Men Health Tips: పసుపుతో పురుషులకు ఇన్ని లాభాలున్నాయా..?

Published : Jul 12, 2022, 02:09 PM IST

Men Health Tips: పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా పురుషులకు పసుపు ఎంతో మేలు చేస్తుంది.

PREV
15
 Men Health Tips: పసుపుతో పురుషులకు ఇన్ని లాభాలున్నాయా..?

పసుపును ఎన్నో వ్యాధులకు చికిత్స చేయడానికి, వాటి నివారణ కోసం ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. పసుపులో యాంటీ క్యాన్సర్ (Anticancer) , యాంటీఆక్సిడెంట్,  యాంటీమైక్రోబయల్ (Antimicrobial),యాంటీ ఇన్ఫ్లమేటరీ,  లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో రకాల ప్రమాదకరమైన రోగాలను సైతం తగ్గించగలవు. అందుకే ఆయుర్వేదంలో పసుపునకు గొప్ప స్థానం ఉంది. పసుపును చర్మ సమస్యలను తొలగించడానికి, సౌందర్యం కోసం కూడా ఉపయోగిస్తుంటారు. 

25

ఇన్ని గొప్ప గొప్ప లక్షణాలను కలిగి ఉన్న పసుపు పురుషులకు ఎన్నో విధాలా మేలు చేస్తుంది. పసుపు అబ్బాయిలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

35

కండరాల అలసట తగ్గుతుంది

పరుషులు రోజంతా కష్టపడి పనిచేయడం, జిమ్, వ్యాయామం, పరిగెత్తడం వంటి ఎన్నో రకాల పనులను చేస్తుంటారు. ఈ పనుల వల్ల వారు ఎంతో అలసిపోతారు. ముఖ్యంగా మరుసటి రోజు పనిచేయలేకపోతారు. ఇలాంటి వారు ప్రతి రోజూ రాత్రి పూట గ్లాస్ పాలలో కొద్దిగా పసుపును మిక్స్ చేసి తాగాలి. ఈ పసుపు పాలు శరీరాన్ని, కండరాలను రిలాక్స్ చేస్తాయి. అలసట మటుమాయం అవుతుంది. 
 

45


చర్మానికి, ముఖానికి ప్రయోజనకరంగా ఉంటుంది

ఆడవారితో పోల్చితే మగవారి చర్మం కాస్త మందంగానే ఉంటుంది. అంతేకాదు చర్మ రంధ్రాలు కూడా పెద్దవిగానే ఉంటాయి. దీంతో వారి సెబమ్ మోతాదుకు మించి రిలీజ్ అవుతుంది. ఈ కారణంగా ఆడవారితో పోల్చితే మగవారి చర్మమే ఎక్కువగా జిడ్డుగా ఉంటుంది. దీనివల్ల చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే వీళ్లు పసుపు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ సమస్యలన్నీ పోతాయి. జిడ్డు పోయి చర్మం కాంతివంతంగా తయారువుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు మంటలను తగ్గిస్తాయి. 
 

55

రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది

పసుపులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే పసుపులో  ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు వైరల్ ఫీవర్, జ్వరం, దగ్గు, జలుబు, అలెర్జీ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. 
 

click me!

Recommended Stories