Summer Cool Water Effects: ఎండాకాలం కూల్ వాటర్ తాగితే ఎంత ప్రమాదమో తెలుసా..

Published : Mar 30, 2022, 02:15 PM IST

Summer Cool Water Effects: మండుతున్న ఎండలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక ఈ వేడితాపాన్ని తట్టుకోలేక చల్లని నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. కానీ కూల్ వాటర్ మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్ల నీళ్లను తాగడం వల్ల బరువు పెరగడమే కాదు.. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. 

PREV
19
Summer Cool Water Effects: ఎండాకాలం కూల్ వాటర్ తాగితే ఎంత ప్రమాదమో తెలుసా..

ఈ మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోయాయి. ఇక ఈ ఎండలు ఏప్రిల్, మే నెలలో మరింత దారుణంగా  పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. భగ్గుమంటున్న ఎండల దాటికి జనాలు తాలళేకపోతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి రక్షణ పొందేందుకు రకరకాల మార్గాలను వెతుక్కుంటున్నారు. 
 

29

ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు ఒంట్లో పెరిగిన వేడిని అదుపు చేసేందుకు కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, చల్లని నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇకబయట నుంచి ఇంటికొచ్చిన వారైతే నేరుగా ఫిడ్జ్ వద్దకే వెళ్తారు. చల్లని నీళ్ల బాటిల్ ను తీసుకుని మొత్తం తాగేస్తుంటారు. దీంతో ఒంట్లో వేడి కాస్త తగ్గుతుంది. ఒకరకంగా చల్లని నీళ్లు ఒంట్లో వేడిని తగ్గించడానికి ఎంతో  సహాయపడుతుంది. 
 

39

కానీ చల్లని నీళ్లు తాగడం అంత మంచి విషయమేమీ కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కూల్ వాటర్ తాగితే మన ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇంతకీ కూల్ వాటర్ మన ఆరోగ్యానికి ఏ విధంగా మంచిది కాదో తెలుసుకుందాం పదండి.. 

49

జీర్ణవ్యవస్థపై ప్రభావం.. చల్లని నీరు జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అన్నం తినే ముందు కూల్ వాటర్ తాగితే ఆహారం తొందరగా అరగదు. దీంతో అజీర్థి, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి. 

59

స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి.. ఈ ఎండాకాలం బయటనుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇంటికొచ్చిన వెంటనే చల్లని నీళ్లతో(ఫ్రిడ్జ్ వాటర్) ముఖం కడిగే అలవాటు ఉంటుంది. ఇది అస్సలు మంచి పద్దతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖంపై చల్లని నీటిని చల్లుకోవడం వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోతాయట. దాంతో స్కిన్ లోపలుండే వ్యర్థ పదార్థాలు  బయటకు రావు. తద్వారా ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి చల్లని నీళ్లతో ఎప్పుడూ ఫేస్ ను కడగకండి. 

69

తలనొప్పి వస్తుంది.. చల్లని నీళ్లను తాగితే వెన్నెముకలో ఉండే సెన్సిటీవ్ నరాలపై ప్రభావం పడి.. తలనొప్పి స్టార్ట్ అవుతుందట. అంతేకాదు దీంతో కపాలం, ముఖ కండరాలు లాగినట్టుగా అయ్యి విపరీతమైన తలనొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

79

మలబద్దకం.. తినే ముందు లేదా తింటున్నప్పుడు లేదా తిన్న తర్వాత చల్లని ఫ్రిడ్జ్ వాటర్ ను తాగితే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. దీంతో మలబద్దకం సమస్య వస్తుంది. కాబట్టి తినే  30 నిమిషాల ముందు.. తిన్న 30 నిమిషాల మాత్రమే నీళ్లను తాగాలట.  
 

89

బరువు పెరుగుతరు.. చల్లని నీళ్లను తాగితే కూడా బరువు పెరుగుతారంటే మీరు నమ్ముతారా..? కానీ ఇదే వాస్తవమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చల్లని నీళ్లను తాగడం వల్ల కేలరీలు చాలా నెమ్మదిగా ఖర్చవుతాయట. దీంతో మీరు వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందులోనూ జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం కారణంగా కూడా మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. 

99

హార్ట్ బీటింగ్ రేట్ తగ్గుతుంది..  ఎండాకాలం చాలా మంది చల్లని నీళ్లను తాగడానికే ఇష్టపడతారు కానీ.. చల్లని నీళ్లను తాగితే హార్ట్ బీట్ రేట్ తగ్గుతుందట. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. 

click me!

Recommended Stories