solar eclipse 2023: ఈ ఏడాది అక్టోబర్ 15న నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నవరాత్రులకు ఒక రోజు ముందే అంటే అక్టోబర్ 14వ తేదీనా శనివారం సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదిలో ఇది రెండో సూర్యగ్రహణం.
భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణించినప్పుడు.. సూర్యరశ్మి భూమిని చేరదు. దీనినే సూర్య గ్రహణం అంటారు. నమ్మకాల ప్రకారం.. గ్రహణం ఏర్పడటాన్ని శుభప్రదంగా భావించరు. ఈ ఏడాది ఏర్పడే రెండో సూర్యగ్రహణం భారత్ లో కనిపించదు. ఈ గ్రహణం ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడా, అర్జెంటీనా తదితర దేశాల్లో కనిపిస్తుంది.
ఈ ఖగోళ ఘట్టాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అయితే సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి భద్రత లేకుండా నేరుగా కంటితో చూడటం మంచిది కాదు. దీనివల్ల కంటిచూపు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కంటిచూపు శాశ్వతంగా పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే గ్రహణాన్ని చూడాలనుకుంటే కంటికి రక్షణను పెట్టుకోవాలి.
సూర్యగ్రహణం సమయంలో గుర్తుంచుకోవాల్సి విషయాలు
బైనాక్యులర్ లను ఉపయోగించండి
గ్రహణం సమయంలో సూర్యరశ్మి చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది మన కంటి రెటీనాను దెబ్బతీస్తుంది. అందుకే గ్రహణాన్ని చూస్తున్నప్పుడు కళ్లను రక్షించడం చాలా ముఖ్యం. గ్రహణాన్ని చూడటానికి మీరు టెలిస్కోప్ లేదా కెమెరాను కూడా ఉపయోగించొచ్చు.
వీటిని ఉపయోగించొద్దు
అయితే గ్రహణాలను చూడటానికి చాలా మంది ఇంట్లో తయారుచేసిన ఫిల్టర్లను ఉపయోగిస్తుంటారు. కానీ ఇవి కళ్లను రక్షించలేవు. ఇది మీ కళ్లకు ఎంతో హాని కలిగిస్తుంది. గ్రహణాన్ని చూడటానికి ఇంట్లో తయారుచేసిన ఫిల్టర్లు లేదా తాత్కాలిక ఉపకరణాలను ఎప్పుడూ ఉపయోగించకండి. గ్రహణం చూడటానికి సన్ గ్లాసెస్ ను కూడా వాడకూడదు.
చర్మం జాగ్రత్త
గ్రహణం సమయంలో ఎక్కువ సేపు బయట ఉంటే సూర్యుని హానికరమైన కిరణాలు మీ చర్మాన్ని దెబ్బతీస్తాయి. అలాగే గ్రహణం సమయంలో పిల్లలను ఒంటరిగా విడిచిపెట్టకూడదు.