లావుగా ఉండడం వల్ల నలుగురిలో కలవలేకపోతున్నారా.. ఈ పదార్దాలు తిని బరువు తగ్గాండి!

Published : Mar 14, 2022, 02:39 PM IST

అధిక బరువు (Overweight) సమస్య కారణంగా చాలామంది బాధపడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా తగిన ఫలితం లభించక నిరాశ చెందుతున్నారు. దీంతో నలుగురిలో కలవడానికి కూడా ఇష్టపడరు.  

PREV
18
లావుగా ఉండడం వల్ల నలుగురిలో కలవలేకపోతున్నారా.. ఈ పదార్దాలు తిని బరువు తగ్గాండి!
Overweight

ఇలాంటి వారు రోజువారీ ఆహార జీవన శైలిలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకుంటే కొవ్వును (Fat) కరిగించి అధిక బరువును తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆహార పదార్దాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం..
 

28
Overweight

శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడం కారణంగా బరువు పెరగడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలకు (Illness issues) దారితీస్తుంది. కనుక ప్రతిరోజూ తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. కొన్ని రకాల ఆహార పదార్థాలను  జీవనశైలిలో చేర్చుకుంటే కొవ్వును కలిగిస్తాయి. దీంతో బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా (Healthy) ఉంటారు.
 

38
Overweight

గుడ్డు: గుడ్డులో (Egg) మాంసకృత్తులు (Proteins) మెండుగా ఉంటాయి. వీటితోపాటు  విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కనుక ప్రతిరోజూ గుడ్డును తీసుకోవడంతో శరీరానికి కావలసిన శక్తి అంది రోజంతా హుషారుగా ఉంటారు. కాబట్టి ప్రతి రోజూ ఉదయం ఒక గుడ్డును తినండి ఆరోగ్యంగా ఉండండి.
 

48
Overweight

పాలకూర: పాలకూరలో (Lettuce) క్యాల్షియం, విటమిన్ సి, ఇనుము, ఫోలిక్ ఆమ్లం ఇలా ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి ప్రోటీన్స్ ను అందించి కొవ్వును కరిగిస్తాయి. అలాగే బరువును అదుపులో ఉంచుతాయి. ఇది కొవ్వును కలిగించడంతో పాటు శరీరానికి తన ఆరోగ్య ప్రయోజనాలను (Health benefits) కూడా అందిస్తుంది.
 

58
Overweight

ఓట్స్: ఓట్స్ (Oats) లో మాంసకృత్తులతో పాటు పీచు పదార్థం (Fiber) అధికంగా ఉంటుంది. ఇవి శరీర కొవ్వును కరిగించడానికి సహాయపడుతాయి. ఇందులోని పీచు కారణంగా తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకోవాలనిపించదు. అలాగే ఇతర చిరుతిళ్ళ వైపు దృష్టి పెట్టరు.
 

68
Overweight

చేపలు: చేపలలో (Fish) ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు (Omega 3 fatty acids) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కొవ్వును కరిగించడానికి సహాయపడుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. చేపలను తీసుకుంటే బరువు అదుపులో ఉండటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
 

78
Overweight

వెల్లుల్లి: వెల్లుల్లి (Garlic) ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో అల్లిసిన్ (Allicin) అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కనుక ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో వెల్లులి చేర్చుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అనేకం.
 

88
Overweight

బ్రోకలీ: బ్రోకలీలో (Broccoli) క్యాల్షియం, పీచు పదార్థంతో పాటు ఇతర పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. వీటి కారణంగా జీర్ణం కావడానికి చాలా సమయం పట్టడంతో కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాలనిపించదు. దీంతో బరువు అదుపులో ఉంటుంది. శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

click me!

Recommended Stories