బాత్రూమ్ కి ఫోన్ తీసుకెళ్తున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా?

First Published Apr 5, 2024, 10:51 AM IST

బాత్రూమ్ కి ఫోన్ తీసుకొని వెళ్లడం వల్ల ఎన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. నిపుణుల సహాయంతో తెలుసుకుందాం..

toilet

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటోంది. ఇది అసలు చాలా కామన్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా.. ఆ ఫోన్ తీసుకొనే వెళ్తూ ఉంటాం. చివరికి బాత్రూమ్ కి కూడా ఫోన్ తీసుకువెళ్లే బ్యాచ్ ఉంది. ఆ ఫోన్ ని పట్టుకొని.. గంటలు.. గంటలు ఆ బాత్రూమ్ లోనే గడిపేస్తారు. అసలు అంతసేపు బాత్రూమ్ లో ఏం చేస్తారో అర్థం కాదు. కానీ.. అలా ఫోన్ ని బాత్రూమ్ కి తీసుకువెళ్లడం వల్ల.. మీరు మీ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు.

బాత్రూమ్ కి ఫోన్ తీసుకొని వెళ్లడం వల్ల ఎన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో.. నిపుణుల సహాయంతో తెలుసుకుందాం..

1.మొదటి రీజన్..  పరిశుభ్రత. టాయ్ లెట్ లో ఎన్ని వేల క్రిములు మన కంటికి కనిపించకుండా ఉంటాయో స్పెషల్ గా చెపక్కర్లేదు. మీరు అలాంటి ప్రదేశంలోకి ఫోన్ తీసుకొని వెళ్తే.. ఆ ఫోన్ కి ఎన్ని అంటుకుంటాయి. అదే ఫోన్ ని మనం... తర్వాత.. ఆఫీసుకు తీసుకువెళతాం. భోజనం దగ్గర వాడతం. ఆ క్రిములతో ఉన్న ఫోన్ పట్టుకొని.. ఆ చేతులతోనే భోజనం చేస్తాం.. మొత్తంగా టాయ లెట్ క్రిములను మనమే స్వయంగా.. అన్ని ప్రదేశాలకు ఫోన్  సహాయం తో తీసుకువెళ్తున్నాం. దీని వల్ల... చాలా రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
 

కొందరు. మేము మా ఫోన్ ని తరచూ క్లీన్ చేస్తూనే ఉంటాం. దాని వల్ల.... క్రిములు ఉండే అవకాశం చాలా తక్కువ అని అనుకుంటూ ఉంటారు. కానీ... సాధారణంగా మనం టాయ్ లెట్ కి తీసుకువెళ్లకముందే.. ఫోన్ పై వేలల్లో క్రిములు ఉంటాయి. అవి మనం ఎంత శుభ్రం చేసినా పోవు. అలాంటిది ఇక టాయ్ లెట్ కి తీసుకువెళ్తే.. ఇంకా ఎన్ని క్రిములు ఫోన్ స్క్రిన్ పై వచ్చి చేరతాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.
 

ఈ శుభ్రత విషయాన్ని పక్కన పెడితే.. సాధారణంగా మనం టాయ్ లెట్ కి వెళ్తే,. ఆ పని తొందరగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చేయాలి అనుకుంటాం. కానీ.. అదే మన చేతిలో ఫోన్ ఉంటే.. అసలు పని మీద ఫోకస్ వదిలేసి.. ఈ ఫోన్ చూస్తూ కాలం గడిపేస్తాం. ఫలితంగా ఎక్కువ గంటలు టాయ్ లెట్ లో గడిపేస్తారు.

Smart Phone in toilet

అంతేకాదు.. మలమూత్ర విసర్జలు చేసే సమయంలో... మన పొట్ట దగ్గర మనం ఒత్తిడి పెట్టాలి. అప్పుడే మలం బయటకు వస్తుంది. కానీ.. అలా కాకుండా.. మనం ఫోన్ చేస్తుంటే... మన మెదడు రిలాక్సేషన్ లో ఉంటుంది. మెదడు అంత రిలాక్సేషన్ లో , సరదాగా మీమ్స్ చూస్తూ నవ్వుతూ ఉంటే.. ఒత్తిడి పెట్టలేం. ఫలితంగా మలం బయటకు రాకపోగా.. మనకు పైల్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. 

టాయ్ లెట్ కి ఫోన్ తీసుకువెళ్లే వారికి ఎక్కువగా ఫైల్స్ వస్తున్నాయి అని.. రీసెంట్ గా  చేసిన ఓ పరిశోధనలోనూ నిరూపితమైంది. వీటితో పాటు మల విసర్జన సరిగా జరగక.. జీర్ణ సమస్యలు కూడ తలెత్తుతాయి. ఇన్ని ఆరోగ్య సమస్యలు.. కొని తెచ్చుకోవడం అవసరం అంటారా..? ఆ పది నిమిషాలు ఫోన్ కి దూరంగా ఉంటే.. ఈ సమస్యలన్నింటికీ మనం దూరంగా ఉండొచ్చు. 

click me!