ఉదయం ఏ టైంలో యోగా చేయాలి? ఎంత సేపు చేయాలో తెలుసా?

First Published | Jun 20, 2024, 2:50 PM IST

యోగా మన మనస్సుకు, శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే యోగాతో ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే దీన్ని ఉదయం ఏ సమయంలో చేయాలి? ఎంత సేపు చేయాలో తెలిసి ఉండాలి. 
 

యోగాతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయనే ముచ్చట చాలా తక్కువ మందికి తెలుసు. ఈ విషయం తెలిసిన వారు ఖచ్చితంగా రోజూ యోగా చేస్తుంటారు. మనం ఫిట్ గా ఉండటానికి యోగా బెస్ట్ ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. యోగా చేయడం వల్ల మనం ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాం. ఈ రన్నింగ్ లైఫ్ లో టెన్షన్ లేకుండా ఉండాలంటే ప్రతిరోజూ యోగాను ఖచ్చితంగా చేయాలి. యోగా అనేది శారీరక, మానసిక శ్రమ. ఇది మన శరీరానికి బలాన్ని ఇస్తుంది. మనస్సు ఏకాగ్రతను పెంచుతుంది. అయితే దీని ప్రయోజనాలను పొందాలంటే మాత్రం సరైన సమయంలోనే యోగా చేయాలి. శారీరక, మానసిక ప్రయోజనాలను పొందాలంటే ఏ సమయంలో, ఎంత సేపు యోగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.


ఫిట్ గా ఉండటానికి రోజూ ఎంతసేపు యోగా చేయాలి?

నిపుణుల ప్రకారం.. యోగా ఎంత సేపు చేస్తే మీరు ఫిట్ గా ఉంటారనేది అది పూర్తిగా మీ శారీరక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే రోజూ 30 నిమిషాల పాటు యోగాసనాలు వేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 


ఉదయం ఏ సమయంలో యోగా చేయాలి?

ఉదయం బ్రహ్మ ముహూర్తంలో యోగా చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాతి రెండు గంటలు యోగా చేయడానికి ఉత్తమ సమయమని కూడా కొందరు భావిస్తారు. ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య యోగా చేయొచ్చు. ఈ సమయంలో మీ శరీరం ఫ్రెష్ గా ఉంటుంది. ఈ సమయంలో యోగా చేయడం వల్ల శరీరంలో అనుకూల మార్పులు వస్తాయని నమ్ముతారు. 
 

యోగా ఎవరు చేయకూడదు?

కొంతమంది యోగాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఆడవారు  యోగాభ్యాసానికి దూరంగా ఉండాలని నివేదికలు చెబుతున్నాయి. యోగాసనానికి బదులు మీరు ప్రాణాయామం చేయవచ్చు. అలాగే అలసట,  అనారోగ్యం లేదా ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు కూడా యోగా చేయకూడదు. 

Latest Videos

click me!