Beauty Tips: ముఖంపై రంధ్రాలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా ట్రై చేసి చూడండి?

Published : Jul 24, 2023, 12:25 PM IST

Beauty Tips: మన ముఖం ఎంత కాంతివంతంగా ఉన్నప్పటికీ ఎంత కళగా ఉన్నప్పటికీ ముఖం పైన ఉండే రంధ్రాలు ముఖం యొక్క అందాన్ని,  మన ఆనందాన్ని కూడా పాడు చేస్తాయి. కానీ ఈ విధంగా చేస్తే ముఖంపై రంద్రాలు పోతాయంట అదెలాగో చూద్దాం.  

PREV
16
Beauty Tips: ముఖంపై రంధ్రాలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఇలా ట్రై చేసి చూడండి?

 అందమైన మెరిసే ముఖాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ అది అన్నివేళలా సాధ్యపడదు. నేటి జీవన శైలి కారణంగా చర్మ సమస్యలు అనేకం  వస్తూనే ఉంటాయి. దుమ్ము ధూళి కాలుష్యం వలన ముఖం అనేక సమస్యలకి గురవుతుంది.

26

అయితే చాలామంది మహిళలు సమస్యకి పరిష్కారం చూడకుండా మేకప్ తో ఆ సమస్యని కవర్ చేయాలని చూస్తారు అది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే ఇంటి చిట్కాలతో ఆ సమస్యకి ఇలా చెక్ పెడదాం.

36

 ముల్తాని మిట్టి మొటిమలని తగ్గించడమే కాకుండా ముఖంపై ఉన్న రంధ్రాలని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇది మూసుకుపోయిన రంధ్రాల నుంచి వచ్చే తైలాన్ని ధూళిని పీల్చుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే మృత కణాలను తొలగించి రంధ్రాలను ఎక్స్పోలియేట్ చేయడానికి సహాయపడుతుంది.

46

అలాగే నిమ్మరసం కూడా ముఖం మీద ఉండే రంధ్రాలని పూట్టడంలో బాగా సహాయపడుతుంది ఇందులో ఉండే ఆస్ట్రింజెంట్ ముఖ రంధ్రాలని కప్పి ఉంచడంలో ప్రధాని పాత్ర పోషిస్తుంది. అలాగే రోజ్ వాటర్ నేచురల్ స్కిన్ కి మంచి టానిక్ ఇది కూడా రంద్రాలని మూసివేస్తుంది. అలాగే పెరుగు కూడా మంచిది ఔషధం.

56

 ఇది చర్మం యొక్క సాధారణ పీహెచ్ బ్యాలెన్స్ ని నిర్వహించడానికి సహాయపడుతుంది దీంతో ముఖంపై ఉండే రంధ్రాలని నయం చేసుకోవచ్చు. శనగపిండితో పెరుగుని కలిపి ముఖ రంధ్రాలపై సున్నితంగా రుద్దండి. ఆ తర్వాత నీటితో కడగటం వలన మృతకణాలు తొలగిపోయి ముఖంపై ఆయిల్ లేకుండా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది.
 

66

ఇది శరీరంపై టాన్ తొలగించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ రంధ్రాలని తొలగించడానికి మరొక దివ్య ఔషధం ఐస్ క్యూబ్. దీనిని మెత్తని  కాటన్ వస్త్రంలో చుట్టి ఓపెన్ రంద్రాలపై  కొన్ని సెకన్ల పాటు ఉంచండి. దీనివలన ముఖ రంధ్రాలు మూసుకుపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.

click me!

Recommended Stories