Published : Feb 24, 2022, 03:02 PM ISTUpdated : Feb 24, 2022, 03:54 PM IST
Maha Shivaratri : కొత్తగా ఏదైనా కనిపెడితే.. వాళ్లను సైంటిస్టులుగా పిలుస్తున్నాం. అలా చూసుకుంటే పరమేశ్వరుడు కూడా ఈ లోకానికి మొదటి శాస్త్రవేత్త అవుతాడు. ఎలాగంటారా? భావ వ్యక్తీకరణ, సప్త స్వరాలు ఇలా ఎన్నో విషయాలు ఈశ్వరుని ఆవిష్కరణలే..
Maha Shivaratri : ఈ జగతిలో ప్రతి ఒక్కటీ భగవంతుని నియంత్రణలోనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి . అందులో సర్వం శివునిలోనే నిండి ఉందని నమ్ముతారు. అందుకే కదా శివుని ఆజ్ఞ లేనిదే చీమలు కూడా కుట్టవంటుంటారు.
27
ఈ భూమిపై ఉండే ప్రతి దానిలోనూ ఈశ్వరుడుంటాడనీ, సర్వం ఈశ్వరమయం అని ఈ పరమేశ్వరునికి ఎంతో మంది భక్తులున్నారు. నిత్యం ఈ పరమేశ్వరునికి పూజలు చేస్తూ.. సుఖ సంతోషాలతో ఉండేలా చూడమని ఆయన్ను కోరుతూ ఉంటారు. కోరిన వరాలను కాదనకుండా నెరవేర్చే దేవదేవుడిగా భక్తులచే పూజలు, అభిషేకాలు అందుకుంటున్నాడు ఈ పరమేశ్వరుడు.
37
మన పుట్టుక నుంచి మరణాంతరం మనం చేరుకునే వరకూ శివుడు మన ప్రతి చర్యలో ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ జగతికి ఈశ్వరుడే మొదటి శాస్త్రవేత్తగా పురాణాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
47
భావ వ్యాక్తీకరణకు, చరిత్ర పుట్టు పూర్వోత్తరాలకు భాష ఎంతో ముఖ్యం. భాష లేకపోతే ఈ లోకం ఇలా ఉండేది కాదేమో. కాగా ఈ పరమేశ్వరుడు తన ఢమరుక నాదం ద్వారానే భారతీయ భాషలకు మూలమైన 14 సూత్రాలను Create చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
57
సంగీత విద్యాకు మూలమైన సప్తస్వరాలను శివుడే ఆవిష్కరించాడట. షడ్జమం ,రిషభం , గాంధారం , మధ్యమం ,పంచమం , దైవతం , నిషాదం లను వరుసగా నెమలి ,ఎద్దు, మేక, గుర్రం , కోకిల,కంచరగాడిద, ఏనుగు ల ధ్వనుల స్వాభావంతోనే ఆవిష్కరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
67
ఇకపోతే నృత్యవిద్య శివతాండవం ద్వారానే వెలుగులోకి తెచ్చాడట. తనలో సగం భాగం అర్ధాంగికి అంటూ పార్వతికి ఇచ్చి, గంగమ్మ తల్లిని తన తలపై పెట్టుకున్నాడు. వీటి ద్వారా మహిళలకు ఎంత గౌరవం ఇవ్వాలో ఈ లోకానికి చెప్పాడు.
77
ఈ సమాజంలో భేధాలు, విభేధాలు, మనుషుల మధ్య అసమానత్వం రూపుమాపు కావాలని శివతత్వం ప్రసాదించాడట. పార్వతీ దేవే మొదటగా యోగవిధ్యను భోధించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.