Foods: ఈ ఆహారాలు నీరసాన్ని పెంచుతాయి.. జాగ్రత్త..

Published : Feb 28, 2022, 03:38 PM IST

Foods: మనం తీసుకునే ఆహారంతో మనకు శక్తి రావాలే కాన్నీ ఆ శక్తిని హరించేవి కాకూడదు. కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల మీరు మరింత నీరసంగా మారిపోతారన్న విషయం మీకు తెలుసా.. 

PREV
16
Foods: ఈ ఆహారాలు నీరసాన్ని పెంచుతాయి.. జాగ్రత్త..

Foods: మనం ఆహారాలను తినేదెందుకు.. ఆరోగ్యంగా, బలంగా, శక్తివంతంగా తయారయ్యేందుకే కదా.. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రం మనల్ని నిస్సత్తువగా చేస్తాయి. శరీరంలో ఉన్న శక్తి కూడా పోతుంది. దాంతో మీరు మరింత నీరసంగా మారుతారు. కాబట్టి శరీరానికి హానీ చేసే, నిస్సత్తువగా మార్చే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటే మంచిది. 

26

వీటిని అప్పుడప్పుడు తిన్నా ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు కానీ.. అదే పనిగా తింటే మాత్రం మీరు నీరసంగా మారిపోవడం పక్కాగా జరుగుతుంది. కొంతమంది తిన్న తర్వాత కూడా చాలా డల్ గా నీరసంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితినే post prandial fatigue లేదా Food coma అంటారు. ఇది రాకూడదంటే తాజా పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినాలి. ఎలాంటి ఆహారాలను తింటే నీరసం పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

36

నూనెలో వేయించినవి:  డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటి ద్వారా అలసట మరింత పెరుగుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో నూనె, ఉప్పుు ఎక్కువ మొత్తంలో చేరుతాయి. మీ బాడీలో ఈ రెండూ ఎక్కువైతే మీ శరీరానికి శక్తి అందక మీరు ఏ చిన్న పని చేసినా లేదా చేయకపోయినా అలసిపోయినట్టుగానే ఉంటారు. అంతేకాదు నూనెలో వేయించి ఆహారాల వల్ల మీరు ఎన్నో రోగాల బారిన పడొచ్చు.

46

వైట్ బ్రెడ్: చాలా ఈజీగా, తొందరగా వండుకుని తినే ఆహార పదార్థాల్లో వైట్ బ్రెడ్, పాస్తాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. పాస్తా, వైట్ బ్రెడ్ లో పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు వీటిని తింటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇక వీటిని తిన్న తర్వాత ఎనర్జీ అస్సలు ఉండదు. పైగా అలటగా, నీరసంగా మారిపోతారు. కాబట్టి మీరు వీటిని ఎట్టి పరిస్థితుల్లో తరచుగా తినకండి. 

56

స్వీట్ సెరీల్స్:  అల్పాహారంలో సెరీల్స్ ను ఎక్కువగా తినేవారు చాలా మందే ఉన్నారు. కాగా సెరీల్స్ లల్లో తియ్యనివి కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. ముఖ్యంగా వీటిని బ్రేక్ ఫాస్ట్ తో తింటే మీరు ఆ రోజంతా నీరసంగానే ఉంటారు. అంతేకాదు వీటిని తింటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతోనే మీకు అలసటగా అనిపిస్తుంది. 

66

కెఫిన్: ఏదైనా .. మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. అదే పరిమితికి మించి తీసుకుంటేనే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రూల్ కాఫీ ప్రియులకు కూడా వర్తిస్తుంది. కాఫీలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎప్పుడో ఒక సారి తాగితేనే మంచిది. అదే అలవాటుగా తాగితే మాత్రం మీ బాడీలోకి కెఫిన్ చేరిపోతుంది. తద్వారా మీకు అలసట, నీరసం, మగత వంటివి సమస్యలు ఎదురవుతాయి. కాఫిన్ తక్కువ తీసుకుంటేనే మీరు ఉత్సాహంగా ఉంటారు. పోని ఎక్కువైతే అంటే మిమ్మల్ని నీరసం, మగత, అలసట సమస్యలు చుట్టుకుంటాయి మరి.
  

click me!

Recommended Stories