Beauty Tips: మీరు అందంగా కనిపించాలా? అయితే ఇలా చేయండి

First Published | Nov 16, 2023, 11:33 AM IST

Beauty Tips: మన చర్మం కాంతివంతంగా మెరవాలంటే చర్మానికి పోషణ చాలా చాలా అవసరం. అలాగే మన శరీరం ఫిట్ గా ఉండటానికి పోషకాలు కూడా అంతే అవసరం. మీ చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండాలనుకుంటే మాత్రం మీరు విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. అయితే మన శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం వల్ల కూడా చర్మం ట్యాన్ అవుతుంది. ఇలాంటప్పుడు.. 

అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలను కూడా చేస్తుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు మన ముఖం నల్లగా, నీరసంగా కనిపిస్తుంటుంది. మేకప్ వేసుకున్నా.. ముఖం ఏ మాత్రం అందంగా కనిపించదు. అసలు ఇలా ఎందుకు అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? 
 

మన శరీరం బయటి నుంచి ఆరోగ్యంగా, అందంగా కనిపించాలంటే లోపలి నుంచి ఆరోగ్యంగా ఉండాలి. అందుకే ముఖం అందంగా కనిపించాలంటే శరీరానికి పోషకాహారం చాలా అవసరం. మనం అందంగా కనిపించాలంటే విటమిన్లు, ఖణిజాలు, హైడ్రేషన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలను తప్పకుండా తీసుకోవాలి. నిపుణుల ప్రకారం.. విటమిన్ ఇ లోపం వల్ల మన ముఖం నీరసంగా మారుతుంది. ఈ పోషక లోపం వల్ల ముఖంపై నల్లన మచ్చలు, తెల్ల మచ్చలు వంటి చర్మ సమస్యలు కూడా వస్తాయి. 
 


అంతే కాదు ఈ పోషక లోపం వల్ల మీలో చిన్న వయసులోనే వృద్ధాప్యం సంకేతాలు కనిపిస్తాయి. అందుకే ఇలాంటి వాటిని సకాలంలో పూర్తిగా ట్రీట్ చేసి మీ అందాన్ని కాపాడుకోవాలి. కాబట్టి విటమిన్-ఇ లోపాన్ని ఎలా పోగొట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

హైడ్రేట్ గా.. 

ఎలాంటి చర్మ సమస్య అయినా సరే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు డీహైడ్రేషన్ బారిన పడితే మీ చర్మం నీరసంగా కనిపిస్తుంది. అందుకే మీరు ప్రతి రోజూ 7 నుంచి 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగండి. వాటర్ మీ చర్మాన్ని లోపలి నుండి హైడ్రేట్ గా ఉంచుతుంది. దీంతో మీరు అందంగా కనిపిస్తారు. 
 

వేరుశెనగ, బాదం

బాదం, వేరుశెనగల్లో విటమిన్-ఇ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ గుప్పెడు తినడం వల్ల  శరీరంలో ఈ పోషక లోపం పోతుంది. ఇందుకోసం ఇందుకోసం వీటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినండి. ఇవి మీ శరీరానికి అవసరమైన విటమిన్ ఇ ను అందిస్తాయి. 
 

వ్యాయామం 

వ్యాయామం మన శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. దీంతో ముఖంపై నలుపు, మచ్చలు అయ్యే అవకాశం తగ్గుతుంది. అందుకే రోజు వ్యాయామం చేయండి. 
 

ఆకుకూరలు

ఆకుపచ్చ కూరగాయల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని తింటే మన శరీరానికి అంతర్గత పోషణ అందుతుంది. అలాగే మన చర్మం అందంగా మెరిసిపోతుంది కూడా. అందుకే మీ రెగ్యులర్ డైట్ లో బచ్చలికూర, బీట్రూట్ వంటి కూరగాయలను చేర్చుకోండి. ఈ కూరగాయలు విటమిన్ ఇ కి మంచి వనరులు. 
 

సోయాబీన్

సోయాబీన్ లో విటమిన్-ఇ తో పాటుగా, ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు పొద్దుతిరుగుడు నూనె కూడా మన చర్మానికి మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ ఇ మెండుగా ఉంటుంది. 

Latest Videos

click me!