వేపాకును ఇలా పెడితే.. చుండ్రు మొత్తమే లేకుండా పోతుంది

First Published | Dec 23, 2024, 4:12 PM IST

చలికాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ దీనివల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. నెత్తి డ్రైగా అవుతుంది. అయితే వేపాకుతో చుండ్రు మొత్తమే లేకుండా చేయొచ్చు. ఇందుకోసం దీన్ని ఎలా వాడాలంటే? 

neem leaves

వేపాకుల్లో ఎన్నో ఔషద లక్షణాలుంటాయి. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి నెత్తిమీద చుండ్రు లేకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

నిపుణుల ప్రకారం.. వేపాకు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతో బాగా పని చేస్తుంది. వేపాకులో ఉండే ఔషద లక్షణాలు జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. అలాగే నెత్తి చికాకును కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. వేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ ఇతో పాటుగా ఎన్నో రకాల మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రు లేకుండా చేయడానికి  సహాయపడతాయి. 


താരൻ

వేపాకును జుట్టుకు పెట్టడం వల్ల మన జుట్టు మూలాల నుంచి బలంగా అవుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకులు నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతాయి. దీంతో మీ జుట్టు బలంగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. మంచి షైనీగా అవుతుంది. నిపుణుల ప్రకారం.. వేపాకులు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తాయి. అలాగే నెత్తిని పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడతాయి. మరి చుండ్రు లేకుండా పోవడానికి వేపాకును ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

కొబ్బరి నూనె, వేపాకు హెయిర్ మాస్క్

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లేదా కొన్ని చుక్కల ఆవనూనె తీసుకోండి. దీనిలో వేపాకు పేస్ట్ ను వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నెత్తిమీది నుంచి వెంట్రుకల చివర్ల వరకు బాగా అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. 

నెయ్యి, వేపాకు హెయిర్ మాస్క్

ఒక గిన్నెలో కొన్ని వేప ఆకులను, తేనె, నెయ్యి వేసి బాగా కలపండి. దీన్ని పేస్ట్ లా చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద రెండు మూడు నిమిషాలు వేడి చేయండి. ఇది చల్లారిన తర్వాత నెత్తికి, జుట్టుకు పెట్టండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. 

పెరుగు, వేపాకు హెయిర్ మాస్క్

వేపాకులను మెత్తగా నూరి అందులో పెరుగు వేసి బాగా కలపండి. దీన్ని తలకు , జుట్టు బాగా పెట్టండి. ఆ తర్వాత ఐదారు నిమిషాల పాటు తలను మసాజ్ చేయండి. అర్థగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. 

ఉసిరి జ్యూస్, వేపాకు హెయిర్ మాస్క్

ఈ హెయిర్ మాస్క్ ను తయారుచేయడానికి ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి మరిగించండి. దీంట్లో వేపాకు పేస్ట్, ఉసిరి రసం వేసి కలపండి. ఇది చల్లరిన తర్వాత నెత్తిమీది నుంచి జుట్టు చివర్ల వరకు బాగా అప్లై చేయండి. దీనిలోని పోషకాలను గ్రహించడానికి నెత్తిని కొద్దిసేపు మసాజ్ చేయండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. 

తేనె, వేపాకు హెయిర్ మాస్క్

కొన్ని మరిగించిన నీళ్లలో కొన్న వేపాకులు, టీ స్పూన్ తేనె వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లను వడకట్టండి. ఆకులను పేస్ట్ చేయండి. దీన్ని నెత్తికి, జుట్టుకు బాగా పట్టించండి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత తలను షాంపూతో శుభ్రం చేయండి. 

Latest Videos

click me!