దుస్తులపై మరకలు పడితే వదలడం అంత సులభం కాదు. ముఖ్యంగా టీ, కాఫీ మరకలు అంత ఈజీగా వదలవు. సబ్బుతో ఉతికినా మొత్తం వదలవు. అలాంటివారు.. కొన్ని సింపుల్ ట్రిక్స్ వాడటం వల్ల ఈజీగా తొలగించవచ్చట.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
మీ దుస్తులపై టీ, కాఫీ లు పొరపాటున పడుతూ ఉంటాయి. అది చాలా సహజం. అలా పడిన వెంటనే టిష్యూతో తుడిచి ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల చాలా వరకు మరక తొలగిపోతుంది. మిగిలిన మరకలను టూత్ పేస్టుతో కూడా వదిలించవచ్చు. ఈ మరకలకు కాస్త టూత్ పేస్ట్ ను అప్లై చేసి.. కొద్ది సేపటి తర్వాత శుభ్రం చేస్తే మరకలు మటుమాయం అవుతాయి..