anti aging food: వయసు మీద పడుతున్న కొద్దీ ముఖంపై ముడతలు, జట్టు తెల్లగా నెరసిపోవడం సర్వ సాధారణం. కానీ చాలా మంది ఇవి ఇప్పుడే రావాలా అని తెగ ఫీలయిపోతుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే మీరు నిత్య యవ్వనంగా ఉంటారు. అవేంటంటే..
anti aging food: జుట్టు నెరసిపోవడం, ముఖంపై ముడతలు ఏర్పడటడం, చర్మంపై గీతలు ఏర్పడటం.. వంటివన్నీ వృద్ధాప్యానికి చిహ్నాలు. ఇక ఈ లక్షణాలు కనిపిస్తే చాలు వామ్మో అప్పుడే వయసు మీద పడుతోందా? ఇవి ఇంకొన్ని రోజులయ్యాకా రావొచ్చు కదా అని తెగ ఫీలయిపోతుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలు వృద్ధాప్య ఛాయలను మటుమాయం చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
29
శరీరానికి సరిపడా నీళ్లను తాగుతూ.. యాంటీ ఆక్సిడెంట్లు, అధిక పోషకాలు, ఆరోగ్య కరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటే వాటిని తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు లేట్ గా వచ్చే అవకాశం ఉందని నిపుుణులు చెబుతున్నారు. ఇంతకీ మనల్నినిత్య యవ్వనంగా ఉంచే ఆహారాలేంటో తెలుసుకుందాం పదండి.
39
క్యాబేజీ.. క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ డి వంటి పోషకాలతో పాటుగా ఇండోల్ 3 కార్బినాల్, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మకణాలను రక్షించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ప్రమాదకరమైన సూర్యకిరణాల ఎఫెక్ట్ నుంచి కూడా కాపాడుతుంది.
49
క్యారెట్.. క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ ఎ గా మారి మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ జట్టుకే కాదు చర్మ సంరక్షణ కోసం కూడా తోడ్పడుతుంది. అంతేకాదు ఇది క్యాన్సర్ కణాలను అంతం చేయడానికి కూడా సహాయపడుతుంది. క్యారెట్లు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడానికి కూడా ఉపయోగపడతాయి.
59
ద్రాక్ష.. ద్రాక్షలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాలను దెబ్బతీసే ప్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఇక ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేయడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఇది సూర్యకిరణాల ప్రభావం మనపై చెడు ప్రభావం పకుండా కాపాడుతుంది.
69
ఉల్లిపాయ.. ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో యాంటీ ఏంజింగ్ లక్షణాలను కూడా ఉన్నాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను మటుమాయం చేస్తాయి.
79
టొమాటోలు.. టొమాటోలో యాంటీ ఏజింగ్, లైకోపీన్, యాంటీ కేన్సర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో సమస్యలను తగ్గించడానికి దివ్య ఔషదంలా పనిచేస్తాయి.
89
పాలకూర.. పాలకూర యాంటీ ఏజింగ్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ కూర కళ్ల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది వృద్ధాప్య ఛాయలను సైతం పోగొడుతాయి.
99
వీటితో పాటుగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు కూడా వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. ఇందుకోసం బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, జొన్నలు, సజ్జలు వంటివి తీసుకుంటూ ఉండాలి. ఇవి ముఖం, చర్మంపై ముడతలను తగ్గిస్తాయి.