ఈ రోజే సూర్యగ్రహణం.. ఈ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?

First Published | Oct 14, 2023, 9:34 AM IST

Solar Eclipse 2023: ఈ ఏడాది మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏప్రిల్ 20న సంభవించింది. ఇక ఇదే ఏడాది రెండో, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 న అంటే ఈ రోజే ఏర్పడనుంది. అందుకే ఈ సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి పనులకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Solar Eclipse 2023: సైన్స్ దృష్ట్యా సూర్యగ్రహణం ఒక ఖగోళ సంఘటన. కాగా మతపరంగా ఈ సంఘటనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో నెగెటివ్ ఎనర్జీ విడుదలవుతుంది. ఇది మనపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ కాలంలో సుతక్ కాలం వర్తించదు. అయినా ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవొచ్చు.

సూర్యగ్రహణం ప్రాముఖ్యత

ధార్మిక కోణంలో సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శాస్త్రీయంగా చెప్పాలంటే.. చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య ప్రయాణించినప్పుడు.. సూర్యరశ్మి ఈ సమయంలో భూమిని చేరదు. దీనిని సూర్యగ్రహణం అంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యగ్రహణం అక్టోబర్ 14 రాత్రి 08:34 గంటలకు ప్రారంభమవుతుంది. 02.25 గంటలకు ముగుస్తుంది.
 


గ్రహణం సమయంలో ఈ పనులు చేయండి

సూర్యగ్రహణం సమయంలో దేవుడిని పూజించడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. కానీ మీరు మీ మనస్సులో ఇష్టమైన దేవుని నామాన్ని జపించొచ్చు. గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించొచ్చు. ఇలా చేయడం వల్ల గ్రహణం ప్రతికూల ప్రభావాలు మీపై పడవు. అలాగే గ్రహణం సమయంలో తులసి ఆకులను నెయ్యిలో వండిన ఆహారం, పాలు, లస్సీ, జున్ను మొదలైనవాటిలో వేయాలి. దీంతో సూర్యగ్రహణం ప్రభావం వీటిపై పడదు. అవి విషతుల్యం కావు.
 

ఈ పనులు చేయకండి

గ్రహణ సమయంలో ఆహారం తినొద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ నియమాలు అందరికీ వర్తించవు. సుతక్ కాలంలో కూడా పిల్లలు లేదా వృద్ధ రోగులు తినొచ్చు. వీరికి సూర్యగ్రహణ నియమాలు వర్తించవు. ముఖ్యంగా సూర్యగ్రహణాన్ని నేరుగా కంటితో చూడకూడదు. అలాగే ఏ మతపరమైన ప్రదేశానికి కూడా వెళ్లకూడదు. అలాగే జుట్టు లేదా గోర్లు కత్తిరించకూడదు. ఆయిల్ మసాజ్ కూడా ఈ సమయంలో నివారించాలి. అలాగే గ్రహణం సమయంలో బయటి ప్రయాణాలకు వెళ్లకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Latest Videos

click me!