ఇంట్లో అగర్బత్తీలు వెలిగిస్తున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా?

First Published Jun 27, 2024, 10:33 AM IST

రోజూ ఈ పొగలు పీల్చి.. ఆరోగ్యాలు పాడుచేసుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు.  తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 

ప్రతి ఒక్కరి ఇంట్లో అగరబత్తీలు ఉంటాయి. దేవుడికి పూజ చేసిన సమయంలో వాటిని వెలిగిస్తూ ఉంటారు.  ఎందుకంటే... అగర్బత్తీలు లేకుండా పూజ పూర్తవ్వదు.  ఇక కొందరు అయితే.. పూజతో సంబంధం లేకుండా.. ఇంట్లో మంచి వాసన వస్తుంది కదా అని రోజంతా కూడా వెలిగిస్తూ ఉంటారు. నిజానికి... వీటిని ఇంట్లో వెలిగించడం వల్ల...  పాజిటివిటీ పెరుగుతుంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ... అగరబత్తీల వాసన పీల్వడం మంచిదేనా..? దీనిని పీల్చడం వల్ల.. ఎన్ని సమస్యలు వస్తాయో తెలుస్తాయా..? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
 

incense sticks

నిజానికి అందరూ... పొగ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటారు. అయితే...  స్మోకింగ్ చేయడం వల్ల ఎంత నష్టం ఉందో... అగర్బత్తీలు వాడటం వల్ల కూడా అంతే నష్టం ఉంది అంటే మీరు నమ్ముతారా..? రోజూ ఈ పొగలు పీల్చి.. ఆరోగ్యాలు పాడుచేసుకున్నవారు కూడా చాలా మందే ఉన్నారు.  తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. 

Facts of agarbatti

ఇంట్లో అగర్బత్తీలు వెలిగించం వల్ల.. వాటి నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనే కాలుష్యానికి, మన ఆరోగ్యానికి హాని  చేసే కారకాలు ఉంటాయి. అవన్నీ బయటకు విడుదల అవుతాయి.  అది వాయి కాలుష్యానికి కారణం అవుతుంది.  ఇది ఊపిరితిత్తుల కణాల వాపుకు కారణం అవుతాయి. శ్వాసకోస సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఒక వ్యక్తి అధికంగా పొగ  పీల్చినప్పుడు.. హైపర్సెన్సిటివిటీ కారణంగా.. తుమ్ములు, దగ్గు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ వాసనకు ఉక్కిరిబిక్కరి అయ్యే ప్రమాదం కూడా ఉంది.

Facts of agarbatti

అగరబ్తత్తీలు కాల్చడం వల్ల... విడుదలయ్యే కాలుష్యకారకాలు ఊపిరితిత్తులకు గాలిని పంపే శ్వాసనాళాల వాపుకు కారణమౌతాయి. ఈ స్టిక్స్ లో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మెనాక్సైడ్, నైట్రోజన్ , ఫార్మల్డిహైడ్ ఆక్సైడ్ లు ఉంటాయి. ఇవి క్రమం తప్పకుండా బహిర్గతం అయినప్పుడు COPD, ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయి. అగర్బత్తీల పొగ పీల్చడం.. స్మోకింగ్ చేయడంతో సమానం అని  నిపుణులు చెప్పడం విశేషం 
 

కనపడని సమస్యలు మాత్రమే కాదు.. కనిపించే సమస్యలను కూడా కలిగిస్తాయి. ఈ అగర్బత్తీలు వెలిగించడం వల్ల.... చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి వెంటనే కనిపిస్తాయి.  ఆ పొగ తగలగానే.. చర్మంపై దురద వస్తూ ఉంటుంది.

అగరబత్తిని ప్రతిరోజూ బహిర్గతం చేయడంతో సంబంధం ఉన్న సాధారణ నరాల లక్షణాలు తలనొప్పి, ఏకాగ్రత , మతిమరుపు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అగరుబత్తీలను కాల్చడం వల్ల ఇండోర్ వాయు కాలుష్యానికి దోహదపడుతుంది, ఇది రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ (CO) నైట్రోజన్ ఆక్సైడ్ (NOx) గాఢతను పెంచుతుంది. ఈ వాయువుల అధిక సాంద్రత మెదడు కణాలపై పనిచేయడం ద్వారా నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. మీ గుండె ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. 

Latest Videos

click me!