యోని దగ్గర దురద.. కారణాలు ఇవే..!

Published : Mar 05, 2023, 03:22 PM IST

చాలా మంది మహిళలకు తరచుగా యోని దగ్గర దురద పెడుతుంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తడి లోదుస్తుల నుంచి పొడి యోని వరకు దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి.   

PREV
19
యోని దగ్గర దురద.. కారణాలు ఇవే..!
vaginal health

దగ్గర దురద పెట్టడానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఏదేమైనా యోని దగ్గర దురద పెడుతుందంటే మీ యోని ఆరోగ్యం బాగాలేదని అర్థం. అసలు యోని ఆరోగ్యంగా ఉండటమేంటి అనే సందేహాలు కూడా వస్తుంటాయి. మన శరీరంలోని అన్ని అవయవాలతో పాటుగా యోని ఆరోగ్యం కూడా ముఖ్యమే. లేదంటే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు యోని దగ్గర దురద ఎందుకు పెడుతుంది? దీనిని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

29

ఈస్ట్ ఇన్ఫెక్షన్

యోని దురద ఈస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ దురదను కలిగించడమే కాకుండా తెల్లని, మందపాటి, పెరుగు వంటి ఉత్సర్గను కలిగిస్తుంది. 
 

39

బాక్టీరియల్ వాగినోసిస్

యోనిలో ఒక నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నప్పుడు దురద పెడుతుంది. యోనిలో సాధారణంగా సంభవించే బ్యాక్టీరియా గార్డనెల్లా.  బ్యాక్టీరియల్ వాగినోసిస్ వల్ల మూత్రం చేపల, కాలిన స్మెల్ రావడం, ఆకుపచ్చ, బూడిద లేదా తెలుపు వంటి ఉత్సర్గ వస్తుంది. 

49

యోని పొడిబారడం

యోని పొడిబారడం వల్ల యోని లోపల దురద పెడుతుంది. యోని పొడిబారడం వల్ల సెక్స్ సమయంలో మీకు నొప్పి, అసౌకర్యంగా కూడా ఉండొచ్చు. దీని కోసం మీరు ఏ లూబ్రికెంట్ అయినా ఉపయోగించొచ్చు.

59

యోని దురదను నివారించడానికి  నిపుణుల చిట్కాలు 

పీరియడ్ సమయంలో ప్యాడ్ ను మార్చాలి

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పీరియడ్స్ సమయంలో ప్యాడ్లు లేదా టాంపోన్లను ఉపయోగిస్తే.. ప్రతి 4 లేదా 6 గంటలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలి. లేకపోతే మీకు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను సోకుతాయి. దురద కూడా పెడుతుంది. చాలాసార్లు మహిళలు సోమరితనంగా ప్రవర్తించడం వల్లే యోనిలో ఎన్నో సమస్యలు వస్తాయి. 
 

69
vaginal hygiene

కాటన్ లోదుస్తులను వదిలి ఫ్యాషన్ లో దుస్తులను ధరించడం 

గాలి కూడా వెళ్లలేని సింథటిక్ లోదుస్తులనే చాలా మంది మహిళలు ధరిస్తారు. దీనివల్ల చర్మం సరిగా శ్వాస తీసుకోలేకపోతుంది. యోని ఆరోగ్యంగా ఉండాలంటే కాటన్ లోదుస్తులనే ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కాటన్ లోదుస్తులు చర్మానికి గాలి చేరడానికి సహాయపడతాయి. 

79

తడి లోదుస్తులకు దూరంగా ఉండండి

తడి లోదుస్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి మీ యోనిలో ఎన్నో రకాల బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. వర్షాకాలంలో చాలాసార్లు లోదుస్తులు సరిగా ఎండవు. అయినా అలాగే వేసుకుంటారు. దీనివల్ల దురద పెడుతుంది. అందుకే ఇకపై తడి లోదుస్తులను అస్సలు వేసుకోకండి.

89

పరిశుభ్రత

యోని దానికదే శుభ్రం చేసుకుంటుంది. అందుకే మీరు దీనిని ఎక్కువగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా యోనిని కడగడమే. యోనిని శుభ్రపరుస్తామని సువాసనగల సబ్బులు, జెల్స్ లేదా క్లెన్సర్లు వంటి ఉత్పత్తులను అస్సలు వాడకండి. ఇవి మీ యోనిలో దురద పెట్టేందుకు కారణమవుతాయి. 
 

99

ప్రోబయోటిక్స్ తీసుకోండి

ప్రోబయోటిక్స్ మీ గట్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచడానికి పనిచేస్తాయి. యోనికి బ్యాక్టీరియా చాలా ముఖ్యమైనది. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియా ఏర్పడటానికి సహాయపడతాయి. ప్రోబయోటిక్స్ కోసం పెరుగును తినండి.

click me!

Recommended Stories