Relationship Tips: గొడవలు, కొట్లాటలు, అలకలు లేని రిలేషన్ షిప్ ఉండదేమో కదా.. అలా లేకుంటే దాన్ని రిలేషన్ షిప్ యే అనరని కొందరు అంటూ ఉంటారు. కానీ ఎన్ని గొడవలు జరిగినా.. వాటిని వెంటనే మర్చిపోయే జంటలే కలకాలం సంతోషంగా లైఫ్ ను లీడ్ చేస్తాయి.
భార్యా భర్తల మధ్య గొడవలు వస్తే వారి మధ్య దూరం పెరిగిపోకూడదంటే కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే. మరి మీ మధ్య దూరం దగ్గరగా మారాలంటే ఈ టెక్నిక్స్ ను ఫాలో అయిపోండి.
బయట చర్చించకండి.. మీ మధ్య జరిగిన గొడవ చిన్నదైనా.. పెద్దదైనా ఇతరులకు మాత్రం చెప్పకండి. మీరు పరిష్కరించుకోవాల్సిన విషయాలను బయటివాళ్లకు చెప్తే మీ మధ్య మరింత దూరం పొరగొచ్చు.
కోపమొద్దు.. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు ఇద్దరి మధ్య దూరం ఎలా తగ్గుతుందని చూడాలి కానీ.. దూరాన్ని మరింత దూరం చేసే కోపాన్ని చూపించడకూడదు. కోపం వల్ల ఏదీ రాదు. వీలైతే.. ఒకమెట్టు దిగి మీ భాగస్వామితో మాట్లాడండి. అప్పుడే మీ బంధం గట్టిగా ఉంటుంది.
క్షమిస్తే చాలు.. క్షమించడానికి కూడా గొప్ప మనసుండాలి తెలుసా.. ఎదుటివారు తాము చేసిన తప్పేంటో గుర్తించి మిమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు మీరు బెట్టు చేసి.. నేను క్షమించనుపో అంటే మాత్రం మీ మధ్య దూరం ఇంకింత పెరిగుతుంది తప్ప తగ్గదు.
గొడవను పెద్దది చేయొద్దు.. జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి మర్చిపోవడమే మంచిది. లేదంటే.. నువ్ నన్ను ఇలా అన్నావ్.. అలా అన్నావని ప్రతి దాంట్లో తప్పులు వెతికితే.. చివరికి మీకు మిగిలేది ఒంటరి తనమే. కాబట్టి గొడవను భూతద్దంలో చూసుడు మానుకోండి.
ఈ మాటలు అనడం మంచిది కాదు.. ఇద్దరి మధ్య గొడవ చిన్నదైనా పెద్దదైనా జరిగినప్పుడు ‘నేను నీతో బతకలేను, ఇక నుంచి నీ లైఫ్ నువ్వు బతుకు’ లాంటి బెదిరింపు మాటలను మాట్లాడకంటి. వీలైతే మీ భాగస్వామీతో మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించండి.
బెట్టు చేయొద్దు.. గొడవలు, కొట్లాటలు జరిగినప్పుడు ఎవరో ఒకరు ఒక మెట్టు దిగి మాట్లాడే ప్రయత్నం చేయాలి. వీళ్లు తగ్గారని మీరు బెట్టు చేస్తే మాత్రం మీ సమస్య అలాగే ఉండిపోతుంది..
సాగదీతలు వద్దు.. గొడవల వల్ల దూరం పెరుగుతుంది. మరి దూరం దగ్గరగా అవ్వాలంటే .. మీ గొడవలను ఇంకా ఇంకా సాగదీసే పనిని పెట్టుకోకండి. అప్పుడే మీ లైఫ్ బాగుంటుంది.