Memory Boost: 40 దాటక ముందే అన్నీ మర్చిపోతున్నారా? ఇవి తింటే చాలు..!
ముఖ్యంగా మతి మరుపు సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చినా తగ్గిపోవాలన్నా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే చాలు. మరి, అవేంటో తెలుసుకుందామా...
ముఖ్యంగా మతి మరుపు సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చినా తగ్గిపోవాలన్నా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే చాలు. మరి, అవేంటో తెలుసుకుందామా...
వయసు పెరిగే కొద్దీ మనకు ఆరోగ్య సమస్యలు రావడం చాలా కామన్. ముఖ్యంగా వృద్ధాప్యం లోకి అడుగుపెట్టిన తర్వాత కీళ్ల నొప్పులు, వీక్ గా అనిపించడం, విషయాలు మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇవి 60 దాటిన వారిలో కనిపించేవి. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. కనీసం 40 కూడా రాకముందే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.పని ఒత్తిడి, మనం సరైన ఆహారం తినకపోవడం, మన లైఫ్ స్టైల్ కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మతి మరుపు సమస్య రాకుండా ఉండాలన్నా, వచ్చినా తగ్గిపోవాలన్నా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే చాలు. మరి, అవేంటో తెలుసుకుందామా...
1.బాదం పప్పు..
బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ,విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. అవి మెదడుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బాదం తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. విషయాలను గుర్తుంచుకోవడంలో సహాయపడుతుంది. ఇది మెదడు కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది.మెదడు నరాలను బలపరుస్తుంది. ప్రతిరోజూ మీ ఆహారంలో 5-7 నానబెట్టిన బాదంపప్పులను చేర్చండి.
పసుపు
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.వాపును తగ్గిస్తుంది. పసుపులో సెరోటోనిన్ ,డోపమైన్ వంటి సంతోషకరమైన హార్మోన్లను పెంచే శక్తి కూడా ఉంది. ఇది మెదడును పదునుపెడుతుంది, మతిమరుపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
మెదడు ఆరోగ్యానికి పాలకూర
పాలకూరలో యాంటీ-ఆక్సిడెంట్లు , ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పాలకూరలో విటమిన్లు, ఖనిజాలు,అనేక యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో,మెదడును చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.
వాల్నట్
వాల్నట్లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవి మెదడు పనితీరును మెరుగుపరచడానికి ,జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తాయి. వాల్నట్లను మెదడు ఆహారం అని కూడా అంటారు. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మెదడు కణాలను రక్షిస్తుంది.