ఫ్రిజ్ వీటిని పెట్టకూడదు తెలుసా?

First Published Apr 17, 2024, 10:05 AM IST

ఫ్రిడ్జ్ లో మనం ఎన్నో పెడుతుంటాం. కానీ ఫ్రిడ్జ్ లో కొన్నింటిని పొరపాటున కూడా పెట్టకూడదు. ఒకవేళ మీరు వాటిని పెడితే మీకు ఎన్నో వ్యాధులు వస్తాయి. ఇంతకీ ఫ్రిజ్ లో ఏం పెట్టకూడదంటే? 
 

చాలా మంది వారం రోజులకు సరిపడా కూరగాయలను ఒకేసారి కొనేసి ఫ్రిజ్ లో పెడుతుంటారు. అసలు వీటిని ఫ్రిజ్ లో పెట్టొచ్చా? లేదా? అనేది ఆలోచన చేయకుండా ఫ్రిజ్ ను నింపడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. కానీ దీనివల్ల మనం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫ్రిజ్ లో పెట్టాల్సినవి కాకున్నా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. కానీ దీనివల్ల మన శరీరంపై చెడు ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఫ్రిజ్ లో ఎలాంటి వస్తువులను పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

refrigerate

1. రోజూ వంటకు అవసరమయ్యే టమాటాలు, బీన్స్, మిరపకాయలు, క్యారెట్లు వంటి వాటిని వారం రోజులకు సరిపడా కొనేసి ఫ్రిజ్ లో స్టోర్ చేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎలాగైనా ఇవి తక్కవ ధరకే వస్తాయి. కాబట్టి ఎక్కువగా కొనుగోలు చేసి నిల్వ చేయకండి. మీరు ఈ కూరగాయలను 1 లేదా 2 రోజులకు సరిపడా కొనండి. ఫ్రిజ్ లో పెట్టండి. ఇంతకంటే ఎక్కువ రోజులు వీటిని ఫ్రిజ్ లో పెడితే వాటిలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి. 

fridge

2. అరటిపండ్లను కూడా చాలా కొనేసి ఫ్రిజ్ లో పెట్టేసేవారు చాలా మందే ఉన్నారు. కానీ అరటిపండ్లను ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే వీటిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల  సూక్ష్మజీవులు అరటిపండ్లపై దాడి చేస్తాయి. దీనివల్ల అరటి పండ్లలో పోషకాలు పోతాయి. అలాగే వీటిని తింటే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 

Image Courtesy: YinYangGetty Images


3. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉన్నంత మాత్రాన ఎక్కువ మొత్తంలో కొనుక్కుని నిల్వ చేసి వండుకుని తింటే వాటిలో పోషకాలు ఉండవు. మీరు అవసరమైనంత వండిన తర్వాత మిగిలిపోతే  దానిని 1 రోజు మాత్రమే ఫ్రిజ్ లో పెట్టండి. 
 

4. మాంసాహారాన్ని కూడా ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు కొంతమంది. కానీ దీన్ని ఫ్రిజ్ లో అస్సలు పెట్టకూడదు. చాలా షాపుల్లో మాంసం చెడిపోకుండా ఉండేందుకు రసాయనాలను వాడుతుంటారు. దీన్ని కొని ఫ్రిజ్ లో పెడితే బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. కాబట్టి దీన్ని సురక్షితంగా వాడుకోవడం మంచిది. మాంసాన్ని ఫ్రిజ్ లో పెట్టి తింటే ఎన్నో ఉదర సమస్యలు వస్తాయి.
 

5. మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఒకవేళ అలా చేయాల్సి వచ్చినా ఒకరోజుకు మించి ఎక్కువ రోజులు పెట్టకండి. ఎందుకంటే దీనికి ఎన్నో రకాల బ్యాక్టీరియాలు అంటుకుంటాయి. 

click me!