Marital Problems: ఆలుమగల మధ్య తరచుగా గొడవలు జరగడానికి ప్రధాన కారణాలు ఇవే..

First Published | Feb 14, 2022, 2:02 PM IST

Marital Problems: భార్యా భర్తల మధ్యన గొడవలు, కొట్లాటలు జరగడం చాలా కామన్. కాని ఆ గొడవల మూలంగా ఆలుమగల మధ్యన దూరం ఎప్పటికీ దగ్గర కాలేనంతగా పెరిగిపోతుంది. 

Marital Problems: వావాహిక జీవితంలో కోపతాపాలు, చిన్న చిన్న గొడవలు, కొట్లాటలు రావడం సర్వసాధారణం. పరిస్థితులు ఎలాంటివైనా.. అన్నింటినీ సర్దుకుంటూ ముందుకు వెళితేనే భార్యా భర్తల బందం సాఫీగా సాగుతుంది. కానీ ఇద్దరికీ సర్దుకుపోయే గుణం లేకుంటేనే మొదటికే మోసం వస్తుంది. ఇలాంటి వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు సైతం పెను తుఫానులా మారి వారి మధ్యన ఎన్నటికీ దగ్గర కాలేని దూరం ఏర్పడుతుంది. 

భార్య భర్తల మధ్యన కొట్లాటలు, గొడవలు జరగడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. కేవలం కొన్ని విషయాల్లోనే కపుల్స్ మధ్యన గొడవలు జరుగుతాయి. వాటిని తెలుసుకుని.. అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకుంటే వైవాహిక బంధం సాఫీగా సాగుతుంది. కొట్లాటకు దారితీసే కారణాలేంటో తెలుసుకుందాం పదండి..
 


బోరింగ్ లైఫ్: బోరింగ్ లైఫ్ కారణంగా పార్టనర్లను వదులుకోవడానికి కూడా సిద్ధమవుతుంటారు కొంతమంది. ఎందుకంటే ఎప్పుడు ఒకేలా ఉంటే కూడా జీవితంపై విరక్తి కలుగుతుంది. అందులోనూ ప్రస్తుత రోజుల్లో చాలా మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నా.. ఒకరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితులు లేవు. దీనికారణంగా భ్యారా భర్తల మధ్యన దూరం మరింత పెరుగుతుంది. కాగా చాలా మంది ఫోన్లతోనే ఎక్కువగ సమయాన్ని గడుపుతున్నారు. దీంతో మీ భాగస్వామికి మీపై ప్రేమ పోతుంది. అంతేకాదు ఆ లైఫ్ వారికి బోరింగ్ గా అనిపిస్తుంది. దాంతో ఒకరిపై ఒకరికున్న ఇంట్రెస్ట, ప్రేమ తగ్గడం మొదలవుతుంది. దాంతో వారిరువురి మధ్య గొడవలు మొదలవుతాయి. 

వివాహబంధంతో ఒక్కటైన జంట వారి దాంపత్య జీవితాన్ని (Life) సరైన మార్గంలో వెళ్లడానికి ఇద్దరూ తమ వంతు ప్రయత్నం చేయాలి. దాంపత్య జీవితాన్ని ఇతరులతో పోల్చుకోరాదు. తమ స్థాయిని బట్టి, స్థితిగతులను బట్టి వారి దాంపత్య జీవితం ఎలా ఉండాలనేది చక్కగా ప్లాన్ చేసుకోవాలి. దాంపత్య జీవితాన్ని ఇతరులతో పోల్చి చూసినప్పుడు కాపురంలో విభేదాలకు (Conflicts) దారితీస్తుంది.
 

మానసికంగా తోడు లేకపోవడం: భాగస్వామికి మానసికంగా దగ్గరైనప్పుడే ఎలాంటి గొడవలు జరగవు. కానీ చాలా మంది వారి పార్టనర్ లకు మానసికంగా దగ్గర కాలేకపోతున్నారు. అంతేకాదు అవసరమనుకున్నప్పుడు వారిని ఎమోషనల్ గా తోడుగా ఉండటం లేదు. ఇది వారివురి మధ్యనున్నకమ్యూనికేషన లోపమే. అంతేకాదు ఈ ఉరుకుల పరుగుల జీవితం , ఒత్తిడి కూడా ఇందుకు ఒక కారణమే. మీ భాగస్వామి ఏదైనా విషయంపై భావోద్వేగానికి గురైనప్పుడు నీకు తోడుగా నేనున్నా..అంటూ వారిని ఓదార్చండి. ఇలాంటి సమయంలో కూడా మీరు అండగా నిలవక పోతే మీపై విరక్తి పొంది.. మీ మధ్య తరచుగా గొడవలు జరగడం పక్కాగా జరుగుతాయి.

లైంఘిక వాంఛలు: వైవాహిక బంధంలో లైంఘిక సంబంధం కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. భార్యా భర్తల మధ్య సెక్స్ లైఫ్ మెరుగ్గా ఉన్నప్పుడే వారి బంధం బలంగా ఉంటుంది. కానీ ఈ గజిబిజీ లైఫ్ లో ఒత్తిడి కారణంగా చాలా జంటలు సెక్స్ కు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి జంటల్లో ఒకరికి సెక్స్ పై ఆసక్తి ఉంటే ఇంకొకరికి ఆసక్తి లేకపోవడం వల్ల వారి మధ్యన గొడవలు జరిగి దూరం పెరుతుంది. దీనివల్ల వారి మధ్య ప్రేమ తగ్గుతుంది. అంతేకాదు తరచుగా గొడవలు, తగాదాలు తలెత్తే అవకాశం ఉంది.

ఫుడ్ ఎఫెక్ట్:  ఆల్కహాల్, కెఫిన్ వాడకం ప్రస్తుత రోజుల్లో ఎక్కువైంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మానసిక స్థితిపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు వీటికి పూర్తిగా బానిసలుగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మద్యానికి బాగా అలవాటు పడిన వారు సంసారాన్ని గాలికి వదిలేస్తారు. అలాగే తమ భాగస్వామిని పూర్తిగా విస్మరిస్తారు. అంతేకాదు వారితో మాట్లాడటానికి, వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడరు. ఇలాంటి అలవాట్ల మూలంగా కూడా భార్యా భర్తల మధ్యన కొట్లాటలకు దారి తీస్తుంది. 

పైన చెప్పిన సమస్యలు ఎదురైనప్పుడు.. భార్యా భర్తలిద్దరూ ఒక దగ్గర కూర్చొని మనసు విప్పి మాడ్లాకోవాలి. ఇలా మాట్లాడుకున్నప్పుడే మీ మధ్యనున్న గొడవలు జరగవు. ముఖ్యంగా ఇద్దరు ఏకాంతంగా గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయించుకోండి. ఇలా కూడా సర్దుకోవనుకుంటే భార్యా భర్తలిద్దరూ మ్యారేజ్ కౌన్సిలర్ ను కలిస్తే కూడా మీ మధ్య గొడవలు సర్దుమనుగుతాయి.  
 

Latest Videos

click me!