Sugar Patients: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తింటే మంచిది..

Published : Mar 14, 2022, 02:43 PM IST

Sugar Patients: 60 ఏండ్లు దాటినాక రావాల్సిన షుగర్ ఇప్పుడు ఇరవై ఏండ్లకే వస్తోంది. దీనికంతటికి ప్రధాన కారణం..  మన జీవన విధానమే..   

PREV
19
Sugar Patients: షుగర్ పేషెంట్లు ఏ పండ్లు తింటే మంచిది..

మారిన జీవన విధానం ఎన్నో రోగాలకు పునాదిగా మారింది. ఎప్పుడో డెబ్బై ఎనబై ఏండ్లకు రావాల్సిన రోగాలన్నీ ఇరవై ముప్పై ఏండ్లకే వస్తున్నాయి. ఇందులో షుగర్ పేషెంట్ల సంఖ్య ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. ఈ వ్యాధి వయసు మీద పడుతున్న వారికే వస్తుండేది. కానీ ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై ఏండ్ల వారికి కూడా ఇది వస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో చూడండి.. 

29

శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు ఉండటం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

39

అంతేకాదు ఈ వ్యాధి వారసత్వంగా కూడా వస్తుందని పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. స్వీట్లను ఇష్టంగా తినేవారిలో చాలా మంది షుగర్ బారిన పడ్డట్టు నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే మాత్రం ఏరి కోరి షుగర్ ను పెంచుకున్నవారవుతారు. 
 

49

అయితే చాలా మంది డయాబెటిస్ పేషెంట్లు పండ్లకు దూరంగా ఉంటారు. వైద్యులు కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉంటారు. కానీ పండ్లను మొత్తమే తినకపోతే మాత్రం పోషకాల లోపంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి షుగర్ పేషెంట్లు ఎలాంటి పండ్లను తినాలి? ఏ పండు తినకూడదో? తింటే ఎంత మోతాదులో తినాలో తెలుసుకుందాం.. 

59

సీతాఫలం: సీతాఫలాలు ఆరోగ్యానికి మంచివే అయినా.. వీటిని షుగర్ పేషెంట్లు అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో షుగర్ లెవెల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

69

దానిమ్మ:  దానిమ్మ పండు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది. కానీ వీటిని మోతాదులో తీసుకుంటేనే వారి ఆరోగ్యానికి మంచిది. షుగర్ పేషెంట్లు రోజు ఒక దానిమ్మ పండును తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. 
 

79

అరటి పండు: అరటి పండు మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఈ పండుతో బరువు కూడా తగ్గుతారు. కానీ ఈ పండులో షుగర్ లెవెల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఒక పండులో సగం మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

89

యాపిల్ : యాపిల్ పండ్లలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండ్లు Cholesterol stores ను కూడా తగ్గిస్తాయి. Digestive system ను  కూడా క్లీన్ చేస్తుంది. కాబట్టి వీరు రోజుకు రెండు యాపిల్ పండ్లను మాత్రమే తినాలి. ఇంతకంటే ఎక్కువ తింటే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

99

బొప్పాయి:  బొప్పాయి పండులో షుగర్ ను కంట్రోల్ చేసే గుణముంటుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు దీనిని తినడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ పండును షుగర్ పేషెంట్లు పరిమితిగానే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎన్నో షుగర్ లెవెల్స్ దారుణంగా పెరిగే అవకాశం ఉంది.  

Read more Photos on
click me!

Recommended Stories