రోజూ ఉదయం మూడు బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Jun 11, 2024, 4:34 PM IST

బాదం పప్పులు పోషకాలకు మంచి మూలం. వీటిలో రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ ఉదయం మూడు బాదం పప్పులను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. అవేంటంటే?

నట్స్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉన్న బాదం రోజుకు మూడు తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

బాదం పప్పులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే హెల్తీ గింజలు. వీటిలో రకరకాల విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అయితే రోజుకు మూడు బాదం పప్పులను తిం ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

1. బాదంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే దీన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో మీకు మలబద్దకం వంటి జీర్ణ సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

2. డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా బాదం పప్పులు సహాయపడతాయి. ప్రీబయోటిక్ లక్షణాలున్న వారు బాదం పప్పులను తింటే గట్ ఆరోగ్యంగా ఉంటుంది. 
 

soaked almonds

3. ఆరోగ్యకరమైన కొవ్వు పుష్కలంగా ఉండే బాదం పప్పు చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి, అలాగే మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

4. బాదంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే తింటే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. 
 

5. రోజూ మూడు బాదం పప్పులను తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ గింజల్లో ఉండే విటమిన్ ఇ మన  జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 

6. బాదం పప్పుల్లో  కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన ఎముకలను బలంగా ఉంచుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతాయి. 
 

7. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బాదం పప్పులను తినడం వల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది. అంటే ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందన్న మాట. వీటిలో మీ శరీరానికి శక్తినిచ్చే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

8. విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉండే బాదం పప్పులను నానబెట్టి తినడం వల్ల చర్మం కూడా హెల్తీగా ఉంటుంది. 

9. బయోటిన్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది జుట్టును బలంగా చేస్తుంది. వెంట్రుకలు రాలకుండా చూస్తుంది. 

Latest Videos

click me!