Anger Controlling: చిన్నచిన్న విషయాలకు కూడా కోపంతో ఊగిపోతున్నారా ? ఇవి తినండి కోపం కంట్రోల్ అవుతుంది..

Published : Feb 14, 2022, 12:06 PM IST

Anger Controlling: కొంతమందికి ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తుంటుంది. చిన్న చిన్న విషయాలకు అలా కోపంతో ఊగిపోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వారు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది.

PREV
17
Anger Controlling: చిన్నచిన్న విషయాలకు కూడా కోపంతో ఊగిపోతున్నారా ? ఇవి తినండి కోపం కంట్రోల్ అవుతుంది..

Anger Controlling: కొంతమందికి ప్రతి చిన్న విషయానికి కూడా కోపం తన్నుకొస్తుంటుంది. ఎప్పుడూ చికాకుగా ఉంటూ ఇతరులపై అరుస్తూ ఉంటారు. వాస్తవానికి అలాంటి వారు కూడా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాలని అనుకుంటారు. కానీ ఉండలేరు. ఎందుకంటే కోపం వారి ప్రశాంతతను డామినేట్ చేస్తుంది కాబట్టి. అందుకే కోపంతో ఎప్పుడూ ఊగిపోతుంటారు. 
 

27

కాలిఫోర్నియా యూనివర్సిలో ఈ విషయంపై పరిశోధనలు నిర్వహించారు. ఈ విషయంపై పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించారు. మనం తీసుకునే ఆహారానికి, కోపానికి సంబంధం ఉందా అన్న విషయంపై పరిశోధనలు చేయగా.. అది నిజమేనని తేలింది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం కోపం రావడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. అందుకే కోపాన్ని పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే కోపాన్ని తగ్గించే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే కోపాన్ని ఇట్టే తగ్గించుకోవచ్చని వెళ్లడిస్తున్నారు. ఏయే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కోపం కంట్రోల్ అవుతుందో ఇప్పుుడు తెలుసుకుందాం..
 

37

వేటిని తినకూడదు: కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహార పదర్థాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిని తినడం వల్ల కోపం పెరిగిపోతుంది. ముఖ్యంగా చిప్స్, నూడుల్స్, చైనీస్ ఫ్రైడ్ రైస్, కేకులు, జంక్ ఫుడ్ ను తరచుగా తినేవారికి విపరీతమైన కోపం వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు  వీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. 

47

 షుగర్ ఎక్కువ మొత్తంలో ఉండే స్వీట్లకు కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల మనలో ఉండే కోపం తీవ్ర స్థాయికి చేరుకోవడం , విసుగు, చికాకు వంటివి వస్తాయట. కాబట్టి వీటికి దూరంగా ఉండటమే బెటర్. 

57

ఏం తింటే కోపం రాదు: కోపాన్ని నియంత్రించడంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా మన కోపాన్ని నియంత్రించడానికి ఎంతోగానో సహాయపడతాయి. కాగా ఫిష్ లల్లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. అంతేకాదు వీటిలో మంచి కొలెస్ట్రాల్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటుగా గుడ్లు, బాదం పప్పులు, వాల్ నట్స్ లల్లో కోపాన్ని తగ్గించే గుణాలుంటాయి.  వీటిల్లో ఉండే పోషకాలు తీవ్రమైన కోపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 

67

మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ కూడా కోపాన్ని నియంత్రించగలదు. ఈ హార్మోన్ ను పెరిగేందుకు పుట్టగొడుగులు, చికెన్, చేపలు, గుడ్లు సహాయపడతాయి. కానీ వీటిని మోతాదులోనే తీసుకోవాలి. ఇకపోతే గుమ్మడి గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు గింజలు కూడా కోపాన్ని నియంత్రించగలవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
 

77

మీకు తెలుసా.. మన బాడీలో విటమిన్ డి లోపం ఉంటే కూడా కోపం వస్తుందట. కాబట్టి ప్రతి రోజూ ఉదయం పూట కాసేపు ఎండలో కూర్చోండి. దీనివల్ల మీ శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. దీనివల్ల మీ కోపం తగ్గుతుంది. కాగా మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటే కూడా కోపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఆహార పదార్థాలను తినడం అలవాటు చేసుకోండి. వ్యాయామం, ధ్యానం, యోగా వంటి వాటి ద్వారా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.  

click me!

Recommended Stories