పసుపు మొటిమలను, ముడతలను తగ్గిస్తుందా..?

Published : Jul 23, 2022, 09:42 AM IST

పసుపు (turmeric) మన ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపుతో మొటిమలు, ముఖంపై ముడతలు చెక్ పెట్టొచ్చు.   

PREV
19
పసుపు మొటిమలను, ముడతలను తగ్గిస్తుందా..?

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే ఆయుర్వేదంలో పసుపును ఎన్నో ఔషదాల తయారీలో ఉపయోగిస్తున్నారు. దీనిలో యాంటీ మైక్రోబయల్ (Anti-microbial), యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్ (Antioxidant) , యాంటీ ఇన్ఫ్లమేటరీ (Anti-inflammatory)గుణాలుంటాయి. ఇవన్నీ ఎన్నో రోగాలను తగ్గిస్తాయి. 

29

రెగ్యులర్ గా పసుపును కొంత మోతాదులో తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ (Immunity power) పెరుగుతుంది. అతేకాదు ఇది షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇది ఆరోగ్య పరంగానే కాదు అందానికి కూడా మెరుగులు దిద్దుతుంది. 
 

39
turmeric powder

ముఖ్యంగా పసుపు (turmeric) చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మొటిమలు (acne), మొటిమల తాలూకు మచ్చలు, ముఖంపై ఉండే ముడతలను తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపు చర్మానికి ఏ విధంగా మేలు చేస్తుందనే విషయాన్ని ప్రముఖ పోషకాహార నిపుణులు లవ్నీణ్ బాత్రా తెలియజేశారు. 

49
Turmeric

పసుపు వివిద చర్మ సంక్రామ్యతలతో పోరాడటానికి, చర్మాన్ని రక్షించడానికి ఎంతో సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ (Curcumin) అనే సమ్మేళనం చర్మాన్ని రక్షిస్తుంది. 

59

పసుపులో ఉండే కర్కుమినోయిడ్ (Curcuminoid)అనే పదార్థం మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను, సూక్ష్మక్రీములను చంపేస్తుంది. దీంతో మొటిమల చాలా తొందరగా తగ్గిపోతాయి. మొటిమలతో బాధపడేవారు పసుపును లేదా కర్కుమిన్, సప్లిమెంట్లను కలిగున్న ఉత్పత్తులను ఉపయోగించినా మొటిమలు పాస్ట్ గా తగ్గిపోతాయి. అయితే మొటిమలు చర్మానికి సంబంధం లేకుండా అయితే మాత్రం చర్మవ్యాధి నిపుణుడి సంప్రదించాల్సిందే. 
 

69

క్రమం తప్పకుండా పసుపును తీసుకోవడం వల్ల నిత్య యవ్వనం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పసుపులో వయసు మీద పడుతున్న కొద్ది వచ్చే ముడతలను తగ్గించే ఔషదగుణాలుంటాయి.

79

రెగ్యులర్ గా సూర్యరశ్మి కి గురి కావడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అంతే కాదు వడదెబ్బ కూడా తగిలే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలను తగ్గించడంలో పసుపు బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

89

పసుపు చర్మానికి  మేలు చేయడమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడతుంది. పసుపు సహజసిద్దమైన పెయిన్ కిల్లర్ (natural pain killer)అని కూడా అంటారు. ఇది కాలిన గాయాలను, ఇతర గాయాలను చాలా తొందరగా మాన్పుతుంది. అలాగే శరీర నొప్పులను కూడా తగ్గిస్తుంది. 

99

కీళ్ల నొప్పులను తగ్గించడంలో పసుపు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే కాలెయ పనితీరును కూడా వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. అంటే పసుపు కాలెయానికి కూడా మేలు చేస్తుందన్న మాట.

Read more Photos on
click me!

Recommended Stories