POOJA HEGDE: పూజా హెగ్డే ఫిట్ నెస్ సీక్రేట్స్..

Published : Mar 12, 2022, 11:09 AM IST

POOJA HEGDE:  తెలుగు ఇండస్ట్రీలో టాప్ 5 లీస్ట్ లో పూజా హెగ్డే ఒకరు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ అమ్మడు సినిమాల్లోనే కాదు ఫిట్ నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. సన్నజాజిలా ఉంటూ ఫిట్ ఫిజిక్ తో మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. మరి పూజా హెగ్డే ఫిట్ నెస్ కోసం ఏయే కసరత్తులు చేస్తోందో తెలుసుకుందాం పదండి.. 

PREV
19
POOJA HEGDE: పూజా హెగ్డే ఫిట్ నెస్ సీక్రేట్స్..

వ్యాయామం:  హీరోయిన్ పూజా హెగ్డే తన డైలీ లైఫ్ వ్యాయామంలో కార్డియో, బాక్సింగ్, వెయిట్ ట్రైనింగ్ , పైలెట్స్ ను తప్పని సరిగా చేస్తుంది. వీటి ద్వారానే ఈ ముద్దుగుమ్మ అంత స్లిమ్ గా ఉందని చెప్పుకొస్తుంది. 

29

యోగా:  పూజా హెగ్డె ప్రతిరోజూ యోగాను తప్పని సరిగా చేస్తుంది. లాక్ డౌన్ సమయంలో జిమ్ సెంటర్లు క్లోజ్ చేయబడినప్పుడు ఆమె ఫిట్ నెస్ కోసం యోగా సాధన చేసిందట. యోగా కూడా ఫిట్ గా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆమె చెప్పుకొస్తుంది. 

39

బాగా తినండి, కసరత్తులు చేయండి:  డిఫరెంట్ వంటకాలను తినడం పూజా హెగ్డేకు చాలా ఇష్టం. అందుకే ఆమె వివిధ రుచులను ఆస్వాదిస్తూ ఉంటుంది. ఇక ఆ మరుసటి రోజు ఫుల్ గా వర్కౌట్స్ ను చేస్తుంది. దీనివల్లే ఆమె ఫిట్ గా ఉంటుంది. 

49

డ్యాన్స్ : పూజా హెగ్డేకు డ్యాన్స్ చేయడమంటే మహా ఇష్టమట. ఈ అమ్మడి డ్యాన్స్ ప్రతిభ అల వైకుంఠపురములో చూసే ఉంటారు కదా. పూజా హెగ్డే ఫిట్ నెస్ లో ఇది కూడా ఒక భాగమే..
 

59

ఏరియల్ సిల్క్ యోగా:  ఏరియల్ సిల్క్ యోగా కూడా పూజా హెగ్డే ఫిట్‌నెస్ లో  ఒక భాగం కూడా. దీనిని ఆమె క్రమం తప్పకుండా చేస్తుంది.  

69

నీరు తాగడం: మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. డీహైడ్రేట్ కాకూడదన్నా.. శరీరానికి అవసరమైన నీళ్లను తాగూతూ ఉండాలని మనకు తెలుసు. ఈ సూత్రాన్ని పూజా హెగ్డే తూ.చా తప్పకుండా పాటిస్తుంది. ఫిట్ గా ఉండాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలని పూజా హెగ్డే పలు ఇంటర్వూలల్లో చెప్పింది. 

 

79

సమయానికి తినడం:  పూజా హెగ్డే సమయం ప్రకారమే తింటుందట. అందులోనూ కొంచెం కొంచెం ఆహారాన్ని ప్రతి రెండు గంటలకోసారి తీసుకుంటూ ఉంటుందట. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఇంట్లో వంటిన వంటలనే ఎక్కువగా తింటుందట. ఈ కారణంగానే పూజా హెగ్డే అంత హెల్తీగా ఉందని చెప్పుకొస్తుంది. 

89

కొబ్బరి నూనె:  కొన్ని నివేదికల ప్రకారం.. పూజా హెగ్డే తన రోజు వారి ఆహారంలో కొబ్బరి నూనెను ఉండేటట్టు చూసుకుంటుందట. ఈ కొబ్బరి నూనెను వంటల్లోనే కాదు తన చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తుందని తెలుస్తుంది. 

99

కాఫీ: ప్రస్తుత కాలంలో కాఫీని ఇష్టపడని వారెవరూ ఉండరు కదా.. అందులో పూజా హెగ్డే కూడా ఒకరు. పూజా హెగ్డే కాఫీని ఇష్టంగా తాగుతూ ఉంటుంది. జీర్ణక్రియను పెంచడానికి ఈ అమ్మడు కాఫీని తాగుతూ ఉంటుందట. అంతేకాదు వర్కౌట్స్ లో చెమటలను చిందిస్తుందట. 
 

click me!

Recommended Stories