Relationship Tips:శుక్రవారం నాడే ఎక్కువగా బ్రేకప్స్ అవుతున్నాయట? ఎందుకో తెలుసా..

First Published | Mar 8, 2022, 12:50 PM IST

Relationship Tips: రిలేషన్ షిప్ లో ఉండటం ఎంత తేలికో.. ఆ బంధాన్ని కలకాలం నిలుపుకోవడం కూడా అంతకంటే కష్టతరమైంది. ఒక రిలేషన్ షిప్ బ్రేకప్ కాకూడదంటే ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీ రిలేషన్ షిప్ లో కొట్లాటలు, గొడవలు, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం ఎక్కువైతే మాత్రం అది బ్రేకప్ కు దగ్గర  పడిందని అర్థం చేసుకోవాలి.

Relationship Tips: బంధాలు, బంధుత్వాలకు వెల కట్టలేం. అవి స్వచ్ఛమైనవి. మరెంతో మధురమైనవి. ఈ బంధాలను అర్థం చేసుకున్నప్పుడే వాటి విలువ తెలుస్తుందంటారు పెద్దలు. ఒక రిలేషన్ షిప్ లో ఉండటం తేలికైన విషయమే. కానీ దాన్ని కలకాలం నిలబెట్టుకోవడమే ఎంతో కష్టం. 
 

బంధాలు గొప్పవి. మనసుతో ముడిపడి ఉన్న బందాలు ఒక సారి బ్రేక్ అయితే మళ్లీ అవి కలవలేవు. కబీర్ దాస్ అన్నట్టుగా మనసనే దారం ఒకసారి తెగిపోతే దాన్ని మళ్లీ అతికించడం రాదు. దాన్ని ముడివేసినా.. అది శాశ్వతంగా ఉండదు. బంధాలు కూడా ఇలాగే ఉంటాయి.


ఒకసారి రిలేషన్ షిప్ లో కలహాలు వస్తే వాటిని తగ్గించే ప్రయత్నం చేయకపోతే ఆ బంధానికి రోజులు దగ్గర పడ్డాయని అర్థం చేసుకోవాలి. ప్రేమైనా, పెళ్లైనా.. ఎమోషన్స్ చాలా ముఖ్యం. ఎమోషన్స్ ను ఎదుటివారికి అర్థమయ్యేటట్టు చెప్తేనే మీ బంధం కలకాలం కలిసి ఉంటుంది. 
 

మనకు ఇతర జీవులకున్న తేడా ఏంటో తెలుసా.. ఎమోషన్స్ యే. కేవలం మనుషులే వారి మనసులో ఉండే ఎమోషన్స్ ను క్లియర్ గా చెప్పగలుగుతారు. అలా చెప్పినప్పుడే ఎదుటివారిని మీరెంతగా ప్రేమిస్తున్నారో తెలుస్తుంది. 

మీ ఎమోషన్స్ ను మనసులోనే దాచేసి.. ఎదుటి వారికి చెప్పకుంటే మాత్రం మీ రిలేషన్ షిప్ బీటలువారబోతుందని అర్థం చేసుకోవాలి.

Illicit Encounters అనే ఒక ఇంగ్లిష్ వెబ్‌సైట్‌ బ్రేకప్స్ పై సర్వే నిర్వహించింది. ఆ రిపోర్టు ప్రకారం.. వారంలో శుక్రవారం రోజే  చాలా జంటలు విడిపోతున్నాయట. ఈ రోజే గొడవలు పడుతున్నారని పరిశోధనలో తేలింది. 

ఈ పరిశోధన ప్రకారం.. ప్రస్తుత కాలంలో రిలేషన్స్ మధ్య మోసం కామన్ విషయంగా మారిందట. ఇద్దరిలో ఎవరో ఒకరు వేరే వారితో ఎఫైర్ ఉంటే దాని నుంచి వారిని బయటపడేసే దిశగా ఆలోచించకుండా.. వారిని ఎలా వదిలించుకోవాలనే ఆలోచిస్తున్నారట. ఇక దీనికి బెస్ట్ సోల్యూషన్ బ్రేకప్ అనే భావిస్తూ విడిపోతున్నారట. 

ముఖ్యంగా కపుల్స్ మధ్యన గొడవ జరిగితే.. దాన్ని పరిష్కరించే దిశగా కాకుండా మరింత పెద్దదిగా చేయడమే పనిగా పెట్టుకున్నారని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!