గుమ్మడి కాయే కాదు.. గుమ్మడి గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుమ్మడి గింజలు ఎన్నో ప్రమాదకరమైన రోగాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ గుమ్మడి గింజలు (pumpkin seeds) గుండెపోటు (Heart attack)రాకుండా మనల్ని రక్షిస్తాయని చెబుతున్నారు.
27
కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే వీటి గింజలను బయటపారేస్తుంటారు. అసలు గుమ్మడి గింజలు మనకు చేసే మేలు గురించి తెలిస్తే ఇలా చేయరేమో. ఇంతకీ గుమ్మడి గింజలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పదండి.
37
మధుమేహులకు గుమ్మడి గింజలు చక్కటి ఔషదంలా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ సంగతి చాలా మందికే తెలుసు. ఇదే కాదు గుమ్మడి గింజలు ఎన్నో రోగాలను నయం చేస్తాయి.
47
అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారికి ఇవి చక్కటి మెడిసిన్ లా ఉపయోగపడతాయి. వీరు ఈ గింజల్ని క్రమం తప్పకుండా తీసుకున్నట్టైతే ఒంట్లో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
57
ఇక ఇందులో ఉండే యాంటీ డయాబెటీక్ గుణాలు మధుమేహుల రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.అందుకే మధుమేహులు వీటిని తరచుగా తినాలని వైద్యులు చెబుతుంటారు.
67
ఇక గుమ్మడి గింజలు సంతానోత్పత్తి సమస్యలను దూరం చేస్తాయి. పురుషులు వీటిని క్రమంగా తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండే వారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
77
గుమ్మడి గింజల్లో జింక్, అమైనో ఆమ్లాలు, భాస్వరం, ఫినోలిక్ సమ్మేళనాలు. కొవ్వు ఆమ్లాలు, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకలను ద్రుఢంగా చేయడంతో పాటుగా ముఖంపై మొటిమలను తగ్గిస్తాయి. అలాగే హెయిర్ ఫాల్ సమస్యను కూడా పోగొడుతాయి.