ప్రతిరోజు నడవడం వల్ల శరీరానికి మితమైన వ్యాయామం అందుతుంది. మీరు పరిగెత్తడం కంటే నడవడం మొత్తం శరీరానికి సులభం. కీళ్లు, కండరాలపై ఎక్కువ ప్రభావం ఉండదు. కానీ వాటిని బలోపేతం చేస్తుంది. ఇప్పటికే కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, కొత్తగా వ్యాయామం చేయడం మొదలుపెట్టేవాళ్లకు నడక ఒక వరం. ఇది సురక్షితమైన వ్యాయామం కూడా.
నిలకడ:
నడవడానికి మనం కొత్త చెప్పులు కూడా కొనాల్సిన అవసరం లేదు. దీనికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. దీన్ని ఎక్కడైనా చేయవచ్చు. నడక సులభమైన మరియు నిలకడగా ఉండే వ్యాయామం.