Telugu

పాములు నిజంగానే నిధులను కాపాడతాయా..?

Telugu

హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి..?

పాములు నిధులకు కాపలాగా ఉంటాయని హిందూ పురాణాలు చెబుతాయి. సినిమాల్లో, కథల్లోనూ ఇదే చూపిస్తారు. నిజంగానే ఖజానాలకు పాములు కాపలా ఉంటాయా? ఈ నమ్మకం వెనుక ఉన్న అసలు నిజం ఏంటో చూద్దాం.

Image credits: Gemini Generated
Telugu

పాములకు నిధులున్న చోటు తెలుస్తుందా?

నిధులు లేదా ఖజానాలు ఉన్న ప్రదేశాన్ని పాములు సులభంగా పసిగడతాయని పురాణ కథలు చెబుతాయి. అందుకే నిధులున్నచోట పాములు నివాసం ఉంటాయని చాలామంది నమ్ముతారు.

Image credits: Gemini Generated
Telugu

రావణ సంహితలో ఏముంది..?

రావణ సంహిత ప్రకారం, మన పూర్వీకులే తమ సంపదను కాపాడుకోవడానికి పాములుగా పునర్జన్మ ఎత్తుతారని ఒక నమ్మకం ఉంది.

Image credits: Gemini Generated
Telugu

జంతుశాస్త్ర నిపుణులు ఏమంటున్నారు?

పాములు నిధులను కాపాడతాయనడంలో నిజం లేదని సర్పాల నిపుణులు (Herpetologists) స్పష్టం చేస్తున్నారు. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు.

Image credits: Gemini Generated
Telugu

పాములు ఎక్కడ ఉంటాయి...?

నిపుణుల ప్రకారం.. పాత శిథిలాలు, సమాధులు, జనసంచారం లేని ప్రదేశాలు పాములకు సురక్షితంగా అనిపిస్తాయి. అందుకే అలాంటి చోట్ల పాములు ఎక్కువగా కనిపిస్తాయి.

Image credits: Gemini Generated
Telugu

నిధులను గుర్తించే శక్తి పాములకు లేదు

పూర్వం తమ నిధులను కాపాడుకోవడానికే మన పూర్వీకులు ఇలాంటి కథలు అల్లి ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చిచెబుతున్నారు.

Image credits: Gemini Generated
Telugu

అదంతా అబద్ధం.. కేవలం యాదృచ్ఛికం

పూరీ జగన్నాథుడి భండాగారంలో పాములున్నాయని కథలు ప్రచారంలో ఉండేవి. కానీ తలుపులు తెరిచినప్పుడు అది అబద్ధమని తేలింది. నిధుల దగ్గర పాములు కనిపించడం కేవలం యాదృచ్ఛికమే.

Image credits: Gemini Generated

సైన్స్ కు అందని అద్భుతం.. రోజుకు మూడుసార్లు రంగులు మార్చే శివలింగం

AC Bill : మే నెలలో ఏసీ బిల్లు తక్కువ రావాలా? ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి

ఆసియాలోనే మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఇండియాదే.. ఎక్కడుందో తెలుసా..?

పాకిస్తాన్‌లో iPhone 17 ధర ఎంతో తెలుసా...?