రంజాన్ స్పెషల్ : ఉపవాసానికి ఊపునిచ్చే సోయాబీన్ పరాఠా..

First Published | Apr 14, 2021, 1:28 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఎంతో పవిత్రంగా భావించే మాసం రంజాన్ మాసం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో తొమ్మిదవ నెల ఈ రంజాన్ లేదా రమదాన్ వస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఎంతో పవిత్రంగా భావించే మాసం రంజాన్ మాసం. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో తొమ్మిదవ నెల ఈ రంజాన్ లేదా రమదాన్ వస్తుంది.
undefined
దీన్ని ఎంతో ముస్లిం సమాజంలో పవిత్రమైన నెలగా పరిగణిస్తారు. ఈ యేడు భారతదేశంలో బుధవారం (ఏప్రిల్ 14) నుంచి రంజాన్ నెల ఉపవాసాలు ప్రారంభమయ్యాయి.
undefined

Latest Videos


ఈ పవిత్రమాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఇప్పటివరకు తెలిసో, తెలియకో చేసిన తమ తప్పులను క్షమించమని అల్లాను కోరతారు. ఇప్పటినుంచి తమ జీవితాన్ని నడిపించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు.
undefined
దీనికోసం నెలమొత్తం ఉపవాసాలు ఉంటారు. సూర్యోదయానికి ముందు మొదలైన ఈ ఉపవాసం సూర్యాస్తమయం తరువాత ముగుస్తుంది.
undefined
సెహ్రీ లేదా సుహూర్ అని పిలవబడే భోజనంతో సూర్యోదయానికి ముందు ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. ఇది మంచి పోషకాహారం కావడం వల్ల శరీరానికి ఎక్కువ గంటల పాటు ఆహారం లేకున్నా తట్టుకుని ఉండగలుగుతారు.
undefined
రాత్రి పూట ఇఫ్తార్ అనే విందు భోజనంతో సూర్యాస్తమయానికి ఉపవాసం ముగుస్తుంది. అయితే ఎక్కువ గంటలపాటు ఆహారం లేకుండా ఉండడం వల్ల శరీరం నీరసించి పోకుండా ఉండడానికి సెహ్రీ లేదా సుహూర్ సమయంలో తినడానికి సోయాబీన్ పరాటా మంచి పోషకాహారం..
undefined
సోయాబీన్ పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు..1 కప్పు నానబెట్టిన సోయాబీన్ గ్రాన్యూల్స్2 కప్పుల మైదాపిండి లేదా గోధుమ పిండి1 టేబుల్ స్పూన్ వంటనూనె1 ఉల్లిగడ్డ (సన్నగా తరగాలి)1 టేబుల్ స్పూన్ పసుపు2 పచ్చిమిర్చి (సన్నగా తరగాలి)2 టేబుల్ స్పూన్ల పాలు1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్2 బంగాళదుంపలు (ఉడికించి, మెత్తగా చిదుముకోవాలి)రుచికి తగినంత ఉప్పు
undefined
సోయాబీన్ పరాటా తయారు చేసే విధానం..పాన్ లో కొంచెం నూనె వేసి అందులో ఉల్లిపాయలు వేయించి.. కాస్త వేగాక అందులో పసుపు, పచ్చిమిర్చి, సోయా గ్రాన్యూల్స్ వేసి బాగా కలిపి దీంట్లో కొంచెం పాలు వేసి ఉడికించాలి.
undefined
ఈ మిశ్రమాన్ని పాలు మొత్తం ఇగిరిపోయేదాకా ఉడికించి దించేయాలి. ఆ తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప చిదిమి అందులో ఈ సోయాబీన్ మిశ్రమాన్ని, కాస్త ఉప్పు, కొంచెం గరం మసాలా వేసి బాగా కలపాలి.
undefined
ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని పూరీలా ఒత్తుకుని అందులో మధ్యలో ఈ మిశ్రమాన్ని పెట్టి చివర్లు కలిపేయాలి. ఆ తరువాత నెమ్మదిగా పరాటాలా చపాతీ కోలాతో బెలాయించాలి. ఓ పెనం మీద చాలా తక్కువ నూనె వేసి కాల్చాలి.అధిక ప్రోటీన్లతో కూడిన ఈ పరాఠాలు మిమ్మల్ని ఎక్కువ సేపు ఆకలికి ఓర్చుకుని ఉండేలా సంసిద్ధం చేస్తాయని మాస్టర్ చెఫ్ సంజీవ్ కపూర్ రిఫర్ చేస్తున్నారు.
undefined
ఈ సారి రంజాన్ ఎండాకాలంలో వచ్చినందున ఆహారంలో, పుచ్చపండు, మస్క్ మిలన్,దోసకాయ, టమోటాలు లాంటి నీరు సమృద్ధిగా ఉండే పండ్లు,కూరగాయలను చేర్చుకోవడం ద్వారా శరీరం హైడ్రేట్ కాకుండా ఉంటుంది.
undefined
దీంతో పాటు వేయించిన ఆహారపదార్థాలు, ఉప్పు ఎక్కువగా ఉండే వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇవి దాహాన్ని పెంచడమే కాకుండా శరీరాన్ని డీ హైడ్రేట్ అయ్యేలా చేస్తాయి.
undefined
click me!