పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

First Published | Jun 20, 2024, 3:55 PM IST

మండుతున్న ఎండల వేడి వల్ల పెరుగు పుల్లగా అవడమే కాకుండా.. పాలు కూడా విరిగిపోయి పనికిరాకుండా పోతాయి. అందుకే ఈ సీజన్ లో పాలు విరిగిపోకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఫుడ్, డ్రింక్స్ ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉండవు. అలాగే తొందరగా పాడైపోతుంటాయి. ముఖ్యంగా పాలు. వేడి వల్ల పాలు తొందరగా విరిగిపోతుంటారు. పాలను సరిగ్గా నిర్వహించకపోతేనే పాలు విరిగిపోతుటాయి. మరి పాలు పాడవకుండా, విరిగిపోకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

స్మార్ట్ షాపింగ్

ఇంటి సరుకులు కొనేటప్పుడు అన్ని సరుకులను కొన్న తర్వాతే చివర్లో పాలను కొనండి. ఇలా చేయడం వల్ల పాలు కాసేపు ఫ్రిజ్ లో ఉండి చెడిపోయే అవకాశాలు తగ్గుతాయి. వేడి గాలికి ఎక్కువ సేపు ఉండటం వల్ల కూడా పాలలో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇకపోతే పాలను కొన్న వెంటనే ముందుగా ఫ్రిజ్ లో పెట్టండి. దీనివల్ల పాలు విరిగిపోవు. 
 


ఇలా నిల్వ చేయండి

పాలు విరిగిపోకుండా ఉండాలంటే వీటిని కేవలం ఫ్రిజ్ లో పెడితే సరిపోదు. ఇంతకంటే ముందు మీరు కొన్న  పాలు కూడా బాగుండాలి.  పాల ప్యాకెట్లు లేదా సీసాలను ఎప్పుడూ కూడా ఫ్రిజ్ డోర్ దగ్గర ఉంచకూడదు. ఎందుకంటే ఫ్రిజ్ డోర్ తెరిచిన ప్రతిసారీ పాలు బయట వెచ్చని ఉష్ణోగ్రతకు గురవుతాయి. దీనివల్ల పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే పాలను ఎప్పుడూ కూడా ఫ్రిజ్ చివరి ట్రే విభాగంలో పెట్టాలి. 
 


పాలను మరిగించండి.

ప్యాక్ చేసిన పాలను ఫ్రిజ్ లో ఎక్కువ సేపు ఉంచడం వల్ల అవి విరిగిపోయే అవకాశం తగ్గుతుంది. అయితే కొన్నిసార్లు బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పాలు చెడిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో పాలను ఇంటికి తీసుకువచ్చిన వెంటనే మరిగించాలి. పాలను మరిగించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా చాలా వరకు తగ్గుతుంది.  ఇవి పాల రుచిని పెంచుతాయి. 
 

పాలను వాడే ముందు ఫ్రిజ్ నుంచి బయటకు తీసి వాటిని వాడిన వెంటనే తిరిగి ఫ్రిజ్ లో పెట్టండి. అర్థమయ్యేట్టు చెప్పాలంటే పాలను ఎక్కువసేపు బయట పెట్టకూడదు. అలా చేయకపోతే అధిక ఉష్ణోగ్రత వల్ల  పాలు పాడయ్యే ప్రమాదం పెరుగుతుంది. 

Latest Videos

click me!