White Clothes: తెల్లడ్రెస్సులు కొత్తవాటిలా మెరవాలంటే ఈ పదార్థాలను ఉపయోగించండి చాలు

Published : Oct 04, 2026, 12:07 PM IST

White Clothes: వైట్ డ్రెస్సులపై మరకలు పడితే త్వరగా పోవు. మురికిలాగా కనిపిస్తుంది. అయితే ఇంట్లోనే ఉన్న కొన్ని పదార్థాలు వాడడం వల్ల తెల్ల షర్టులు కొత్తవాటిలా మెరుస్తాయి. ఈ పదార్థాలన్నీ ఇంట్లో ఉండేవే. వాటిని ఎలా వాడాలో తెలుసుకోండి.

PREV
13
వైట్ డ్రెస్సులు తెల్లగా మెరిసే చిట్కాలు

ప్రతి ఇంట్లోనూ వైట్ డ్రెస్సులు ఉంటాయి. తెల్ల వస్త్రాలు వేసుకుంటే ఎవరైనా అఫీషియల్ గా కనిపిస్తుంది. కానీ వాటిని ఎప్పుడూ తెల్లగా ఉంచడం కష్టమైన పని. రోజూ ఉతకడం, డిటర్జెంట్ అవశేషాలు, చెమట వల్ల తెల్ల షర్టులు పసుపు రంగులోకి లేదా మురికిగా మారుతుంటాయి. అయితే మీ ఫేవరెట్ తెల్ల డ్రెస్సులు మెరిపించడానికి ఖరీదైన ప్రొడక్ట్స్ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు, చిన్న చిన్న అలవాట్లతో వాటిని మళ్లీ కొత్తవాటిలా మార్చేయొచ్చు.

23
బేకింగ్ సోడాను వాడండి

ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది. దీంతో ఉతికితే తెల్ల షర్టులు మెరిసిపోవడం ఖాయం. ఇంట్లో క్లీనింగ్ కోసం వాడే బేకింగ్ సోడా తెల్ల బట్టలను ఉతకడానికి కూడా బాగా పనిచేస్తుంది. ఉతికేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేస్తే బట్టల మీద ఉన్న మురికి, వాసన పోయి ఫ్రెష్‌గా మారతాయి. మరీ మురికిగా ఉన్న బట్టలను ఉతకడానికి ముందు కొద్దిసేపు బేకింగ్ సోడా నీళ్లలో నానబెట్టడం మంచిది.

వైట్ వెనిగర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. వైట్ వస్త్రాల మీద పేరుకుపోయే మురికిని వైట్ వెనిగర్ సులభంగా వదిలిస్తుంది. తెల్ల బట్టలు కాస్త బూడిద రంగులోకి మారినప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. డిటర్జెంట్‌తో నేరుగా కలపకుండా, బట్టలు జాడించేటప్పుడు కొద్దిగా వెనిగర్ వేయాలి. బ్లీచ్ లేదా ఇతర కెమికల్స్‌తో వెనిగర్‌ను అస్సలు కలపకూడదు.

33
నిమ్మరసం

చెమట పట్టే చోట తెల్లషర్టులపై పసుపు రంగు మరకలు పడుతుంటాయి. ఇలాంటి మరకలను పోగొట్టి బట్టలను మెరిపించడానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. ఉతకడానికి ముందు నిమ్మరసం కలిపిన నీళ్లలో బట్టలను నానబెట్టడం లేదా మరకల మీద నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తెల్ల బట్టలను మెరిపించడానికి సూర్యరశ్మి ఒక మార్గం. ఉతికిన తర్వాత తెల్ల బట్టలను ఎండలో ఆరబెడితే అవి మరింత ఫ్రెష్‌గా కనిపిస్తాయి. అయితే ఎక్కువసేపు ఎండలో ఉంచితే కొన్ని రకాల బట్టలు పాడయ్యే ప్రమాదం ఉంది.

చెమట మరకలను వదిలించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడొచ్చు. అయితే దీన్ని వాడే ముందు బట్టల లేబుల్ చదివి, బట్టల మూలన కొద్దిగా రాసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కో ఫ్యాబ్రిక్ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories