Snakes : ఈ ఒక్క మంత్రం చదివితే చాలు.. పాములు ఇంటి దరిదాపులకు కూడా రావా..?

Published : May 14, 2026, 03:21 PM IST

భారతీయ సంస్కృతిలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే పాములను దేవతలుగా పూజించే మనమే అవి ఇంట్లోకి వస్తే భయపడతాం. కానీ కొన్ని మంత్రాలు పాములు మనకు ఎలాంటి హాని చేయకుండా ఉపయోగపడతాయని పురాణాలు చెబుతున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.  

PREV
16
పాములను దూరంగా ఉంచే పరిష్కారాలు..

వానాకాలమే కాదు ఎండాకాలంలో కూడా ప్రమాదకరమైన పాములు ఇళ్లలోకి వస్తుంటాయి. కేవలం అటవీప్రాంతాల్లోనే కాదు గ్రామాలు, పట్టణ శివార్లలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ వంటి నగరాల్లో రోజురోజుకు పాములు పెరుగుతున్నాయని అనేక స్టడీస్ చెబుతున్నాయి… ఇక చుట్టూ పొలాలుండే పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.  

అయితే పాములు ఇంటి పరిసరాల్లోకి రాకుండా అనేక చిట్కాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో పాములను పూజిస్తాం… కానీ అవి ఇంట్లోకి రాకుండా ఎలా ఆపాలో కూడా ఈ ధర్మమే చెబుతుంది. భారతీయ పురాణాలు, గ్రంథాల్లో పాములను తరిమికొట్టేందుకు చాలా మార్గాలు చెప్పబడ్డాయి. మంత్ర శక్తితో ఏదైనా సాధించవచ్చని నమ్ముతారు.

26
ఆస్తీక ముని రక్షణ మంత్రం...

ఇంటి నుంచి పాములను దూరంగా ఉంచడంలో ఆస్తీక ముని పేరు చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం… సర్ప యాగం సమయంలో పాములను రక్షించింది ఆస్తీక మునే. అందుకే ఆయన పేరు చెబితే పాములకు నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టే అంటారు.

36
పాములు ఇంట్లోకి రాకుండా ఈ మంత్రం పఠించండి

ఇంటి దగ్గర పాము కనిపించినప్పుడు ఈ మంత్రం పఠిస్తే అది తన దారి మార్చుకుంటుందట. 'మునిరాజం ఆస్తికం నమః

సర్పాపసర్ప భద్రం తే గచ్ఛ సర్ప మహావిష్

జనమేజయస్య యజ్ఞంతే ఆస్తికవచనం స్మరన్|' 

దీని అర్థం : 'ఓ విషపూరిత సర్పమా, ఆస్తీక ఋషి మాటలను గుర్తు తెచ్చుకుని వెనుదిరిగి వెళ్ళు'. ఈ మంత్రానికి పాములు స్పందించి మనకు హాని చేేయకుండా వెళతాయని పురాణాలు చెబుతున్నాయి.

46
నాగ గాయత్రీ మంత్రం...

పాముల భయాన్ని పోగొట్టడానికి, వాటిని శాంతింపజేయడానికి నాగ గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు. ‘’ఓం నవకులాయ విద్మహే… విషదంతాయ ధీమహి… తన్నో సర్పః ప్రచోదయాత్'. ఈ మంత్రం ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. విష జీవులు ఇంట్లోకి రాకుండా ఇది అడ్డుకుంటుందట.

56
గరుడ మంత్రం..

గరుత్మంతుడు పాములను తినే పక్షి, విష్ణువు వాహనం. గరుత్మంతుడి పేరు చెబితేనే పాములు వణికిపోతాయంటారు. ఈ మంత్రాన్ని ఇంటి గడప దగ్గర పఠించాలట. 'ఓం క్షిప స్వాహా. ఓం పక్షిరాజాయ విద్మహే, స్వర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్'.

66
శ్రీ శివ పంచాక్షర మంత్రం..

శివుడి మెడలో పాము ఉంటుంది. అందుకే ఆయన్ను నమ్మిన వారికి పాములంటే భయం ఉండదంటారు. 'ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ'. ఈ మంత్రం ప్రభావంతో ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుందంటారు. పాములు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావట.

Read more Photos on
click me!

Recommended Stories