Hair Care Tips: జుట్టు బలంగా ఉండాలంటే షాంపూలో ఇవి కచ్చితంగా ఉండాలి

Published : Oct 20, 2026, 03:47 PM IST

Hair Care Tips: జుట్టు రాలుతున్నా, చుండ్రు సమస్య వేధిస్తున్నా వెంటనే షాంపూ మార్చేస్తున్నారా? షాంపూలో ఎక్కువ రకాల పదార్థాలు ఉంటేనే జుట్టుకు మంచిదని అనుకుంటున్నారా? షాంపూలో ఎలాంటివి ఉంటే జుట్టు ఆరోగ్యానికి మంచిది?

PREV
15
షాంపూలు మార్చినంత మాత్రాన సమస్య పోతుందా?

జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం, జుట్టు చిట్లిపోవడం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో సమస్య. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల షాంపూలు వాడుతుంటారు. అయితే షాంపూ కొనేటప్పుడు అందులో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో చూస్తున్నారా? ఎక్కువ పదార్థాలు ఉంటేనే అది మంచి షాంపూ అని అనుకుంటున్నారా? నిజానికి జుట్టు సంరక్షణలో ఏవేవో ఇంగ్రీడియంట్స్ కంటే.. అవి ఏ సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడతాయన్నదే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

25
ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మంచి షాంపూనా?

ప్రస్తుతం చాలామంది హెయిర్ కేర్ ప్రొడక్టులు కొనేటప్పుడు వాటి లేబుళ్లను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. అందులో ఏ పదార్థాలు ఉన్నాయి? అవి జుట్టుకు ఎలా ఉపయోగపడతాయి? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది మంచిదే అయినప్పటికీ, షాంపూలో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటే అది మెరుగ్గా పనిచేస్తుందని భావించడం సరికాదని నిపుణులు చెబుతున్నారు.

35
జుట్టు సమస్యను బట్టి పదార్థాలు మారతాయి

భృంగరాజ్‌

ఆయుర్వేదంలో భృంగరాజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. జుట్టు సంరక్షణ కోసం దీన్ని చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. జుట్టు బలంగా ఉండేందుకు, విరిగిపోవడం తగ్గించేందుకు, జుట్టు నాణ్యతను మెరుగుపరిచేందుకు రూపొందించే కొన్ని హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగిస్తారు. అయితే జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. భృంగరాజ్ ఉన్న షాంపూ వాడితే జుట్టు రాలడం తప్పకుండా తగ్గుతుందని భావించకూడదు.

టీ ట్రీ

తలపై చుండ్రు, పొరలుగా చర్మం ఊడిపోవడం వంటి సమస్యల కోసం రూపొందించే కొన్ని ఉత్పత్తుల్లో టీ ట్రీ పదార్థాలను ఉపయోగిస్తారు. వీటికి శుభ్రపరిచే, కొన్ని సూక్ష్మజీవులపై ప్రభావం చూపే లక్షణాలు ఉండటంతో మాడు సంరక్షణ ఉత్పత్తుల్లో చోటు కల్పిస్తారు. అయితే చుండ్రు సమస్యకు కారణాన్ని బట్టి సరైన ఉత్పత్తిని ఎంచుకోవాలి.

45
కండీషనింగ్ ఉత్పత్తుల్లో ఇవి వాడతారు

ఆర్గాన్ ఆయిల్‌

జుట్టు గరుకుగా మారడం, తేమ తగ్గి పొడిబారడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆర్గాన్ ఆయిల్ ఉన్న ఉత్పత్తులు ఉపయోగపడవచ్చు. జుట్టుకు మృదుత్వాన్ని అందించడానికి, తేమ నిలిచి ఉండేందుకు రూపొందించే కండిషనింగ్ ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగిస్తారు.

షియా బటర్‌

హెయిర్ డ్రయ్యర్లు, స్ట్రెయిట్‌నర్లు వంటి పరికరాలను తరచుగా ఉపయోగించడం, జుట్టుకు రంగులు వేయడం వంటి ప్రక్రియల వల్ల జుట్టు పొడిబారి దెబ్బతినవచ్చు. ఇలాంటి జుట్టు సంరక్షణ కోసం రూపొందించే ఉత్పత్తుల్లో షియా బటర్‌ను చేర్చుతారు. ఇది జుట్టులో తేమ నిలిచేలా చేయడంతో పాటు మృదుత్వాన్ని అందించడంలో సహాయపడుతుంది.

55
షాంపూ కొనేటప్పుడు ఏం చూడాలి?

షాంపూ కొనేటప్పుడు అందులో ఎన్ని పదార్థాలు ఉన్నాయో లెక్కపెట్టడం కంటే, మీ జుట్టు, తల చర్మానికి ఏ సమస్య ఉందో ముందుగా గుర్తించాలి. ఆ తర్వాత ఆ సమస్యకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తిని ఎంచుకోవాలి. జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం వంటి సమస్యలకు ఒకే షాంపూ పరిష్కారం అని భావించకూడదు. అలాగే సహజ పదార్థాలు ఉన్నంతమాత్రాన ఒకటే షాంపూ అందరికీ పనిచేయదు. కొందరికి అలర్జీలు, మాడు సున్నితంగా ఉండటం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories