weight loss: మీకిది తెలుసా.. పచ్చిమిర్చి తింటే తొందరగా బరువును తగ్గుతారంట..

Published : Apr 30, 2022, 01:01 PM IST

weight loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే వెంటనే మీ రోజు వారి వంటలో పచ్చిమిర్చిని చేర్చండి. ఎందుకంటే పచ్చిమిర్చిని తింటే వేగంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

PREV
18
weight loss: మీకిది తెలుసా.. పచ్చిమిర్చి తింటే తొందరగా బరువును తగ్గుతారంట..

weight loss: దాదాపుగా తెలుగు వంటలన్నీ ఘాటు ఘాటుగానే ఉంటాయి. కూరలో కారం తక్కువైతే చాలు ఇదేం కూర సప్పిడి పోయిందంటూ తినని వారు లేకపోలేదు. అందులోనూ పచ్చిమిర్చితో చేసిన కూరలంటే మహా ఇష్టం. ఇక ఈ పచ్చిమిర్చి బజ్జీల రుచే వేరబ్బా.. 

28

పచ్చిమిర్చీలను ఏ రూపంలో తీసుకున్నా దానిటేస్ట్ అదిరిపోతుంది. ఈ ఘాటు పచ్చిమిర్చి రుచికే కాదు బరువును కూడా తగ్గిస్తుందన్న ముచ్చట మీకు ఎరుకేనా. అవును.. పచ్చి మిర్చిని మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్ నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. 

38

పచ్చిమిర్చిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్స్, ఇనుము, పొటాషియం, కాపర్ , డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందులోనూ వీటిలో కేలరీలు మొత్తమే ఉండవు. వీటిని ప్రతిరోజూ తినడం వల్ల జీవక్రియ ఆరోగ్యం బాగుంటుంది.

48

మీరు అధిక బరువుతో బాధపడుతున్నట్టైతే వెంటనే మీ రోజు వారి ఆహారంలో వెంటనే పచ్చిమిర్చిని చేర్చుకోండని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులు కరగడం మొదలవుతుంది. అంతేకాదు ఇది జీవక్రియను కూడా ఫాస్ట్ చేస్తుంది. జీవక్రియ పెరగడం వల్ల ఫ్యాట్ తొందరగా కరుగుతుంది.   

58

మీ రోజు వారి ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవడం వల్ల మీరు ఫుడ్ ను మోతాదుకు మించి తినలేరు. దీంతో మీరు వేగంగా బరువు తగ్గుతారు. 

68

పచ్చిమిరపలో క్యాప్సైసిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇదే ఓవర్ వెయిట్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. 

78


American Journal of Clinical Nutrition in 2008 లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిస్ బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఎంతో సహాయపడుతుందని తేలింది. అంతేకాదు ఇది రక్తప్రసరణను కూడా మెరగుపరుస్తుంది. దీంతో సైనస్ ఇన్ఫెక్షన్, జలుబు వంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. 
 

88

మంచి చేస్తుంది కదా అని పచ్చిమిర్చిని మోతాదుకు మించి తినకూడదు. ముఖ్యంగా ఇన్ఫెక్ష్న్స్, కడుపులో పుండ్లు ఉన్నవారు వీటిని అసలే తినకూడదు. ఒకవేల తినాలనుకుంటే ముందుగా వైద్యుడిని  సంప్రదించాలి.  పచ్చిమిర్చిని మోతాదుకు మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


 

click me!

Recommended Stories