Maha Shivaratri: సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మహాశివరాత్రి పండుగ ఎంతో పవిత్రమైన పండుగ. అన్ని పండుగల్లో ఈ మహా శివరాత్రికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా మన అన్ని పండుగలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే జరుపుకుంటే.. ఈ మహా శివరాత్రిని మాత్రం అర్థరాత్రి 12 గంటల సమయంలో జరుపుకుంటాం.
ఎందుకంటే ఆ సమయంలో శివుడు లింగరూపంలో దర్శమిస్తాడు. ఎంతో పవిత్రమైన ఈ రోజున భక్తులంతా సాయంత్రం వరకు శివుడి అనుగ్రహం కోసం భక్తి శ్రద్దలతో పూజిస్తూ, అభిషేకాలు , భజనలు చేస్తూ ఉంటారు. ఇక ఆ రోజంగా జాగరణ చేస్తుంటారు. ఈ మహాశివరాత్రి హిందువులకు, కైశవులకు పరమ పవిత్రమైన పండుగ. ఆ రోజునాడు భక్తులంతా ఈశ్వరుని దైవ చింతనలోనే ఉంటారు.
మహా శివరాత్రి నాడు ఖచ్చితంగా వీటిని పాటించాల్సి ఉంటుంది. వీటిలో ఏది పాటించపోయినా.. ఈశ్వరుని అనుగ్రహం పొందలేరని పురాణాలు పేర్కొంటున్నాయి. మొదటిది ఉపవాసం చేయడం, రెండవది జాగరణ , మూడోది శివనామ స్మరణ. ఈ మూడింటిలో మూడోది శివనామ స్మరణ ఎంతో ముఖ్యమైది. ఎందుకంటే ఈ శివనామ స్మరణతో ఎన్నో చిక్కుల నుంచి బయటడతారని పురాణాలు పేర్కొంటున్నాయి.
శివరాత్రి నాడు సూర్యోదయం రాకముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత ఇంటినంతా శుభ్రం చేసుకుని దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టి , పూజ గది ముందు ముగ్గులు వేసుకోవాలి. అలాగే లింగాకారంలో ఉండే శివుడిని స్వచ్ఛమైన నీళ్లు లేదా ఆవుపాలు లేదా పుష్పాలు, గోగుపూలు, బిల్వపత్రాలు, గోగుపూలతో పూజిస్తూ శివ నామస్మరణ పఠించాలి.
అరటి పండు, ఖర్జూర పండు, చిలకడ దుంప, జామపండు, తాంభూలం దేవుడికి సమర్పించాలి. ముఖ్యంగా నిష్ఠగా పూజించాలి. పూజా సమయంలో పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తేనే దైవానుగ్రహం లభిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శివరాత్రి రోజున ఉదయం 9 గంటల లోపే పూజలు, అభిషేకాలు చేయాలని పురాణాలు పేర్కొంటున్నాయి.
నిరంతరం శివుడిని తలచుకుంటూ మనస్సును ఆ భగవంతుడిపై నిలిపి నిష్టగా పూజిస్తే ఆ దేవుడి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది. శివరాత్రి నాడు సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభ ఫలితాలు పొందుతారని పురాణాలు పేర్కొంటున్నాయి.