చాలా మంది ఏసీని ఎక్కువలో పెట్టేసి నిండుగా దుప్పటి కప్పుకుని పడుకుంటుంటారు రాత్రిళ్లు. చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. కరెంట్ బిల్లు ఎక్కువగా రాకూడదంటే ఏసీని 24, 23 డిగ్రీలు పెట్టి చలికి వణికేటట్టు మాత్రం పెట్టకూడదు. ఇలాంటప్పుడు మీకు ఏసీ అవసరం లేదు కదా. దీనివల్ల కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. ఉష్ణోగ్రతను ఒక యూనిట్ తగ్గించడం వల్ల విద్యుత్ విద్యుత్ వినియోగం 6 శఆతం పెరుగుతుందట. నార్మల్ గా మనం కంఫర్ట్ బుల్ గా ఉండాలంటే మాత్రం ఏసీని 25, 26 డిగ్రీల్లో థర్మోస్టేట్ తోని ఏసీని పెట్టుకుని ఫ్యాన్ ఆన్ చేసుకుని తక్కువలో పెట్టుకుంటే మనకు కూల్ ఎయిర్ వస్తుంది. చల్లగా అనిపిస్తుంది. తర్వాత ఏసీ థర్మోస్టేట్ మీద ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల చల్లగానూ ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా తక్కువగా గానూ వస్తుంది. దీనివల్ల 50 శాతం కరెంట్ ఆదా అవుతుంది.