కళ్లకు కలబంద ప్రయోజనాలు.. ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో తెలుసా..!

Published : Jul 24, 2023, 01:10 PM IST

కలబందలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. దీనిలో ఉండే హైడ్రేటింగ్ లక్షణాలు మన కళ్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కలబందను సరైన పద్దతిలో ఉపయోగిస్తే కంటి ఆరోగ్యం బాగుంటుందంటున్నారు నిపుణులు. 

PREV
16
కళ్లకు కలబంద ప్రయోజనాలు.. ఎన్ని సమస్యలను తగ్గిస్తుందో తెలుసా..!

కలబందలోని ఔషదగుణాల కారణంగా దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది మన చర్మానికి, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇది కూడా మన కళ్లకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.  కలబందను ఉపయోగించి కంటి  ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ ఔషదమొక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మొక్క ఎన్నో కంటి సమస్యలను తగ్గిస్తుంది. అసలు మన కళ్లకు కలబంద ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

మాయిశ్చరైజింగ్

కలబంద ఒక సహజ మాయిశ్చరైజర్. ఈ కలబంద గుజ్జు  పొడి కళ్లను తగ్గిస్తుంది. కళ్లలో చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కళ్లను హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కంటి అసౌకర్యం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 

36

యాంటీ ఇన్ఫ్లమేటరీ

కలబందలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ల చుట్టూ ఉన్న నలుపును, వాపును తగ్గిస్తాయి. ముఖ్యంగా రోజు ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడటం, పర్యావరణ కాలుష్యం వల్ల కళ్ల చికాకు కలుగుతుంది. అయితే దీన్ని తగ్గించేందుకు కలబంద సహాయపడుతుంది. 

46

కూలింగ్ ఎఫెక్ట్

కలబందలో శీతలీకరణ ప్రభావాలు ఉంటాయి. ఇది అలిసిన కళ్లను రిఫ్రెష్ చేస్తుంది. కంటి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు కళ్లకు మంచి విశ్రాంతిని కలిగిస్తాయి. 
 

56

యాంటీ ఆక్సిడెంట్ 

కలబందలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. 
 

66

కంటి కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది

కలబందలో హైడ్రేటింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడతాయి. కలబంద గుజ్జు కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నలుపుదనాన్ని పోగొడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories