మన దంతాలు మూడు పొరలతో తయారవుతాయన్న ముచ్చట మీకు తెలుసా? అవును ఎనామెల్, డెంటిన్, నరాలతో మన పళ్లు తయారువుతాయి. దంతాల బయటి పొర ఎనామెల్. ఈ ఎనామెల్ ప్రధానంగా ఖనిజాలతో తయారవుతుంది. నిజానికి ఎనామెల్ లో దాదాపు 96% ఖనిజాలు ఉంటాయి. ఇది ఎముక కంటే గట్టిగా ఉంటుంది. అలాగని గట్టివాటిని కొరికారంటే దంతాలు దెబ్బతింటాయి.