చలికాలంలో జలుబు, దగ్గు...వీటితో చిటికెలో మాయం..!

First Published | Jan 6, 2025, 12:41 PM IST

మన వంట గదిలో చాలా మసాలా దినుసులు ఉంటాయి. అవి.. మన రోగనిరోధక శక్తిని బలపరచడంతో పాటు.. జలుబు, దగ్గు వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఆ మసాలా దినసులు ఏంటో ఇప్పుడు చూద్దాం...

చలికాలం వచ్చింది అంటే  చాలు పిలవకుండానే జలుబు, దగ్గు వచ్చేస్తూ ఉంటాయి. ఈ సీజన్ లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దీంతో.. కాసేపు  ఈ చల్లని వాతావరణంలో తిరిగినా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా.. ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. దాని వల్ల ఇన్ఫెక్షన్ల బారినపడుతూ ఉంటాం.  అయితే.. ఈ సమస్యను కేవలం వంట గదిలో లభించే కొన్ని మసాలాలతో చెక్ పెట్టొచ్చు. మన వంట గదిలో చాలా మసాలా దినుసులు ఉంటాయి. అవి.. మన రోగనిరోధక శక్తిని బలపరచడంతో పాటు.. జలుబు, దగ్గు వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఆ మసాలా దినసులు ఏంటో ఇప్పుడు చూద్దాం...

Ginger

1.అల్లం...

దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది.  అత్యంత ప్రభావవంతంగా ఇది పని చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతు నొప్పిని ఉపశమనం చేస్తాయి.  శ్లేష్మాన్ని బయటకు పంపడంలో సహాయపడతాయి. గోరువెచ్చని నీటిలో అల్లం రసం, తేనె కలుపుకుని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.


Black Pepper

2.నల్ల మరియాలు..

నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ సమ్మేళనాలు ముక్కు,  గొంతులోని అడ్డంకులను తొలగిస్తాయి. ఇది దగ్గును తగ్గించడానికి,  ఊపిరితిత్తులను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. వేడి పాలు లేదా టీలో మిరియాల పొడి  కలుపుకుని తాగడం చాలా ప్రయోజనకరం.

3.పసుపు..

పసుపులో ఉండే కర్కుమిన్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. గోరువెచ్చని పాలలో పసుపు కలిపి తాగడం వల్ల దగ్గు, జలుబు  గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

Clove tea

4.లవంగాలు..

లవంగాలు క్రిమినాశక , అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి దగ్గు , గొంతు నొప్పిని తగ్గిస్తాయి. దీన్ని పీల్చడం వల్ల గొంతు వాపు , నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. చలికాలంలో లవంగం టీ కూడా చాలా మేలు చేస్తుంది.

5.దాల్చిన చెక్క..

దాల్చిన చెక్క ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్, ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది . ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. తేనె , గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం వల్ల దగ్గు జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది.

Latest Videos

click me!