ఇయర్ ఎండింగ్ కు వచ్చేశాం. ఇక ఈ ఏడాది మొదట్లో ఏమేమి చేయాలనుకున్నాం.. వాటిలో ఏవి జరిగాయి? ఏవి జరగలేదో లెక్కలేసుకునే టైం వచ్చేసినట్టే. ఈ ఏడాది ముగుస్తుండటంతో కొత్త ఏడాదిలో ఏం చేయాలి? ఏం చేయకూడదు అన్న ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోయే ముందు ఈ ఏడాదిలో మీరు అనుకున్నవన్నీ జరిగాయేమో చెక్ చేసుకున్నారా? మనలో చాలా మంది బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. మరి 2023లో ఖచ్చితంగా బరువు తగ్గాలని అనుకున్నవారు ఎంత మంది ఉన్నారు. మీరు నిజంగా బరువు తగ్గారా? అంటే చాలా మంది లేదనే చెప్తారు. మరి మీరు ఎందుకు బరువు తగ్గలేదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
Image: Getty
వ్యాయామం చేయకపోవడం
రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ఇది మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా మిమ్మల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఇది మీ బరువు పెరగకుండా చూస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. వ్యాయామం చేయకుండా బరువు తగ్గాలని చాలా మంది అనుకుంటారు. అస్సలు పాజిబుల్ కాదు. మీరు ఎంత గట్టిగా అనుకున్నా.. వ్యాయామం చేయకుండా ఇంచు బరువు కూడా తగ్గరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలంటే శారీరక శ్రమ చేయండి.
obesity
ఎక్కువగా తినడం
బరువు తగ్గకపోవడానికి అసలు కారణం ఇదే. ఎక్కువగా తింటే మీరు ఏం చేసినా బరువు తగ్గరు. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీ శరీర బరువు విపరీతంగా పెరుగుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. మీరు తినే ఆహారాన్ని ట్రాక్ చేస్తే బరువు తగ్గే అవకాశం ఉంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. అతిగా తినడమంటే ఎక్కువగా, చాలా ఫాస్ట్ గా తినడం. మీ శరీర అవసరం కంటే ఎక్కువగా తిన్నారంటే పక్కాగా బరువు పెరుగుతారు.
అధిక బరువు
ఫాస్ట్ గా తినడం
ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా తినడానికి కూడా టైం లేని వారు చాలా మందే ఉన్నారు. తినడానికి తక్కువ టైం ఉన్నవారు చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా తింటుంటారు. కానీ ఇది కూడా మీ బరువును పెంచడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం.. బుద్ధిపూర్వకంగా తినడం వల్ల మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు. మీ మెదడు పంపే సంకేతాలను గమనిస్తూ.. నెమ్మదిగా, పరధ్యానం లేకుండా తినడం, రుచిని ఆస్వాధిస్తూ తినడం వల్ల మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.
అధిక బరువు
తగినంత ప్రోటీన్ తినడం లేదు
బరువు తగ్గేందుకు ప్రోటీన్ ఫుడ్ ఎంతగానో సహాయపడుతుంది. ఎన్నో అధ్యయనాలు కూడా అధిక ప్రోటీన్ ఆహారాన్ని తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారని వెల్లడించాయి. ప్రోటీన్ ఫుడ్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది పలు అధ్యయనాలు చెప్పాయి. ప్రోటీన్ ఫుడ్ కడుపును తొందరగా నింపుతుంది. ఇది మీరు బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఊబకాయం ఉన్న పెద్దలలో అడపాదడపా ఉపవాసం ఉన్న సందర్భాల్లో ప్రోటీన్ తినడం ప్రభావం చూపకపోవచ్చు. అందుకే బరువు తగ్గడానికి ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడు ప్రభావవంతంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం.
అధిక బరువు
చక్కెరను ఎక్కువగా తింటున్నారు
చక్కెరతో చేసిన ఆహారాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి మీ బరువును అమాంతం పెంచుతాయి తెలుసా? అవును చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చక్కెర పానీయాల్లో కొవ్వును పెంచే అంశాలు ఉంటాయి. పండ్ల రసాలను కూడా ఎక్కువగా తాగకూడదు. ముఖ్యంగా బయట దొరికే పండ్ల రసాలను తాగకపోవడమే మంచిది. పండ్ల రసాల్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తాగినా మీరు బరువు పెరిగిపోతారు.
సరిగ్గా నిద్రపోవడం లేదు
పనిచేసినా.. చేయకున్నా.. మన శరీరానికి నిద్ర చాలా చాలా అవసరం. మన మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం నిద్రవల్ల ప్రభావితం అవుతుంది. కంటినిండా నిద్రపోకపోవడం వల్ల కూడా ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి కూడా. తగినంత నిద్ర లేకపోవడం, ఎక్కువ నిద్రపోవడం రెండూ ఊబకాయంతో సంబంధం కలిగి ఉన్నాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి పెద్దలు ప్రతిరాత్రి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కౌమారదశలో 8–10 గంటలు, పిల్లలు, శిశువులు 9–16 గంటల పాటు నిద్రపోవాలని సిఫార్సు చేయబడింది. ఫైనల్ గా చెప్పేదేంటంటే.. పేలవమైన నిద్ర కూడా మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది తప్ప తగ్గడానికి కాదు.
అధిక బరువు
మీరు కార్బోహైడ్రేట్లను తగ్గించ లేదు
మీరు బరువు తగ్గడానికైనా, బయాబెటీస్ ఉన్నా, ప్రీడయాబెటీస్ ఉన్నా కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి మీ శరీర బరువును పెంచడంతో పాటుగా షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మీ ఆహారంలో పిండి పదార్ధాలను తగ్గిస్తే మీరు బరువు తగ్గే అవకాశం ఉంది. 2018లో జరిపిన ఒక ట్రయల్‌లో పోషకాలు ఎక్కువగా ఉండే, తక్కువ కొవ్వులు ఉన్న ఆహారం, పోషకాలు ఎక్కువగా ఉండే, తక్కువ కార్బ్ డైట్ ఫలితాల్లో తక్కువ తేడా కనిపించింది.