు, పొగాకు విషతుల్యాల వల్ల మ్యుటేషన్‌కు గురికాని ఆరోగ్యకరమైన కణాలు మళ్లీ పెరగడం ప్రారంభిస్తాయి. కాలక్రమేణా ఈ ఆరోగ్యకరమైన కణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని మోస్తున్న దెబ్బతిన్న కణాల స్థానాన్ని భర్తీ చేసి, ఊపిరితిత్తుల లోపలి పొరను తిరిగి సరిచేస్తాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలు సిగరెట్ తాగినా, పూర్తిగా మానేసిన క్షణం నుంచి శరీరం జన్యు రక్షణ వ్యవస్థ, డీఎన్‌ఏ మరమ్మత్తు సామర్థ్యం తిరిగి పునరుజ్జీవం పొందడం ప్రారంభిస్తాయన్నదే సైన్స్ ప్రపంచం ఇస్తున్న అతిపెద్ద భరోసా.

Read more Photos on
click me!

Recommended Stories